edo_oka_ragam Posted January 12, 2015 Report Posted January 12, 2015 ఆనందం Alias సంతోషం .. ప్రతి మనిషి లేచింది మొదలు నిద్రపోయే వరకూ కోరుకునేది ఇదే.. ఆలోచనలో, చేసే పనిలో తినే తిండిలో తనకు సంబంధించిన అన్నిటిలో వెతుక్కునేది ఆనందం. నేను ఆనందంగా లేను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.అందులో ఒకప్పుడు నేనూ ఒక వ్యక్తినే. అవును. ఒకప్పుడు నేనూ అలానే ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా అన్నిటికి ఏడుస్తూ .. ఎవరయినా నమ్మగలరా ?? నేనూ వర్షం అంటే చిరాకు పడేదాన్ని. అలా అని ఎండ అంటే ఇష్టం కాదు.చలి వేస్తే ఏంటి ఇది ఇంత చల్లగా ఉంది అని. బాధపడటానికి కారణాలు వెతుకుతూ ఉండేదాన్ని. చివరకు తినేటప్పుడు కూడా అంతే..కొంచెం కారం కానీ, పులుపు కానీ, ఉప్పు కానీ ఏది ఎక్కువ, తక్కువ అయిన కూడా ఏదో విరక్తి భావన మొహంలో స్పష్టంగా ప్రస్పుటించేది.మనుషుల్ని చూసినా అంతే ఉండేది. పెద్ద గా నవ్వినా, చివరకు చిన్న పిల్లలు ఏడ్చినా, అల్లరి చెసినా..నన్ను ఎవరినా నిద్ర లేపినా, సమయానికి అనుకున్న పని జరగక పోయినా, నా చుట్టూ ఉండే వాళ్ళు క్రమశిక్షణ గా లేకపోయినా ఇలా చెప్పుకుంటే పోతే చాలా...( తెనాలి సినిమా లో కమలహాసన్ కి భయం దేనికి అంటే ఒక పెద్ద చిట్టా విప్పుతాడు.. అలానే నేనూ కూడా దేనికి సంతోషం లేదు అంటే చాలా పెద్ద చిట్టా విప్పుతాను). చిన్నప్పటి నుండి ఇంట్లో పెరిగిన దానికన్నా కూడా బయట హాస్టల్ లో గడిపిన సమయం ఎక్కువ. నిజం...!! మంచి చదువు కోసం ఆ తర్వాత ఉద్యోగం కోసం నేనూ ఇప్పటి వరకూ నా సగం పైన జీవితం బయటే ఎక్కువ.అందువల్ల బయటకి ఎప్పుడు నవ్వుతూ ఉన్నా ఏదో ఒక చిరాకు, అసహనం ఉండేవి. బుద్ధుడు మనుషులు దేనివల్ల ఇన్ని కష్టాలు పడుతున్నారు అని తెలుసుకోవడానికి బయలుదేరినట్లు నేను కూడా నా సంతోషం ఎక్కడుందో తెలుసుకుందాం అని అనుకుంటూ ఉండేదాన్ని. నాకు నా ఉద్యోగం లో భాగం గా నే ఫ్రాన్స్ లో పని చేసే అవకాశం వచ్చింది. అప్పుడు చాలా రోజులు నా ఫ్యామిలీ దూరం గా ఉండటం(Home sick) ఈ అవలక్షనాలన్ని తారస్థాయికి చేరుకున్నాయి. అక్కడ నా స్నేహితురాలు నన్ను చూసి తనకు చిరాకేసి ఒక రోజు నేను ఏడుస్తుంటే చెప్పింది. "ప్రపంచం లో కష్టాలు అన్ని నీకు ఒక్కదానికే ఉన్నట్లు చిన్నవాటి కే ఫీల్ అవుతుంటావు. నీకు తెలిసిన ప్రతి వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నాయి. అలా అని అందరూ నీలా ఉన్నారా?చిన్నప్పటి నుండి కష్టం లోనే పెరిగిన వాళ్ళు ఉన్నారు. అని ఎన్నో ఉదాహరణలిచ్చింది.వాళ్ళంతా నీ చుట్టూ ఎంతో ఆనందం గా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం చిన్నది లేదు పెద్దది లేదు అన్నిటికి బాధ పడుతుంటావ్. అసలు నీకున్న కష్టాలేంటి?ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు" అని. ఆలోచించిస్తూ ఇంటి నుండి అలా బయటకి వచాను. చిన్న చినుకులు గా మొదలయిన వాన పెద్ద వర్షం గా మారింది. ఆ వర్షం నాకిప్పుడు చిరాకుగా లేదు. ఎంతో నుతనోత్సాహాన్నిఇచ్చింది. అలా ఎంత సేపు ఆలోచిస్తూ తడిచానో గుర్తు లేదు కానీ అది మొదలు మళ్లా ఎప్పుడు వాన అంటే చిరాకు లేదు వాన ఒక్కటే కాదు.వానతో పాటు మిగిలినవన్నీ కూడా... అప్పటి నుండీ నేను ఒకటి తెలుసుకున్నాను ఆనందం అనేది ఎక్కడో లేదు మనసులో ఉంటుంది అని. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం, అసహనం లాంటివి పక్కన పెడితే..మనతో పటు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆనందం గా ఉంటారు. అప్పుడే ప్రపంచం కూడా అందం గా, ఆనందం గా కనిపిస్తుంది. చేసే ప్రతి పని లో ఆనందం, చిన్న విషయాలకే ఆనందం గా ఉండటం నేర్చుకున్న.. పక్కనుండే వాళ్ళని కూడా సంతోషపెడుతున్నా. వాన, ఎండ,చలి ఇవన్ని అవసరం. మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఏది లేకపోయినా సమతుల్యత అనేడి ఉండదు. అప్పుడు మనషి జీవితం దుర్భరం. అదే అన్నిటికి ఆనందం గా ఉంటే ప్రతి రోజు వసంత ఋతువే. నవ్వు, చిన్నపిల్లల ఏడుపు అది ఓదార్చాలని మనం చేసే ప్రయత్నం అన్ని ఆనందం కలిగించేవే. ఇవన్ని అప్రయత్నం గానే పక్కవాళ్ళ మీద ప్రేమను కలిగిస్తాయి. అది ఉన్న చోట కలహాలే ఉండవు. చిరు కోపం తప్ప :). అది కూడా ఆనందమే..చిన్న చిన్న విషయాలకు ఆనందం గా ఉండటం వల్ల పెద్ద కష్టాలు కూడా ఈ ఆనందం అనే వరదలో కొట్టుకుపోతాయి. బాధలు Alias కష్టాలు చాలా మనపై స్వారీ చెసినా కూడా మనం ఆనందం Alias సంతోషం గా ఉంటే మనమే వాటిఫై స్వారీ చెయ్యవచ్చు.ఇలా చెసినా రోజున జీవితం రంగులమయం. So finally.. ఎవరో చెప్పినట్లు... “Happiness is the meaning and the purpose of life, the whole aim and end of human existence”. You will never be happy if you continue to search for what happiness consists of. You will never live if you are looking for the meaning of life. Happiness is nothing more than good health and a bad memory.
Nellore_peddareddi Posted January 12, 2015 Report Posted January 12, 2015 Intha chadve opika evadiki ledu ikkada
Recommended Posts