Jump to content

Recommended Posts

Posted

చెన్నై: ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రేఖ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు నాలుగు వారాల పాటు ఆమెను ఉద్యోగంలో కొనసాగనివ్వాలని టీసీఎస్ కు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఐటీ ఎనలిస్ట్ గా పనిచేస్తున్న రేఖను జనవరి 21 నుంచి ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు టీసీఎస్ ఆమెకు సమాచారమిచ్చింది.

గర్భవతిగా ఉన్న తనను ఉద్యోగం నుంచి తీసేయడం అన్యాయమని ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. ఇది పారిశ్రామిక వివాదాల చట్టం1947 ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. 2011, మార్చిలో టీసీఎస్ లో చేరినట్టు ఆమె తెలిపింది. కాగా, గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో  2,574 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది.

Posted

3 months free ga iche jeethaniki kooda eeme pani chestha ante tcs oodu happyga cheyinchukuntadu pani 

×
×
  • Create New...