Jump to content

:)


Recommended Posts

Posted
మామిడి కాయల దాహం : దొంగతనం
 
1214224140967_Mango_tree_.jpg

పేరు చూడగానే మీకు అర్ధం అయ్యి ఉంటుంది దేని గురించి చెప్తున్నానో ..

T.V లో maaza add చూపిస్తుంటే illogical అనుకున్నా.. కానీ వేసవి కాలం వస్తే గాని తెలియలేదు అది కూడా నిజం అయ్యే అవకాశం ఉండవచ్చని మామిడి కాయల(పండ్ల) కోసం

మేముండేది working women’s hostel లో.అది 6 storied building .మాది 1st floor.పక్కనే పెద్ద మామిడి చెట్టు(ofcourse అది పక్కింటి వాళ్ళది లెండి).

మామూలు రోజుల్లో ఆ చెట్టుని చూస్తే పెద్దగా ఏమీ అనిపించేది కాదు( చెట్టు ని చూస్తే ఎవరికయినా ఏమీ అనిపించదు అనొద్దు).కానీ అప్పుడప్పుడు photos తీసుకోడానికి ఏకైక spot మా floor అందరికీ అదే. రెండు సంవత్సరాల నుండి అదే hostel లో ఉండటం వల్ల ఆ చెట్టుకి మాకు మంచి అనుబంధమే ఉంది .

ఉగాది నుండి అంటే ఆ మామిడి చెట్టుకి పిందెలు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాం ఎప్పుడెప్పుడు కాయలు వస్తాయా అని. వేసవి కాలం వచేసింది. చెట్టుకి కాయలు కాశాయి.

చిన్నప్పటి నుండి ఎప్పుడయినా మామిడి కాయలు దొంగతనం చేయాలని మహా కోరిక. చివరకి దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అంటే తిరుపతి నుండి కాణిపాకం వెళ్ళే దారిలో బోలెడు ‘ చిత్తూరు ‘ మామిడి కాయలు ఉన్న చెట్లు కనిపిస్తాయి. అప్పుడు కూడా అనిపించేది కనీసం ఒక్క కాయ అయినా దొంగతనం చెయ్యాలని. కానీ కొన్ని బలమయిన కారణాల వల్ల(ofcourse అవేంటో నాకు తెలియదు)చేయలేకపోయాను.

అలా నాలో నిద్రాణమయి ఉన్న కోరికను ఒక్కసారిగా బలంగా లేపాను. ఎలా అయినా పక్కింటి వల్ల మామిడి కాయలు దొంగిలించాలని.నాతో పాటు మాధవి,రజని కి కూడా ఇదే కోరిక కలిగింది(కాదు కాదు కలిగేలా చేశాను).

ముగ్గురము కుర్చుని ఒకానొక నిశి రాత్రిలో (అంటే summer కదా power లేదు. ofcourse seasonతో సంబంధం ఉండదు అనుకోండి మనకి power ఉండకపోవడానికి).Ofcourse దొంగతనం చేయడానికి మంచి ambience అదే అనుకోండి. అలా చీకటిలో మంచి వెలుగు ఉన్నఆలోచనలు వచ్చాయి.

Morning కొంచెం త్వరగా ఆఫీసుకి వెళ్ళాలి కాబట్టి night అంటే after 8 plan చేసాము.మొత్తానికి మూడు plans వచ్చాయి.

Plan A: మేము చెట్టు ఎక్కి కాయలు కోసుకోవడం(కొంచెం risky నే గాని workout అయితే బాగుంటుంది అని వేశాము ఈ plan)

Plan B: రాళ్ళు విసరడం(ఇది easyనే గాని మన చేతిలోకి కాయలు వచ్చే probability తక్కువ)

 

Plan C : కర్రకి కొక్కెం(hook) కట్టి కోయడం(పైన చెప్పిన రెండిటికి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది)

ఒక శుక్రవారం రాత్రి plan A ని ఆచరణలోకి తెచ్చాము. ముందుగా చెట్టు ఎవరికి ఎక్కడం వచ్చు చెయ్యి ఎత్తండి అనగానే ఒకే ఒక చెయ్యి పైకి లేచింది.అది మాధవిది(attendance వేస్తే present sir అని చెప్పినట్లుగా)

కాకపోతే చెట్టు ఎక్కడము కొంచెం(కాదు చాలా) కష్టము అందుకని ముందుగా గోడ ఎక్కి కొమ్మని పట్టుకుని లాగడం , వీలయితే పాకి చెట్టు ఎక్కడం చేద్దాం అనుకున్నాం. మాధవి గోడ మీద కుర్చుని(కోతి లాగ) కొమ్మని కష్టపడి అందుకుని గట్టిగా లాగింది(ofcourse కొంచెం smooth గా handle చేస్తే బాగుందేమో).మాధవి apply చేసిన force కి కొమ్మ తెగి అవతలికి పడింది.madam గారు వెనక్కి అంటే మా వైపుకు పడిపోయారు.

నాకయితే ముందు newton third law గుర్తుకొచ్చింది.For every action there is equal and opposite reaction ani.వచ్చే నవ్వుని ఆపుకుంటూ తనని లేపి కుర్చోపెట్టాము కొంచెం water ఇచ్చి.పాపం తనకి 2 days body pains వెనక్కి పడటం వల్ల.

Successful గా plan A utter flop

Life must go on …we must move on to plan B anukunnam

Plan B implementation:

రాళ్ళు విసరడం.మా హాస్టల్ కి కొంచెం దూరంలో అగ్గిపెట్టె పార్క్ ఉంది(చాలా చిన్నది కాబట్టి అందరూ అలా పిలుస్తారు).morning walking కి వెళ్ళినట్లు వెళ్లి అక్కడ అందరూ fitness కోసం try చేస్తుంటే మేము ఏ రాయి మాకు best fit వేసికొట్టడానికి అని concentrate చేస్తున్నాం.అతి కష్టం మీద కొన్ని రాళ్ళు ఒక cover లో వేసుకుటుంటే అక్కడ జనాలు మమ్మల్ని చాలా variety గా చూశారు.but వాళ్ళెవరో మాకు తెలియదు. రేపు ఎటూ walking కి రాము వీళ్ళ చూపులతో మాకు పనేంటి అనుకుని light తీసుకున్నాం .

మంగళవారం evening(ఆఫీసు నుండి తొందరగా వచ్చి మరీ)plan B start చేశాం.ఒక పెద్ద మామిడి కాయకి గురి చూసి విసిరాను .నాది మరీ అర్జునుడి అంత గురి కాదండి అందుకని అది ఎటో పడిపోయింది.అలా చాలా సార్లు ప్రయత్నించగా దాని కన్నా చిన్నకాయకి తగిలింది.కొంచెం గట్టిగా తగలడం వల్ల రాయి ,కాయ రెండూ అవతలి వైపు పడిపోయాయి.(అప్పటి దాక బిక్క మొహం వేసిన ఆ పెద్ద కాయ "better luck next time" అని గట్టిగా నవ్వింది.)అక్కడ ఎవరో ఒక అతని బట్ట తల(ఇండియా మ్యాప్ కనిపిస్తుంది పైనుండి చూస్తే)మీద పడింది .దానితో అతను పెద్ద గా అరిచాడు.మేము ఒక్క గంతులో లోపలికి వేల్లిపోయము. మళ్లీ ఒక 5 నిమిషాల తర్వాత ఏమీ తెలియనట్లు నుంచుని చూశాము. అతను అరచి అరచి అలసి పోయి సరేలే ఇవాళ రాత్రి కి మామిడికాయ పప్పు పెట్టుకుంటా దీనితో అనుకుంటూ వెళ్ళిపోయాడు(what a positive spirit కదా). కష్టపడింది మేము పప్పు వాడికి అని మేము కొంచెం సేపు బాధపడ్దాము.

So plan B partially flop

Moved on to planC:

కర్రకి hook కట్టడం:

పెద్ద కర్ర కోసం వెతికాము.ఖచ్చితంగా దొరకదు మా హాస్టల్ లో.but we never give up.ఈసారి రజని మంచి ఐడియా ఇచ్చింది.చీరలు కొన్నప్పుడల్లా RS brother’s లో ,chandana borther’s లో ..కర్రల సంచులు చాలానే ఉన్నాయి రూంలో. వాటిలో ఒక 6 కర్రలు కొంచెం గట్టిగా ఉండేవి తీసి వాటిని తాడుతో మా శక్తిని అంతా ఉపయోగించి కట్టేశాము. ఇక ఇప్పుడు hook లాంటిది ఏదైనా వెతికాము.ఇంతలో hanger కనిపించింది. దానికి hook shape lo ఉన్నదాన్నికష్టపడి ఒక కత్తితో కోసి దాన్ని ఆ కర్రకి కలిపి గట్టిగా కట్టేశాము.so our instrument is ready to use.

అలా యుద్దానికి సన్నద్ధులమై శనివారం రాత్రి మొదలు పెట్టాము:

కొంచెం smoothగా handle చేయాలి.ఇక ఇది కుడా flop అయితే వేరే plans కోసం మేము brain storming చేయాల్సి ఉంటుంది.అంత ఓపిక ,సమయం రెండూ లేవు మాదగ్గర .కాబట్టి ఈసారి కాయ చేతికి రావలసిందే అని మొదలుపెట్టాము.

రజని వంతు ఈసారి .తను గోడ మీద కూర్చుంది.మేము తనకి కింద నుండి ఆ కర్రని చాలా జాగ్రతగా అందించాము. తను ఆ hook ని ఆ పెద్ద కాయ(నవ్వింది కదా)ఉన్న కొమ్మకి తగిలించి దాన్ని మెల్లగా లాగి ఆ కాయ ని చేతిలో కి తీసుకుంది.అది అదృష్టమో, దురదృష్టమో(ఎందుకిలా అన్నాను అంటే తర్వాత తెలుస్తుంది మీకు ) తెలియదు కానీ మొతానికి మేము అనుకున్నట్లు గా మామిడి కాయని కోసి మెల్లగా గోడ మీద నుండి దిగింది. హమ్మయ్య motto successful అనుకున్నంత సమయం పట్టలేదు మా floor gang leader రాధ అందరిని వెంటేసుకుని వచ్చింది."మీరు మామిడికాయలు దొంగతనం చేయాలి అనుకున్న రోజునుండి చూస్తున్నాం ,మీరు మామిడికాయ కొస్తే share అడుగుదాము అని.మా వాటా ఇవ్వండి లేకుంటే hostel aunty కి చెప్పేస్తాం"అని బెందిరించింది తన పెద్ద కళ్ళతో .మూడు వాటాలు చేయాల్సిన ఆ కాయని 10 వాటాలు వేయాల్సి వచ్చింది.దానితో నేను బాధాతప్త హృదయంతో నా రూంలోకి వెళ్లి బెడ్ మీద కూర్చున్నా.

ఈలోపు నాకు ఎక్కడినుండో “మహి ,మహి 6.45 అయింది .లే.లేచి స్నానం చెయ్యి.ఆలస్యం అయితే బస్సు దొరకదు(అంటే మా ఆఫీసు బస్సు).అసలే చాలా పని ఉంది ఆఫీసులో అన్నావ్ కదా “అని రజని పెద్ద పెద్దగా అరుస్తూ నన్ను నిద్ర లేపింది.

నేను కళ్ళు నులుముకుంటూ ఒక్క సారి ఆశ్చర్యచాకితురలినై మామిడికాయ ఏది అని అడిగాను తనని.కష్టపడి దొంగతనం చేశాముగా అని అడిగాను.వెంటనే తను మామిడికాయ ఏంటి దొంగతనం ఏంటి ."R u ok మహి ?"అని అడిగింది అమాయకంగా.. అయ్యో !! ఇది అంతా కలేనా అంటూ లేచాను.ఏమి కల మహి అని అడిగింది.సాయంత్రం వచ్చి చెప్తాను అన్నాను.

మొత్తానికి నా కల కలలాగానే మిగిలిపోయింది.

Posted

nuv nijam ga ammayvaithe aadhar card submit chesi prove chesko nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

Posted

R U Ok?

Posted

matter in 2 lines plz brahmi_laugh.gif

+ telugu ni english lo raai pls..gallery_8818_6_385253.gif?1367349476

Posted

+ telugu ni english lo raai pls..gallery_8818_6_385253.gif?1367349476

evadi kamedy vadidhi,.kanivvandi brahmi_laugh.gif

Posted

nuv nijam ga ammayvaithe aadhar card submit chesi prove chesko nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

aadhar card aa..nen inka andhar dhi pettukoni prove cheskomantavankuna..gallery_8818_6_385253.gif?1367349476

Posted

r u sankhar dada MBBSbrahmi_laugh.gif

r u detective..

 

rahul sneha anav..

ipudu shankar dada antunav..

 

gallery_8818_6_385253.gif?1367349476

Posted

aadhar card aa..nen inka andhar dhi pettukoni prove cheskomantavankuna..gallery_8818_6_385253.gif?1367349476

 

gallery_8818_6_385253.gif?1367349476

Posted

matter in 2 lines plz brahmi_laugh.gif

 

kudrithe 2 words la plzzgallery_8818_6_385253.gif?1367349476

Posted

kudrithe 2 words la plzzgallery_8818_6_385253.gif?1367349476

Ee VishalaPrashanthaEkantha Soudhamlo... Nidhurinchu ...Jahapana

×
×
  • Create New...