Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో.. హైదరాబాద్కు చెందిన ఓ ఇంజనీర్ను తెలంగాణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు.

ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (22)ను నిఘావర్గాల సమాచారం ఆధారంగా భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. మొయినుద్దీన్ హ్యూస్టన్లో ఎంఎస్ డిగ్రీ చేశాడు. తాను ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అతడు ఒప్పుకొన్నాడని పోలీసులు చెప్పారు. అతడు బ్రిటిష్ జాతీయురాలైన తన స్నేహితురాలితో కలిసి దుబాయ్ వెళ్లి, అక్కడినుంచి సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

×
×
  • Create New...