Jump to content

Recommended Posts

Posted

భార్య పురిటికిఅడుగడుగునా సిబ్బంది లంచాలు
పేద భర్త మనస్తాపం.. సూపరింటెండెంట్‌ తో ఘర్షణ
రెండేళ్ల కొడుకుతో సహా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య
మహబూబ్‌నగర్‌ పట్టణంలో దారుణం
‘‘పురుడు పోస్తే లంచం 
బొడ్డు కోస్తే లంచం..’’ అంటూ సాగే ఓ సినిమా పాటకు 

అసలైన అర్థం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో కనిపించిందీ అభాగ్యుడికి! కాన్పు కోసం భార్యను ధర్మాసుపత్రికి తీసుకె ళ్లిన ఈ నిరుపేద భర్త.. అడుగడుగు లంచాలు చెల్లించుకోలేక కుదేలయ్యాడు. భార్య పండంటి మగబిడ్డను ప్రసవించిన రెండురోజులకే.. రెండేళ్ల పెద్ద కొడుకుతో సహా రైలు కింద పడి చనిపోయాడు! లంచావతారులపై సూసైడ్‌ 
నోట్‌లో నిప్పులు చెరిగాడు జూ రైలు పట్టాలపై ముక్కలు
జూ మహబూబ్‌నగర్‌ పట్టణంలో దారుణం
మహబూబ్‌నగర్‌ క్రైం, జనవరి 22 : ‘‘మా దగ్గర ఒక్క రూపాయీ తీసుకోమని చెప్పారు. అవును కాబోలని నమ్మినందుకు నన్ను అంతా బకరాను చేశారు. స్ర్టెచర్‌పైకి ఎక్కించాలన్నా డబ్బులు! కాన్పు తరువాత.. బట్టలు మార్చాలన్నా డబ్బులు! ఎల్‌ఆర్‌లోనూ, ఓపీలోకి మారేటప్పుడూ అంతే! అయినా..ఆపరేషన్‌ టైంలో బయట నుంచి మందులు తీసుకురావాలని ఎందుకు చెబుతారని అడుగుతున్నాను’’ అంటూ.. మహబూబ్‌నగర్‌ పట్టణం వీరన్నపేట రైల్వేగేటు వద్ద ముక్కలయిపోయిన ఒక తండ్రి, ఒక భర్త ప్రశ్నిస్తున్నాడు. పెద్దాసుపత్రుల్లో పెద్ద మనసుని వెతుక్కుంటూ పోయి..నిలువునా దగాపడి..రగిలి.. రాలిపోయిన పేదవాడి ఎద మంటకు సూసైడ్‌ నోట్‌ సాక్ష్యంగా నిలుస్తోంది. మగబిడ్డకు జన్మనిచ్చి భార్య ఆస్పత్రిలో ఉండగా.. మరో మగబిడ్డను వెంటేసుకొని రైలు పట్టాలపై కొండాపురం చెన్నకేశవులు తెగిపడ్డాడు. పోలీసుల కథనం, ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ని బట్టి.. మహబూబ్‌నగర్‌ పట్టణం కురిహినిశెట్ఠికాలనీకి చెందిన కొండాపురం చెన్నకేశవులు నాగలక్ష్మికి ఒక మగబిడ్డ. కేశవులు మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. నాగలక్ష్మి మరోసారి పురుడు పోసుకునేందుకు ఈ నెల 18వ తేదీన పట్టణంలోని పెద్దాసుపత్రిలో చేరింది. మరునాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కేశవులు పొంగిపోయాడు. అక్కడున్న సిబ్బందికి, ఆయాలకు ఆ విషయం చెప్పుకొని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ ఆనందం తీరకుండానే.. ఒకరి తర్వాత ఒకరుగా స్టాపు బారులు తీరారు. ‘బిడ్డ పుట్టాడు కదా! మాకేమన్నా ఇయ్యండి’ అని ఒకరు అంటే, ‘బట్టలు మార్చినందుకు ఇంత ఇవ్వాలి’ అని మరొకరు డిమాండ్‌ చేశారు. తల్లికి సేవలు, బిడ్డకు స్నానం.. ఇలా చీటికీమాటికీ చేతులు చాపుతుండటంతో కేశవులుకు చిర్రెత్తుకువచ్చింది. ‘అదేంది? ఇక్కడంతా ఉచితమే కదా’ అంటే ఎద్దేవాగా నవ్వి రెట్టింపు స్వరంతో మామూళ్లు అడిగేవారు. ఈ వ్యవహారమేదో పెద్ద డాక్టర్‌ దగ్గరే తేల్చుకొందామని కేశవులు, సూపరింటెండెంట్‌ శామ్యూల్‌ని కలిశాడు. ‘‘మీరు నన్నేమీ అడగలేదు. కానీ, మీ స్టాపు పైసలు ఇవ్వకుండే ఊరుకోవడం లేదు. ఇది నా ఒక్కడి బాధ కాదు. పేషెంట్లంతా ఇలాగే బాధలు పడుతున్నారు. అందుకనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. కానీ, మీరు వినిపించుకోలేదు’’ అని శ్యామూల్‌ను ఉద్దేశించి రాసిన సూసైట్‌ నోట్‌లో కేశవులు వాపోయాడు. ఈ సమయంలో డాక్టర్‌కూ, కేశవులుకూ మధ్య ఒకస్థాయిలో గొడవ జరిగింది. దీనిపై కేశవులు మనస్తాపానికి గురయ్యాడు. అమ్మ దగ్గర నిలబడి ఉన్న రెండేళ్ల కొడుకును రెక్క పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. ఆ తల్లి, కళ్లు తెరవని పసి కందు.. ఆస్పత్రిలోని పేషెంట్లు చివరిసారిగా అదే వారిని చివరిసారిగా చూడటం! ఆ తరువాత కొద్ది సేపటికే..ఒక సూసైడ్‌ నోట్‌ రాసి.. వీరన్నపేట రైల్వేగేట్‌ వద్ద కొడుకుతోపాటు సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి కేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Posted

India lo hospitals too much man...

 

chala daarunam...  sad to see that plight..and nobody can change it..

 

 

Posted

:3D_Smiles:  :3D_Smiles:  :3D_Smiles:  .. assalu aa 2 years chinna pillodu emi chesadu ani aaa babu ni thesukelladu ..... 

Posted

abbayi kadhu papa antaaa ... eenadu lo ichadu .

 

 

papam  :3D_Smiles:  :3D_Smiles:  :3D_Smiles:

Posted

Endi vayya pretidaniki suicide ye naa parishkaram!! Janalu inka mararaa  $s@d  $s@d Em sadhinchinattu?? Velaithey system change cheyyali ledante manam chage initiate cheyali anthegani.. ila cheyyadam lo artham ledu. Konchamin family gurinchi alochinchi vuntey baagundedi!!! RIP

Posted

So sad man ....

ede 1 yr back jarigi unte ... androla palana lo arachakam ane valuu .....

Posted

So sad man ....

ede 1 yr back jarigi unte ... androla palana lo arachakam ane valuu .....

 

+1 andulo doubt em undi..

Posted

So sad man ....
ede 1 yr back jarigi unte ... androla palana lo arachakam ane valuu .....


Chii....neeee
Posted

So sad man ....

ede 1 yr back jarigi unte ... androla palana lo arachakam ane valuu .....

 

shavala meeda chillara  comment 

Posted

shavala meeda chillara  comment 

 

nenu chipedii ade .. ila chillara ga comment chestharu ani.

×
×
  • Create New...