Jump to content

Recommended Posts

Posted

గోవింద గోవింద గోవింద గోవింద
కలడతండు సర్వలోకముల యందు
కలడు బహు పూర్వ కాలమునుండి
కలడతండు చతుర్యుగముల యందు
కలడు నేటి కలికాలమున కూడా
కల లాంటి కల్పితము ఆవలి వడ్డున
కలడు కాలసర్పమున నిదిరించుచు

గోవింద గోవింద గోవింద గోవింద
కలికాలము మొదలు ఇచట కొలువు దీరెను
కలి మాయను మాపుటకు మానుష్య రూపము లో వెలసెను
కలతలను తోలచుటకై   ఏడుకొండలు పై నిలిచే
కలడతండు కొలువులో,శ్రీదేవి భూదేవి సమేతుడై

కలకలమని మార్మోగెను కర్ణ మోహనమైన వెంకటేశ నామము

గోవింద గోవింద గోవింద గోవింద
కల కల మని మెరిసే కలికాలపు కలికితురాయిను కనుము
కన్నుల నడుమ  దివ్యమనోహరమైన తిరుమాన్ కాప్పు అందాలు దిద్దగా
కలిమి తో ఇరుప్రక్కలకు ఒదిగిన శంఖ చక్రాలు అభయమివ్వగా
కళ్యాణ శ్రీనివాసుడు కొలువైనాడు ఆదివరాహుని  కొలువు లో  


గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

 

Brahmi-8.gif

×
×
  • Create New...