Ruler4Dmasses Posted February 4, 2015 Report Posted February 4, 2015 గోవింద గోవింద గోవింద గోవింద కలడతండు సర్వలోకముల యందు కలడు బహు పూర్వ కాలమునుండి కలడతండు చతుర్యుగముల యందు కలడు నేటి కలికాలమున కూడా కల లాంటి కల్పితము ఆవలి వడ్డున కలడు కాలసర్పమున నిదిరించుచు గోవింద గోవింద గోవింద గోవింద కలికాలము మొదలు ఇచట కొలువు దీరెను కలి మాయను మాపుటకు మానుష్య రూపము లో వెలసెను కలతలను తోలచుటకై ఏడుకొండలు పై నిలిచే కలడతండు కొలువులో,శ్రీదేవి భూదేవి సమేతుడై కలకలమని మార్మోగెను కర్ణ మోహనమైన వెంకటేశ నామము గోవింద గోవింద గోవింద గోవింద కల కల మని మెరిసే కలికాలపు కలికితురాయిను కనుము కన్నుల నడుమ దివ్యమనోహరమైన తిరుమాన్ కాప్పు అందాలు దిద్దగా కలిమి తో ఇరుప్రక్కలకు ఒదిగిన శంఖ చక్రాలు అభయమివ్వగా కళ్యాణ శ్రీనివాసుడు కొలువైనాడు ఆదివరాహుని కొలువు లో గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
Recommended Posts