Jump to content

Recommended Posts

Posted

గరళము గ్రోలి గంభీరము గ నిలిచిన గౌరీనాదా,
జననము మరణము లేని స్థితి ని ఒసగుమయా
క్షణపాటు నీ పై లీనమైన మనసుకి స్థిమితము లేదు
ఆది అంతము లేని నీ దరి లో చేర్చవయా
నిశ్చలమైన  స్థితి లో నిను వీడని మనోవాటికపై నిలుపము
వేల వత్సరములు తపస్సు తో మహర్షులు జీవన సాఫల్యము పొందిరి
నిరతము ధ్యానము లో మునిగిన స్వామీ
ఈ జీవన్మ్రుత్యు కడలి నుండి ముక్తి కి మార్గము చూపుము

Brahmi-8.gif
 

Posted

మితము గ మాటలు ఆడుట నా దోషమా
మనంబున శోధన వేదన ప్రశ్నలు కుదిపిన తరుణము
నను నడిపించు వానివి నీ తో మాటల ప్రశ్నలే ఎరుంగుదును
సంఘర్షణమొక సరదా? వైరాగ్యము వైపు త్రోవ కు తోలిమేట్టా ?
ఎందులకీ మేలిమి వర్ణము? ఏల కల్పించితి రాగద్వేషములను
ఈ అందమైన ప్రకృతి లో నా వికృత ఆకృతిని నీలో లయింపుము

Brahmi-8.gif
 

×
×
  • Create New...