Jump to content

Recommended Posts

Posted
దత్తపీఠం భూముల అప్పగింత వితరణేమీ కాదట... రైతుల మాదిరిగానే ఇచ్చారంటున్న సీఆర్డీఏ

           

నవ్యాంధ్ర నూతన రాజధానికి దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద అప్పగించిన రూ.100 కోట్లకు పైగా విలువైన భూములు వితరణేమీ కాదని సీఆర్డీఏ అధికార యంత్రాంగం చెబుతోంది. కృష్ణా కరకట్టపై జరిగిన దురాక్రమణల్లో భాగంగానే దత్తపీఠానికి నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. నోటీసులకు స్పందించిన సచ్చిదానంద, కాస్త చొరవ తీసుకుని సదరు భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేశారని తెలిపారు. అంతేగాక, రాజధాని కోసం తుళ్లూరు ప్రాంత రైతులు ప్రభుత్వానికి భూములిస్తున్న తరహాలోనే దత్తపీఠం భూములు కూడా ప్రభుత్వానికి అందాయని వారు వివరిస్తున్నారు. అంటే, రైతులకు ప్రభుత్వం నుంచి అందనున్న పరిహారం, ఇతర ప్రయోజనాలు భవిష్యత్తులో దత్తపీఠానికీ దక్కనున్నాయన్న మాట.

   

 

 

×
×
  • Create New...