Jump to content

Happy Maha Shiva Ratri.


Recommended Posts

Posted

"హర హర మహా దేవ ! హర హర మహా దేవ !"..............డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ.

1 .అంధకారమలమ హాహకారంబేల !
చంద్రవంక ధారి చెంత నుండ !
హాలహలము నయిన అమృతంబు సేయురా !
అన్నపూర్ణ పతిర అఖిల గురుడు !

2. లింగ రూపధారి లీల జూడ తరమె ,
జగతి ప్రగతి లోన జాడ దెలియు !
ఉగ్రరూపమెత్త ఓర్వ లేరెవ్వరూ !
క్షణిక కోపమేను క్షమకు తండ్రి !

3. మృదు హృదయ ధ్రువుడుర , మృత్యుంజయుడువాడు !
వేద విధుల పట్ల వెర్రి ప్రేమ !
కాల చక్ర భ్రమణ క్రాంతి ప్రదాతరా !
మ్రొక్కి వేడ గానె మోక్ష మొసగు !

4. లింగ ముద్భవించు లీలెంత మధురంబు !
లీన మయ్యె దేను , లింగ గొలువ !
గళము నెత్తి పాడ , గరళ కంఠి మురియు !
వరము లీయ కుండ , వదల బోడు !

5. పుడమి నంత గాచి పుణ్య మొసగుతండ్రి !
పాప పంకి లముల బాప వయ్య!
పేద జీవులముర , ప్రేమ గంగ నొసగు !
స్వార్ధ పాశములను శాంత పరచు !

"హర హర మహా దేవ ! హర హర మహా దేవ !"
ఆటవెలది : పంచ రత్న మాల ..............డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 16/02/201510998250_1033662786647620_7639011163554510991385_1033663129980919_75932462021501

 

Posted

దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. పశ్చిమానికి వెళ్ళి గుడి గోడకి ఎదురుగుండా తూర్పుకు తిరిగి నిలబడి “ఓం సద్యోజాత ముఖాయ నమః” అనాలి. సద్యోజాతము అనబడే ముఖము పశ్చిమ దిక్కును చూస్తూ ఉంటుంది. ఈ ముఖము పృథివికి అధిష్ఠానం అయి ఉంటుంది. సృష్టికి అంతటికీ కారణం అదే. ఆముఖంలోంచే ఈశ్వరుడు పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. అందుకే లోకంలో ఒక మాట అంటూ ఉంటారు. శివాలయానికి ప్రదక్షిణ చేస్తే తీరని కోరిక ఉందా? అంటారు. కారణం బిడ్డలు పుట్టాలి అన్ని కోరిక దగ్గరనుంచీ సమస్త కోరికలూ శివాలయంలోనే తీరతాయి. ఈ ముఖం అత్యంత శక్తి వంతమైన ముఖం.11006481_758864060829661_841924650924340

Posted

ప్రదక్షిణ చేస్తూ ఎడమప్రక్కకి వస్తే దక్షిణ దిక్కు వస్తుంది. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో. శైవాగమంలో దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలి ఆయన. అభిముఖంగా ఉండకూడదు మీరు. తూర్పుముఖంగా ఉండి ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి. శివలింగం యొక్క దక్షిణానికి చూసే ముఖానికి అఘోరం అని పేరు. అది అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉండి ఈ సమస్త ప్రపంచాన్నీ లయం చేసేది అదే. అందరినీ పడగొట్టి తనలో కలుపుకొనే తత్త్వం ఉన్న పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసే అఘోర స్వరూపం. అభిముఖంగా పైకి చూసి “ఓం అఘోర ముఖాయ నమః” అనాలి. ఎవడు అలా అంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానమిచ్చి కలుపుకుంటాడు. లేకపోతే ఆయన లోకాన్నంతటినీ లయం చేసి పునర్జన్మ నిచ్చే స్వరూపం అయి ఉంటాడు. అందుకే అగ్నికి అధిష్ఠానం అయి ఉంటాడు.10923577_758863837496350_524782874848567

Posted

శివలింగాలినికి ఉన్న శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది. అంతా ఎందులో ఉందో అది లింగం. అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం. అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. పరమేశ్వరుని యదార్ధంగా సూచించుటకు గుర్తు శివలింగం. కంటితో కనపడేది కాదు. ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. అంటే శివలింగమునకు అయిదు ముఖములుంటాయి. ఏది ముఖము అంటే మీరు ఎటు విభూది రాసి బొట్టు పెడితే అది ముఖము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, - నాలుగువైపులా నాలుగు ముఖాలతో, పైకి ఒక ముఖంతో చూస్తాడు. ఐదు ముఖాలు. అయిదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాస్యుడు అని పేరు. శివాలయాలు అన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్ఠమైన శివాలయం, ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోర్కెలను ఈడేర్చగల్గిన శివాలయం, దానిని మించి ఇంకొక శివాలయం ఉంది అని చెప్పడానికి సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దానిని సద్యోజాత శివాలయం అంటారు. అన్ని శివాలయాలలోకి శక్తివంతమైన శివాలయం అదే.
ఈశ్వరుడు తూర్పుకు ఒక ముఖంతో చూస్తాడు. దానిని తత్పురుష ముఖము అంటారు. ఈ ముఖం తూర్పును చూస్తే అది తిరోధానాన్ని చేస్తూ ఉంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు. తెలియనివ్వడు. మాయా స్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖము అని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరిమీద. కాబట్టి తూర్పున ఉన్న ముఖం తత్పురుష ముఖం. ఈ ముఖం వాయువుమీద అధిష్టానంగా ఉంటూ లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది. లోపలి వెళ్ళి చూడగానే చేతులు జోడించి “ఓం తత్పురుష ముఖాయ నమః” అనాలి.10427226_758863600829707_513329695965422

Posted

మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట!
శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.

శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.

శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.
మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.

ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.
ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి.

అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!!1488664_758860720829995_5342584833760827

×
×
  • Create New...