Jump to content

Lord Siva Puja - Simple Means Possible.


Recommended Posts

Posted

10978535_759351447447589_539133756129646

 

శివపూజను 108నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే - ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.
భవాయ దేవాయ నమః;
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః
ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది.

Posted

ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది. ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను.

 

10923569_759352770780790_162527656991109

Posted

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వాభువనా వివేశ, తస్మైరుద్రాయ నమో అస్తు
అగ్ని యందు, నీటి యందు ఓషధులందు, సమస్త భువన ములందు వ్యాపించిన రుద్రునకు నమస్కారము.
( శ్రుతి మంత్రం)

 

10358566_758912297491504_722531727218539

Posted

ఉపమన్యు మహర్షి శ్రీ కృష్ణ పరమాత్మకు శివదీక్షను ఇచ్చి శివతత్త్వాన్ని బోధించాడు.
శివదీక్షాపరుడైన శ్రీ కృష్ణునకు శివ మహిమను చెప్తూ, ప్రతి ఒక్కరూ నిత్యం జపించి, స్మరించదగిన ఒక మహామంత్రాన్ని ఉపదేశించాడు.
" నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే"
ఈ ఒక్క వాక్యాన్ని నిరంతరం జపించితే, శివానుగ్రహం, శివసాయుజ్యం లభించుతాయని ఉపమన్యువు వచనం.
య ఇదం కీర్తయేన్నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్.

 

10986859_758909594158441_422053335023078

Posted

విశ్వమంతా ఉండే ఈశ్వర శక్తి ఘోరా - అఘోర - రూపాలతో ఉన్నది. అంటే శిక్షాకరమైన తత్త్వం. అఘోర అంటే రక్షహేతువైన శాంతికర తత్త్వం. వారి వారి కర్మాను గుణంగా పైరెండు రూపాలతో ఈశ్వరుడు జగత్తుని పాలిస్తాడు.
ఈ సమస్త రూపాలకీ, భావాలకీ కేంద్ర " బిందువు" గా ప్రధాన హేతువై, కారణకారణమైన ఏక చైతన్యం శివజ్యోతిగా శివలింగంగాకారంగా ప్రకాశిస్తోంది.
భ్రూఘ్రాణమ్మల సంధి ( కనుబొమల నడుమ) లో శివలింగాన్ని గానీ , శివమూర్తినిగానీ, ధ్యానించడం పరమమైన యోగమని ఉపనిషన్మతం.

10947299_758909174158483_377183010640501

Posted

శ్రీ శివరక్షా స్తోత్రం - అభయంకర కవచము

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య
యాజ్ఞ వల్క్య ఋషిః శ్రీ సదాశివో అనుష్టుప్ ఛందః
శ్రీ సదాశివ ప్రీత్యర్ధే శ్రీ శివరక్షా స్తోత్ర జపే వినియోగః
చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం
అపారం పరమామోదం మహాదేవస్య పావనం
గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః
గంగాధర శ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః
నయనే మదన ద్వంసీ కర్ణో సర్ప విభూషణః
ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః
జిహ్వం వాగీశ్వరః పాతు కంధరాం శశికంధరః
శ్రీ కంఠః పాతుమే కంఠం స్కందౌ విస్వదురంధరః
భుజౌ భూభార సంహర్తా కరౌ పాతు పినాకి ధృత్
హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః
నాభిం మృత్యుంజయః పాతు కటీవ్యాఘ్ర్యా జినాంబరః
సక్ధినీ పాతు దీనార్తః శరణాగత వత్సలః
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః
జంఘే పాతు జగత్కర్తా గుల్భౌ పాతు గణాధిపః
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః
ఏతాం శివ బలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స భుక్త్వా సకలాన్ కామాన్ శివ సాయుజ్య మాప్నుయాత్
గ్రహ భూత పిశాచాద్యా స్త్రైలోక్యే విచరంతి యే
దురా దాశుః పలాయంతే శివనామాభి రక్షణాత్
అభయంకర నామేదం కవచం పార్వతీపతేః
భక్త్యా భిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్
ఇమం నారాయణః స్వప్నే శివరక్షాం యథా దిశత్
ప్రాతరుత్ధాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్
ఫలం : సకలేష్టసిద్ధి జగద్వశ్యము మొ శ్రీ యాజ్ఞవల్కౄవిరచితమ్

 

10968513_758906424158758_891912733221116

Posted

శివార్చనాభిషేకాలకు ముందు మహాన్యాసం అనే మహిమాన్వితమైన కర్మకాండను నిర్వహిస్తారు.
శరీరమంత శుద్ధి చేసి, ప్రత్యంగమూ రుద్రశక్తితో పునీతం చేసి, రక్షించే కర్మ ఈ మహన్యాసం. " రౌద్రీకరణం " అంటే రుద్రమయం చేయడం.
"తన్మే మనశ్శివ సంకల్పమస్తు" - మొదలైన మంత్రాలతో అంతరంగంలోనూ - శిరసేస్వాహా, నేత్రాభ్యాం నమః - మొదలైన మంత్రాలతో శరీరంలోనీ రుద్రశక్తిని" న్యాసం" ( ఉంచుట) చేస్తారు.
ఈ కారణంగా అంతరంగ బహిరంగాలలో శివుడే ప్రకటింపబడి, దుర్భావాలు నశిస్తాయి.
మహాన్యాసం తరువాత నమశ్శబ్ద ప్రధానమైన రుద్ర నమకంతోనూ, చమకంతోనూ శివుని అభిషేకిస్తారు.
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సౌభాగ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని.." అని కనకధార స్తుతిలో ఆది శంకరుల పలుకు. " అమ్మా! నీకు సమర్పించే వందనాలు సంపతులనిస్తాయి. ఆహ్లాదాన్నిస్తాయి. సౌభాగ్యాలను ప్రసాదిస్తాయి.దురితాలనుండి ఉద్ధరిస్తాయి" అని భావం. వందనాలకి ఉన్న శక్తి అంతటిది.

 

551504_758905954158805_60288189706170755

Posted

శివుడి ఆనందతాండవము - నటరాజ స్వామి
""నట" అనే ధాతువుకు స్పందించడమని అర్ధం. తన భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తేందుకు స్వామి అనేక సంధర్బాలలో నాట్యం చేసినట్టు పురాణవచనం. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సమ్హారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాదు అనేది విదితం. గజాసురుణ్ణి సమ్హరించేతప్పుడు,అంధకాసుర సమ్హారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
స్వామి నాలుగు చేతులలో నెమలి ఈకలు కట్టిన జడలతో, ఆ జడలలో ఒక సర్పం, ఒక కపాలం,గంగ,దానిపై చంద్ర రేఖ,కుడి చెవికి కుండలం, ఎడమ చెవికి తాటంకం ,కంఠహారాలతో, నూపురాలతో,కేయూరాంగదాలతో,యఙ్ఞోపవీతంతో, కుడి చేతిలో ఢమరుకం ,మరొక కుడిచేయి అభయ ముద్రను ప్రకటించడం,ఒక ఎడమ చేతిలో అగ్ని,మరొక చేయి సర్పాన్ని ,చేతిలో పెట్టుకున్న మూలయకుణ్ణి చూపిస్తూ, ఎడమకాలు ఎత్తి పెట్టబడినట్లుగా,విగ్రహానికి చుట్టూ ఓ కాంతి వలయం, పద్మాకారంగ చెక్కబడిన పీఠంపై నృత్యం అద్భుతం.
చెవి కుండలములు - అర్ధనారీశ్వరతత్వము
వెనుక కుడి చేతిలో డమరుకం - శబ్దబ్రహ్మయొక్క ఉత్పత్తి
వెనుక ఎడమ చేతిలో అగ్ని - చరాచరముల శుద్ధి
ముందు కుడి చేయి - భక్తులకు అభయము
ముందు ఎడమ చేయి - జీవులకు ముక్తి హేతువయిన పైకి ఎత్తిన పాదమును సూచించును.
కుడి కాలుకింద ఉన్న అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) - అఙ్ఞాన నాశనము
చక్రము - మాయ
చక్రమును స్పృశించిన చేయి - మాయను పవిత్రము చేయ్తుట
చక్రమునుండి లేచు 5 జ్వాలలు - సూక్ష్మమైన పంచతత్వములు
నాట్యం చేస్తున్నప్పుడు నటరాజుకు నాలుగు భుజాలు ఉంటాయి.ఆయన చేసే నృత్యాలు ఏడు రకాలుగా ఉంటాయి.
1) ఆనంద తాండవం
2) ప్రదోష నృత్యం ( సంధ్యా తాండవం)
3) కాళితాండవం
4) త్రిపురతాండవం
5) గౌరి తాండవం
6) సమ్హార తాండవం
7) ఉమా తాండవం
గౌరి ,ఉమా తాండవాలలో శివుని రూపం భైరవముగా ఉంటుంది. ఆయన సాత్విక నృత్యం ప్రదోషకాల నృత్యమే. అందుకే ప్రదోషకాలంలో శివపూజ ప్రశస్తమైనది.
అసలు భూలోకంలో ఉన్న నృత్యరూపాలు అన్ని ఆయన నృత్యంలో నుండి ఉద్భవించినవే!
ఆయన తన నృత్యమును,పార్వతి ద్వారా అభినయింప జేసి, తమ నాట్యాన్ని భరతమునికి చూపించగా,భరత ముని ద్వారా నాట్య వేదం రూపుదిద్దుకుందంటారు.
సమ్హారకరమైన శివుని ఉగ్రనృత్యములందు జగత్తును ప్రళయం గావించి,జీవుల కర్మబంధమును కూడా నశింపచేయును.
ఆనంద తాండవమునందు శివుని ముద్రల అంతార్ధము ఇదే. ఆయన తాండవము లోకరక్షాకరం.

 

10968422_758904054158995_384301348849841

Posted

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

 

1620741_758902570825810_7544416873487456

Posted

దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. పశ్చిమానికి వెళ్ళి గుడి గోడకి ఎదురుగుండా తూర్పుకు తిరిగి నిలబడి “ఓం సద్యోజాత ముఖాయ నమః” అనాలి. సద్యోజాతము అనబడే ముఖము పశ్చిమ దిక్కును చూస్తూ ఉంటుంది. ఈ ముఖము పృథివికి అధిష్ఠానం అయి ఉంటుంది. సృష్టికి అంతటికీ కారణం అదే. ఆముఖంలోంచే ఈశ్వరుడు పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. అందుకే లోకంలో ఒక మాట అంటూ ఉంటారు. శివాలయానికి ప్రదక్షిణ చేస్తే తీరని కోరిక ఉందా? అంటారు. కారణం బిడ్డలు పుట్టాలి అన్ని కోరిక దగ్గరనుంచీ సమస్త కోరికలూ శివాలయంలోనే తీరతాయి. ఈ ముఖం అత్యంత శక్తి వంతమైన ముఖం.

11006481_758864060829661_841924650924340

Posted

ప్రదక్షిణ చేస్తూ ఎడమప్రక్కకి వస్తే దక్షిణ దిక్కు వస్తుంది. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో. శైవాగమంలో దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలి ఆయన. అభిముఖంగా ఉండకూడదు మీరు. తూర్పుముఖంగా ఉండి ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి. శివలింగం యొక్క దక్షిణానికి చూసే ముఖానికి అఘోరం అని పేరు. అది అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉండి ఈ సమస్త ప్రపంచాన్నీ లయం చేసేది అదే. అందరినీ పడగొట్టి తనలో కలుపుకొనే తత్త్వం ఉన్న పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసే అఘోర స్వరూపం. అభిముఖంగా పైకి చూసి “ఓం అఘోర ముఖాయ నమః” అనాలి. ఎవడు అలా అంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానమిచ్చి కలుపుకుంటాడు. లేకపోతే ఆయన లోకాన్నంతటినీ లయం చేసి పునర్జన్మ నిచ్చే స్వరూపం అయి ఉంటాడు. అందుకే అగ్నికి అధిష్ఠానం అయి ఉంటాడు.

 

10923577_758863837496350_524782874848567

Posted
శివలింగాలినికి ఉన్న శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది. అంతా ఎందులో ఉందో అది లింగం. అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం. అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం. పరమేశ్వరుని యదార్ధంగా సూచించుటకు గుర్తు శివలింగం. కంటితో కనపడేది కాదు. ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి. అంటే శివలింగమునకు అయిదు ముఖములుంటాయి. ఏది ముఖము అంటే మీరు ఎటు విభూది రాసి బొట్టు పెడితే అది ముఖము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, - నాలుగువైపులా నాలుగు ముఖాలతో, పైకి ఒక ముఖంతో చూస్తాడు. ఐదు ముఖాలు. అయిదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాస్యుడు అని పేరు. శివాలయాలు అన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్ఠమైన శివాలయం, ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోర్కెలను ఈడేర్చగల్గిన శివాలయం, దానిని మించి ఇంకొక శివాలయం ఉంది అని చెప్పడానికి సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దానిని సద్యోజాత శివాలయం అంటారు. అన్ని శివాలయాలలోకి శక్తివంతమైన శివాలయం అదే.
ఈశ్వరుడు తూర్పుకు ఒక ముఖంతో చూస్తాడు. దానిని తత్పురుష ముఖము అంటారు. ఈ ముఖం తూర్పును చూస్తే అది తిరోధానాన్ని చేస్తూ ఉంటుంది. తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు. తెలియనివ్వడు. మాయా స్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖము అని పేరు. అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరిమీద. కాబట్టి తూర్పున ఉన్న ముఖం తత్పురుష ముఖం. ఈ ముఖం వాయువుమీద అధిష్టానంగా ఉంటూ లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది. లోపలి వెళ్ళి చూడగానే చేతులు జోడించి “ఓం తత్పురుష ముఖాయ నమః” అనాలి.
 
10427226_758863600829707_513329695965422
Posted
మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట!
శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.

శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.

శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.
మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.

ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.
ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి.

అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!!1488664_758860720829995_5342584833760827
Posted

ఆయనయే చూడవలసిన వాడు, వినవలసిన వాడు. ఆయనది తప్ప ఇంకొకటి విన్నావు అంటే వినకూడనిది విన్నావు అని అర్థం. ఆయన తప్ప ఇంకొకటి చూశావు అంటే చూడకూడనిది చూశావు అని అర్థం. ఆయనను తప్ప ఇంకొకరిని కీర్తించావంటే అనకూడనిది అన్నావు అని అర్థం. కనుక వాక్కు ఎప్పుడు సార్ధకం - అనవలసింది అన్నప్పుడు. చెవి ఎప్పుడు సార్ధకం? - వినవలసింది విన్నప్పుడు. కనుక శ్రోతవ్య, మంతవ్య కీర్తితవ్యాః అని మహేశ్వరుడు గురించి శ్రుతులు చెప్పాయి గనుక ఈమూడూ బాగా సాధించండయ్యా. ఎప్పుడూ ఆయన గురించే విను, ఆయన గురించి అను, ఈ మూడూ ఎల్లవేళలా చేస్తే మనల్ని పరమాత్మ వైపు తిప్పుతాయి. లోకంతో కానీ, భగవంతునితో కానీ Attachment పెట్టుకోవాలంటే మన దగ్గరున్న acquipments మూడే - త్రికరణములు. కరణము అంటేనే acquipment. ఈ మూడు కరణములతో అదే చెయ్యి. మూడు కరణాలతో ప్రపంచం చేస్తున్నావు, విడిచి పెట్టు. మూడు కరణాలతో లోకం అయింది. మూడు కరణాలతో లోకేశ్వరుడిని పట్టుకో. మూడు కరణములలో ప్రసరించే నువ్వు ఈశ్వరునితో అనుసంధానం అయితే నువ్వూ శివోహం అవుతావు. అందుకు మహాసాధనం అని దీని పేరు. శ్రవణ, మనన, కీర్తనములకు వ్యాసదేవుడు పెట్టిన పేరు మహాసాధనం.

 

11006476_759354300780637_484318776405661

×
×
  • Create New...