Tadika Posted February 18, 2015 Report Posted February 18, 2015 RIP Ramanayudu garu Ma Ex MP Aayana rare pics vesi dedicate cheyandi :( డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. చివరి స్వాస వరకు ఆయన నిర్మాతగా సేవలందించారు. తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. సెప్టెంబర్ 9, 2010న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. రామానాయుడు తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క మరియు చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణ ను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరిక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరిక్షలు కూడా తప్పాడు. రామానాయుడు కు మామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు.వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. కారంచేడులో 'నమ్మిన బంటు' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని అక్కినేని అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాతుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. ఇద్దరు స్నేహితులతో కలసి తొలిసినిమా అనురాగం (జగ్గయ్య, భానుమతి హీరోహీరోయిన్లు) నిర్మించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. డబ్బు వృధా చేయనని తండ్రికిచ్చిన మాటను అనుక్షణం గుర్తుచేసుకుంటూ 1965లో సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 'రాముడు-భీముడు' సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాసివ్ యాక్షన్, తాపి చాణక్య దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెనక్కి తిరిగిచూసుకునే పరిస్థితిరాలేదు రామానాయుడుకు. రాముడు బీముడు హిట్ తర్వాత ఎన్నో పరాజయాలు చవి చూసారు రామానాయుడు. అక్కినేనితో తీసిన సిపాయి చిన్నోడు ఫెయిల్ అయింది. పోయిన చోట వెతుక్కోవాలని మళ్లీ ప్రేమ్ నగర్ సినిమా మొదలు పెట్టారు. ఒక వేళ ఈ సినిమా ప్లాపయితే వెనక్కి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆయనన్ను నిర్మాతగా నిలబెట్టింది. మూవీ మోఘల్ అయ్యేందుకు కారణమైన సినిమా ఇదే...
Tadika Posted February 18, 2015 Author Report Posted February 18, 2015 రామానాయుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న పేరు తెలుగు చిత్రసీమలో ఉంది. కానీ.. అలాంటి వ్యక్తికి సైతం మూడు కోరికలు మిగిలిపోయాయని చెబుతారు. అందులో మొదటిది తాను నిర్మించిన రాముడుభీముడు సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో పునర్మించాలన్నది ఆయన ఆశ. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు కూడా జరిగి ఆగిపోయాయి. ఇదే విషయాన్ని రామానాయుడు దగ్గర కొన్నాళ్ల క్రితం ప్రస్తావించినప్పుడు.. ‘‘ఇప్పటికీ నాకు ఆ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తోనే నిర్మించాలి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ సినిమాకు న్యాయం చేయగలరు. ఒకవేళ నా కోరిక నెరవేరకపోతే... కనీసం పాత సినిమాను కలర్ లోకైనా మారుస్తా'' అని చెప్పేవారు. ఇక.. రామానాయుడు తీరని కోరికల్లో మరొకటి.. దర్శకత్వం వహించటం. దాదాపు 150 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్వప్నం సాకారం కాలేదు. ఇక మూడో కల.. తన కొడుకు, మనమళ్లతో కలిసి ఒక సినిమా నిర్మించాలని...ఆ కోరిక కూడా తీరకుండానే ఆయన కాలం చేయడం విషాదం.
Tadika Posted February 18, 2015 Author Report Posted February 18, 2015 మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ నిర్మాత డాక్టర్ డీ రామానాయుడు బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో హిట్ నిర్మాతగా టాప్ పొజిషన్లో ఉన్న రామానాయుడు రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారని చెప్పవచ్చు.13వ లోకసభలో ఆయన గుంటూరి జిల్లాలోని బాపట్ల లోకసభ స్థానం నుండి పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో పోటీ చేసి గెలుపొందారు. 1999 నుండి 2004 వరకు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2004లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.రామానాయుడు ఎంపీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశాడనే పేరు తెచ్చుకున్నారు. అయితే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. అభివృద్ధి చేసినప్పటికీ గెలిపించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2003లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాదులో చిత్రసీమ స్థిరపడడానికి రామానాయుడు కృషి చేశారు. విశాఖలో కూడా స్టూడియోను నిర్మించాలనుకున్నారు.
Recommended Posts