Jump to content

Super Song... Slow Melody...


Recommended Posts

Posted

watch from 45:50.....

 

http://youtu.be/xGHe6LvyrTM

Posted
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
నీలికొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ
రాగ వీధుల్లో జాబిలై నవ్వింది ముద్దుగుమ్మ
కళ్యాణి అందం కాశ్మీర గంధం
కోరింది నీవే కళ్యాణ బంధం
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
 
ఎన్నో జన్మాల బంధాలే
ఎదలో సన్నాయి పాడే
సంధ్యా రాగాల వర్ణాలే
చెలితో దోబూచులాడే
కన్నుల్లో వెన్నెల్లు నన్నుల్లుకున్న వేళల్లో..
గుండెల్లో గుమ్మెత్తే ఏముందో ఏమో ప్రేమల్లో
వయ్యారి మాట వలపు మంత్రం
చిన్నారి చెంత చిలిపి తంత్రం
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
 
కన్నె పూబంతి ఊహల్లో
పెళ్ళి మద్దెళ్ళు మోగే
నిండు నూరేళ్ళ కౌగిళ్ళు
శాంతి సౌఖ్యాలు కోరే
సందెల్లో సింగారి సింధూర పూల చెక్కిల్లు
పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్ళు
సయ్యాటలాడే సరస రాగం
ఉయ్యాలలూగే ప్రేమ హృదయం
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
నీలికొండల్లో నీరెండై సోకింది కన్నె ప్రేమ
రాగ వీధుల్లో జాబిలై నవ్వింది ముద్దుగుమ్మ
కళ్యాణి అందం కాశ్మీర గంధం
కోరింది నీవే కళ్యాణ బంధం
మౌనమేల ఈ మధుమాసం
వేచి ఉన్నా నీ జతకోసం
అందుకున్నా నీ దరహాసం
ఆలపించా నీ అనురాగం
×
×
  • Create New...