Jump to content

Recommended Posts

Posted

ఈ లెక్కన ఏపీ అభివృద్ధి చెందేదెప్పుడు?
ఆర్థిక సంఘం తీరుపై చంద్రబాబు అసంతృప్తి
రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంలో చేరాం
కుప్పంలో సీఎం ప్రసంగం
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించకపోవడం పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 14వ ఆర్థికసంఘం, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యా యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధైర్యపడబోనని, రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడపడానికి రేయింబవళ్లు శ్రమిస్తానని స్పష్టం చేశారు. ‘నేనెప్పుడూ ఓడిపోలేదు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదురునిలబడి పోరాడతా. అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి తీరుతా’ అని చంద్రబాబు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బుధవారం ఉదయం మీడియాతో, సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసులు, తద్వారా రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం వుండడంతో పాటు ఏపీ అభివృద్ధి కోసమే ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నామని, కేంద్రంపై శాంతియుతంగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ప్యాకేజీ సాధించుకొస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనను సమర్థించిన అన్నిపక్షాలు తమతో కలిసిరావాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీని చూడటం పట్ల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా 22 వేల కోట్లు కేటాయించడంతో రాష్ట్రానికి ఎంతోమేలు జరిగిపోయిందని అం దరూ అనుకోవడం, పత్రికలు సైతం ఈ విషయం పట్ల అధ్య యనం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. రెవె న్యూ లోటును భర్తీ చేయడానికి ఏపీతో పాటు మరో పది రాష్ట్రాలకు నిధులు కేటాయించడాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదన్నారు. పొరుగు రాష్ట్రాల రాజధానులు మహానగరాలుగా విస్తరించాయని, వీటితో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ అభి వృద్ధికి సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. 14వ ఆర్థిక సంఘ సమావేశంలో దీనిపై సమగ్ర నివేదిక ఇచ్చామని చెప్పారు. అయినా ఆర్థిక సంఘ సిఫారసుల్లో ఈ నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో ఉన్న పాలసీలే విజయవాడలోనూ అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు విజయవాడలో ఎందుకు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికి అభివృద్ధి చెందాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ ఉద్యోగుల గురించి ప్రస్తావిస్తూ ‘‘మన అధికారులే హైదరాబాద్‌ వదిలి రాలేమంటున్నారు. వాళ్లు వద్దామన్నా.. వాళ్ల భార్యలు వద్దంటున్నారు, మరి పరిశ్రమలు ఎలా వస్తాయో ఆలోచించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ అవార్డు ఇవ్వాలని రాష్ట్రపతి లేఖ రాసినా అది కార్యరూపం దాల్చకపోవడం బాఽధాకరమన్నారు. విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చేసిన తీర్మానాలను కూడా అమలు చేయలేకపోవడం అన్యాయమని ఆక్రోశించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన విభజన, చేయని నేరానికి రాష్ట్రప్రజలను శిక్షించడం న్యాయం కాదని ఆయన కేంద్రానికి విన్నవించారు. పక్కనున్న మూడు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జరిగే వరకు కేంద్రం చేయూతనివ్వాలని ప్రధాని మోదీని ఇప్పటివరకు ఏడుసార్లు కోరానని చంద్రబాబు తెలిపారు.

×
×
  • Create New...