Jump to content

Andhra Pradesh Doola Teripoyindhi..............bjp And Congress Sucks


Recommended Posts

Posted

తాజాగా ఆంధ్రప్రదేశ్ బెవరజీస్ కార్పోరేషన్ ఆదాయపు పన్ను బకాయిల వివాదం రాష్ట్ర భవిష్యత్తు కి అడ్డం పడుతోంది. సుమారు పదేళ్లుగా ఈ కార్పోరేషన్ ఆదాయపుపన్నుకట్టడంలేదు. దీంతో కేంద్ర అధికారులు దీనితో బాటు కొత్తగా 8 నెలల క్రితం ఏర్పాటైన తెలంగాణా బెవరిజీస్ కార్పోరేషన్ వ్యాపారాన్ని కూడా స్తంభింప చేసారు. ఈ రెండుకార్పోరేషన్లు కోర్టుకేక్కాయి. హైకోర్ట్ వీరి వ్యాపారానికి అనుమతిచ్చింది. కాని ముందుగా బకాయిలు చెల్లించి మొత్తం ఆదాయాన్ని ఓ ప్రత్యక ఖాతాలో జమచేయమంది. ఈదశలో తెలంగాణా బెవరిజీస్ కార్పోరేషన్ ఓ కొత్త మెలిక పెట్టింది. తమ సంస్థ ఏర్పాటైన ఎనిమిది మాసాల నుండి చట్టప్రకారం పన్నులు చెల్లిస్తూనే వున్నాం..పాత బాకీలతోమాకు సంబంధం లేదని కోర్టుకి తెలిపింది. దీనికి న్యాయస్థానం కూడా అంగీకారం తెలియచేయడంతో మొత్తం బాకీలన్నీ కట్టాల్సిన పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడింది.

గత 60 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట అనేక అప్పులు తెచ్చారు. అలా తెచ్చిన నిధులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 జిల్లాల పరిధిలోనూ ఈ మొత్తంలో 20 శాతాన్నిఖర్చుపెడితే మిగిలిన 80 శాతాన్ని కేవలం హైదరాబాద్ నగర అభివృద్ధికి ఖర్చుపెట్టారు. గత దశాబ్దంలోనే సుమారు రెండున్నర లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది.వీటితో బాటు ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు మరో ఐదు లక్షల కోట్లు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక కార్పోరేషన్, సరఫరా కార్పోరేషన్, ఫైనాన్స్కార్పోరేషన్, ట్రేడింగ్ కార్పోరేషన్, పౌరసరఫరాల కార్పోరేషన్, ఆర్టిసి, హౌసింగ్, బెవరేజస్ ఇలా మొత్తం 96 ప్రభుత్వ రంగ సంస్థలు వున్నాయి. వీటిలో 28 సంస్థలు నేరుగా ఆర్ధికకార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఇవి సమైక్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చాయి. ఇవన్నీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టాల్సిన స్థితి నెలకొంది.

సీమాంధ్రుల డిమాండ్ ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం హైదరాబాద్ ను ఏకపక్షంగా తెలంగాణకు అప్పగించేసింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రం కొత్త పేర్లతోకార్పోరేషన్లను ఏర్పాటు చేసుకొంది. దీంతో పాతబకాయిలతో వీటికి సంబంధం లేకుండా పోయాయి. కేవలం రెవెన్యూ సరిహద్దులు మాత్రమే నిర్ణయించి రాష్ట్రాన్ని విడదీసారు.నీరు,విద్య,వైద్య సదుపాయాలూ, పాత అప్పులు, వాటి వడ్డీల విభజనని మాత్రం కేంద్రం పూర్తి చేయలేదు. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిది మాసాలు అయినా ఆ దిశగా ప్రయత్నాలుకూడా చేయలేదు. విభజన సమయంలో కొత్త ప్రాంతానికి తెలంగాణా రాష్ట్రం అంటూ పెరెట్టిన రీతిలోనే మిగిలిన 13 జిల్లాలకు ఏదైనా మరో కొత్త పేరుపెట్టి వుంటే సాంకేతికంగా ఈబకాయిల మోత ఆంధ్రప్రదేశ్ కి వుండేది కాదు. అదే ఇప్పుడు ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తలకుమించిన భారంగా పరిణమించింది. ఈ ఒక్క పేరే ప్రతీ తలపై లక్ష రూపాయలకొత్త అప్పుని మోపుతుంది.

రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ తో కూడిన పది జిల్లాలను కలిపి ఏర్పాటుచేసిన కొత్త రాష్ట్రానికి తెలంగాణా అని పేరు పెట్టారు. మిగిలిన 13 జిల్లాల ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్గానే పేరు కొనసాగించారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ దారుణంగా మోసపోయింది. ఆంధ్రప్రదేశ్ పేరు ఏపి ప్రజలకు శాపంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పులన్నీ ఆంధ్రప్రదేశ్పేరిటే చేసారు. కార్పోరేషన్ చేసిన అప్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే హామీదారుగా వుంది. దీంతో బకాయిలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జవాబు దారీగా మారింది. ఆఅప్పులన్నీ కట్టాల్సిన దుస్థితి ఎదుర్కొంటుంది

 

Posted

evaru raasinru ee article?  :P

7.5 lakh crores appula united AP lo

AP state name maarchi vunte appulu raava.  gallery_8818_6_385253.gif?1367349476

Posted

kya  manchu lunch ho gaya.. :police:

2:30 maku :O

Posted

nathi reddy bemmi.lol4.gif

needi neeke ga :P

Posted

logic ledhu ee article lobemmi.lol4.gifstate name maristhae..appudu mafi ipothai aa..?

×
×
  • Create New...