Jump to content

Oh Thalli Kshaminchu..... Kill Them :(


Recommended Posts

Posted

http://youtu.be/0qqxBlYVewg

 

 

 

ఆస్తి రాసివ్వదేమోననే అనుమానంతో కొడుకు, కూతురు కలిసి కన్న తల్లినే కడతేర్చారు. నగరంలోని గోషామహల్‌లో గతేడాది చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.. లక్ష్మీబాయి తన కొడుకు బాబు, కూతురు కిరణ్మయిలతో కలిసి గోషామహల్‌లో నివాసముండేది. అయితే లక్ష్మీబాయి తన మొదటి భర్త చనిపోవడంతో కొద్ది కాలం పిల్లలతో కలిసి ఒంటిరిగా జీవనం సాగించింది. తరువాత కాలంలో లక్ష్మీబాయికి జలీల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త రెండో వివాహానికి దారితీసింది. జలీల్‌ను వివాహం చేసుకున్న తరువాత లక్ష్మీ ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఆశగా మార్చుకుంది. కొడుకు పేరును ఖదీర్‌గా, కూతురు పేరును ఫర్వీగా మార్చింది.

కొంతకాలం పాటు సాఫీగా సాగిన లక్ష్మీ జీవితంలో కూతురు, కొడుకు పెద్దవారయ్యాక సమస్యలు తలెత్తాయి. ఆస్తి తగాదాలు రాజుకున్నాయి. గోషామహల్‌లో వారు నివాసముంటున్న ఇంటిని తన పేరుమీద రాయాల్సిందిగా ఖదీర్‌ అలియాస్‌ బాబు తల్లిపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే ఈ అంశాన్ని ఆమె దాటవేస్తూ వచ్చింది. ఇలా ఆస్తి విషయం, తమను అనవసరంగా మత మార్పిడీ చేయించావని కొడుకు, కూతురు కలిసి నిరంతరం తల్లి లక్ష్మీబాయితో గొడవకు దిగేవారు.

ఈ క్రమంలో గతేడాది జనవరిలో ఖదీర్‌ లక్ష్మీబాయిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె మృతిచెందింది. కంగారుపడ్డ ఖదీర్‌, పర్వీన్‌లు తల్లి మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. అయితే లక్ష్మీబాయి రెండో భర్త జలీల్‌ తల్లి ఎక్కడుందని ఖదీర్‌, పర్వీన్‌లను ప్రశ్నించగా అక్కడుంది, ఇక్కండుంది, వస్తది అంటూ దాటవేస్తూ వచ్చారు. వీరి పొంతనలేని సమాధానంపై అనుమానం వ్యక్తం చేసిన జలీల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు, కొడుకు కలిసి తల్లిని హత్యచేశారని నిర్థారణయ్యింది. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

×
×
  • Create New...