Jump to content

Recommended Posts

Posted

టాలీవుడ్ మాస్ హీరోగా    i11961_Brahmi1.gif  ముద్రవేసుకున్న ప్రిన్స్‌ మహేష్‌బాబు ఈ మధ్య సినిమాలను పక్కనపెట్టి యాడ్‌ ఫిలింస్‌లో ఎక్కువ నటిస్తున్నారు.

ఇదేంటని ప్రశ్నిస్తే? తనకు పాపులారిటీ ఉండబట్టే కదా యాడ్ ఫిలింస్ చేస్తున్నానని చెబుతున్నారు. ఈ మధ్య మీడియాకు చాలా దూరంగా ఉన్న ఆయన యాడ్స్‌ వల్ల ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నవరతన్‌ తైలం, థమ్స్‌ అప్‌ యాడ్స్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు.

త్వరలో మహేష్‌బాబు మరో థమ్స్‌ అప్‌ యాడ్‌లో నటించనున్నారు. గురువారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్‌లో ప్రిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రణాళికలు వెల్లడించారు.

ప్రశ్న.. మీ సోదరితో నటించే అవకాశముందా?

జ.. ఆమెతో నటించే ఆలోచనలేదు. ఆమె నిర్మాత మాత్రమే. మంజుల నిర్మాణ సారథ్యం వహించే చిత్రాల్లో నేను నటిస్తా.

ప్రశ్న.. బయటి చిత్రాలు చూడననేవారు. మరి కావ్యాస్‌డైరీ చూశారా?

జ.. ఆ సినిమా చూశాను. మొదటి భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. రెండోభాగం నన్ను బాగా ఇంప్రస్‌ చేసింది. కెమెరా, సంగీతం, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ మెప్పించాయి.

ప్రశ్న.. 'అతిథి' తర్వాత విరామం ఎక్కువగా తీసుకోవడానికి కారణం?

జ.. ప్రధానమైంది స్క్రిప్ట్‌. కథ సరిగ్గా కుదరలేదు. సినిమా సినిమాకు కొంతకాలం గ్యాప్‌ తీసుకోవాలనుకున్నాను. కానీ దానికంటే 5నెలలు ఎక్కువయింది. ఇకపై అలాంటి గ్యాప్‌ ఇవ్వకుండా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా.

ప్రశ్న... కృష్ణగారు ఏడాదికి 12 నుంచి 18 సినిమాలు చేసేవారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?

జ.. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పడు ట్రెండ్‌ మారింది. చేయడానికి కుదరదు. ఒకవేళ అలా చేస్తే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవాడ్ని.

inte continue ite adi guda jarugutundhii....  @3$% @3$% @3$% @3$%

ప్రశ్న... చిరంజీవి చేసిన యాడ్స్‌ అన్నీ మీరే చేస్తున్నారేమిటి?

జ.. (కాస్త కోపగించుకుని...) అంటే ఏమిటి...? అని అడుగుతూనే ఆయన స్థానాన్ని భర్తీచేశాననేగా మీ ఉద్దేశం. అందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.

present position kuda cover seyyi  i11963_Brahmi3.gif

ప్రశ్న.. సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. అవి ఏ రకంగా ఉంటాయి?

జ.. గ్రామీణ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పాఠశాలలను మెరుగుపర్చడం అనే కొత్త ఆలోచనలు నాలో ఉన్నాయి. సినిమాలకు దానికీ ఎటువంటి గ్యాప్‌రాకుండా జాగ్రత్తలు తీసుకుని అమలు చేస్తాను. పేద పిల్లలను ఆదుకోవడమే నా లక్ష్యం.

ప్రశ్న.. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదా?

జ.. నాకు రాజీవ్‌గాంధీ అంటే ఇష్టం. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన నాకు ఆదర్శం. కానీ ఆయన చనిపోయాక రాజకీయాల గురించి ఆలోచించడం మానేశాను.

ప్రశ్న... ఇప్పటి యువతరం కథానాయకుల్లో ఎవరు పోటీగా భావిస్తున్నారు?

జ.. చాలామంది ప్రతిభావంతులైన కొత్తతరం కథానాయకులు వస్తున్నారు. ఎవరి మార్కెట్‌ వారికుంది. పోటీ అనేది లేదు.

ప్రశ్న.. క్రికెట్‌ అంటే ఇష్టంకదా? అంతర్జాతీయ మ్యాచ్‌లకు వెళుతుంటారా?

జ.. క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే ఇంటిదగ్గరే ఆడుతుంటాను. నాకు టెండూల్కర్‌ చాలా ఇష్టం. అంతర్జాతీయ టోర్నీలకు వెళ్ళాలనుకున్నా కొన్నిసార్లు సాధ్యపడేదికాదు.

ప్రశ్న.. రిస్క్‌తోకూడిన థమ్స్‌అప్‌యాడ్‌లో చేయడం ఎలా అనిపిస్తుంది? i13463_Brahmi3.gif

జ.. అందులో నటించడం చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటాం. థమ్స్‌అప్‌తో టైఅప్‌ అయి ఇప్పటికి మూడు సంవత్సరాలయ్యాయి. జూలై, ఆగస్టులో కొత్త యాడ్‌ చేస్తున్నాను. అది సెప్టెంబర్‌లో థియేటర్లలో ప్రసారం అవుతుంది

Posted

idi same interview kada mahesh di??? comedy interview ani open chesa e thread... anyways  *=:

×
×
  • Create New...