goldflake Posted May 11, 2010 Report Posted May 11, 2010 బావ బావమర్ధుల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. అవసరమైతే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో స్పందించారు. తన బావమరిది, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉన్నారన్నారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేంత సమయం లేదన్నారు. అయితే, అవసరమైనప్పుడు బాలయ్యకు పార్టీ పగ్గాలు అప్పగిస్తామని చంద్రబాబు ఒక ప్రశ్నకు స్పందించడం గమనార్హం.ఈ విషయంపై తుది నిర్ణయాన్ని మాత్రం కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించి తీసుకుంటామన్నారు. బాలయ్య ప్రస్తుతం కొత్త సినీ ప్రాజెక్టులతోనూ.. ట్రస్టీతోనూ బిజీగా ఉన్నారని, తమ కుటుంబ సభ్యులమంతా బిజీగా ఉన్నామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లు బాగా పని చేశారన్నారు.వీరిద్దరి ఎవరు ఎన్నికల్లోకి రావాలో తమ కుటుంబ సభ్యులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. బాలకృష్ణను రాజ్యసభకు పంపాలా, వద్దా అనే విషయంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బాలయ్యకు తెలుగుదేశం పార్టీలో సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Recommended Posts