Jump to content

Nenu Btech Lo Oka Story Rasi Drafts Lo


Recommended Posts

Posted

ikkada veyachu gaa baa .. we also read 

blog name enti ba

 

 

Pmed

 

Posted

nice man ... idi nee real story ah leka imagination ah ?

Posted

నా గురించి నేను గొప్పలు చెప్పుకోవటం మంచి పద్ధతి అవుతుందా ?

గొప్ప పనిని చెయ్యకుండా, దాని గురించి ఇంకొకళ్ళకి చెప్పడం ? చేతగానితనం అవుతుందా ?

ఆ గొప్ప పనిని చేసి చెప్తే ? అది వినే వాళ్ళకీ, చూసే వాళ్ళకీ పూర్తిగా అర్థమవుతుందా ? ఏమో

ఎందుకంటే ఆ పని వల్ల పొందే అనుభూతి ఉందే , అది సంగీతం లాంటిది. దాని గురించి చెప్పటం కష్టం. ఆశ్వాదించడమే.


అదంతా యుద్ధ భూమి లాంటి ప్రదేశం, అక్కడ చదువే యుద్ధం, పుస్తకమే ఆయుధం, మార్కులే ఊపిరి. శ్రీ చైతన్య కళశాలలో ఇంటర్ చదువుతున్న రోజులవి. అప్పటికే వైజాగులో చాలా చోట్ల వెలిసింది ఆ కాలేజీ. నేను రొజూ ఇంటి నుండి వెళ్తూ ఉంటాను.

ఒక రోజు మా ఇన్-చార్జి నా దగ్గరకి వచ్చారు,
“కృష్ణ అంటే నువ్వేనా ? కంగ్రాట్స్ బాబు. ఈ వారం ఎంసెట్ పరీక్షలో వైజాగు మొత్తానికే 1స్త్ వచ్చవు”

నాకు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే ముందు రోజు లెక్కలు మాస్టరు తక్కువ వచ్చాయని తిట్టారు. అయినా నేనేమి చేసా? దొరికిన లెక్కలన్నీ దొరికినట్టు చేసా. కొన్ని కష్టమైన చిక్కు ప్రశ్నలకి జవాబు పట్టా. దానికే 1స్త్ ప్లేసా. బహుసా ముందు ఉండే వాడికీ వెనక ఉండే వాడికీ చిక్కు ప్రశ్నలే తేడా. ఏదైతేనేం ? మా ప్రిన్సిపాల్ నా పేరు గుర్తుపెట్టుకున్నారు, నిజానికి అదే అతని ఉద్యోగం అనుకుంట. నాకు వాళ్ళతో అవసరం లేదు. లెక్కలు, మాస్టారులు, స్నేహితులు, నవ్వులు, అంతే.

మాస్టారుతో జోకులు వెసుకోవడం భలే సరదాగా ఉండేది. సతీష్ గాడిని ఏదైనా ప్రశ్న అడిగితే ఆ మాస్టారుని మిమిక్రీ చేసి జవాబు చెప్పేవాడు. మాకు నవ్వు ఆగేది కాదు. ఒక్కోసారి మస్టారు వేసిన జోకుకి క్లాసులో అందరూ నవ్వేసి ఆపేసాక ఆ నిశబ్దంలో సతీష్ గాడు గట్టిగా నవ్వేవాడు, ఆ నవ్వుకి అందరూ మళ్ళీ నవ్వేవారు. అలాగే అల్లరిగా మొదటి భాగం సాగిపోయింది.

రెండవ సంవత్సరంమొదలయ్యింది. అసలు కథ మొదలయ్యింది. పరీక్షలు కష్టంగా ఉన్నాయి, ఎవరెవరి స్థాయి ఎలా ఉందో తేటతెల్లం అయిపోతూంది "when the going gets tough the tough gets going" అని ఊరికే అనలేదు. మునుపటిలా ‘రాణించటం’ కష్టమయ్యింది. 150 నుంది 120 కి మార్కు పడింది. అయితే మిగితా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. కర్రతో కొడితే ఎవడికైనా నొప్పి పెడుతుంది, బలస్థుడికి కొంచెం తక్కువ పెడుతుంది, అంతే తేడా. కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చెక్కుచెదరలేదు, అదే, లెక్కల మీద ఇష్టం. సాయంత్రం గడ్డి మెయ్యడానికి ఆవుల్ని వదిలేసినట్టు మాకు పుస్తకాలిచ్చి చదువుకొమ్మని వదిలేస్తారు. మేము లెక్కలు చేస్తాం. ఎవరు ముందు చేస్తారో అన్నట్టు చెస్తూంటాం. అది అత్యాశ కాదు, సరదా !

‘లెక్కలు, సైన్సు, లోకం, జీవితం, ప్రకృతి. వీటి మధ్య పెద్ద తేడా కనిపించదు’ అని అర్థం చేసుకుంటే మనిషిలో తేడా వస్తుంది. నాలోనూ వచ్చింది. అప్పుడప్పుడు ఎక్కడో తెలియని లొపలికి వెళ్ళి విహరిస్తూ ఉంటా. మాసిన చొక్కా చూసి 'ఫైబర్ పైన సిలికాన్ 'అని అనిపించేది. ఎదుటి వాడిలో కోపం చూస్తూంటే తన మెదడులో ప్రొగ్రంలో ఎన్ని ఇంఫినితె లూప్ లు రున్ అవుతున్నాయో అని అనిపించేది. స్పీడ్ బ్రేకర్ వచ్చి బస్సు గెంతినప్పుడు నేను కూడ కొంచెం గెంతితే సీటు తగలకుండా ఉంటుందని తెలిసేది. ఇలా క్రమంగా చాలా మందికి అర్థమయ్యింది, నేను తేడా అని.

ఒక సారి ఒక ముఖ్యమైన పరీక్ష వచ్చింది. అంతకు మునుపటి పరీక్షలు గొప్పగా రాయకపొవటం వలన, కాలేజీ వాళ్ళకి నా పైన ఆశ పెంచుకోవడమో తుంచుకోవడమో తేల్చుకునే పరీక్ష అది. ఆ రోజు రాత్రంతా ఏం చెయ్యాలో ఎలా చెయ్యలో అని గుబులు. ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడూ నాకు ఒక చిన్న విషయం తట్టింది. 'పరీక్షని పట్టించుకుంటే పరోక్షంగా ఫలితాన్ని పట్టించుకున్నట్టే'. గుబులు పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది అలానే 13 మార్కుల తేడాతో మొదటి స్థానానికి చేరుకున్నా.

ఎప్పుడైనా ఎవరూ చూడని సమయంలో తలుపు వెనక్కి వెళ్ళి ఎగిరి గెంతాలని అనిపించిందా ? నేను గెంతాను ఆ రొజు. అయితే, మా కాలేజీ వాళ్ళు మాత్రం తలుపుల వెనకాల చాలా మంతనాలు జరిపారు, నన్ను హస్టల్ కి మార్చాలని నిర్ణయించుకున్నారు. పిచ్చి ముదిరితే పిచ్చి ఆసుపత్రిలో పెడతారు, చదువు పిచ్చి ముదిరితే ఇలా హాస్టల్లో పెడతారని ఆ రోజే తెలిసింది నాకు. నన్ను హాస్టల్లో ఉంచడానికి, కోతిని కారాగారంలో ఉంచడానికీ పెద్ద తేడా లేదు, అసలే నా మనసుకల్లు తాగిన కోతిలాంటిది.

ఆ హాస్టల్, అక్కడన్నీ చీకటి గదులు, కిటికీలు కూడా ఉండవు. ఎంత అందంగా సర్ది పెట్టి ఉంటుందో, కానీ అంతే ఇరుగ్గా ఉంటుంది. ఇద్దరికి సరిపడాల్సిన గదిలో అయిదుగురు పడుకోవాలి. బ్రతుకుతెరువు కోసం దేనికైనా సిద్ధపడతాడు మనిషి. పొద్దున్నే తప్పనిసరిగా చలిలో 5:30 కి లేవాలి. 6 కల్లా పాఠాలు మొదలవుతాయి. సరిగ్గా అప్పుడే నాకు నిద్ర కూడా మొదలయ్యేది. తెల్లవారుఝామునే లేపి చదివిస్తే ఏం లాభం ? వెలుగు లేని చోట?

నేను అప్పటికి ఓ జీవితపాఠం నేర్చుకోలేదు, అది, పరిస్థితులకి అనుగుణంగా నన్ను నేను మార్చుకోవడం. అక్కడ పద్ధతిలో తప్పు లేదు, నాలో ఉంది. ఈ విషయం గుర్తించక నా మార్కులు తగ్గిపోవడం మొదలయ్యాయి. అక్కడి పరిసరాలు ప్రవహించే నదులు కావు, అవి గంభీరమైన సముద్రాలు. అక్కడ అందరూ బాగా చదువుతారు, కానీ అందరూ గోల చెయ్యరు. కొందరికి పక్క వాళ్ళంటే గిట్టదు, కొందరికి పంచుకోవడమంటే గిట్టదు. నేను తేడా కదా, రాత్రి 12 కి అట్టతో క్రికెట్టు ఆడుకొనేవాడిని. పగలు నిద్రపోయేవాడిని.
నా పాత కాలేజీ నన్ను పట్టించుకోవడం మానేసింది. ఇక్కడ నేను సముద్రంలో ఒక చేపని. ఒక తరుణంలో వైజాగులో మొదటి 20 లో కూడా లేకుండా పొయింది నా ఫలితం.

అక్కడ నాకూ, మిగితా వాళ్ళకీ ఒక్కటే తేడా. నేను ఆదివారం ఇంటికి వెళ్ళచ్చు. ఇంటికి వెళ్ళినప్పుడల్లా రోజూ కనిపించని ఆకాశం చూసి ఆనందమేసేది. టీవీ చూసి టెన్షన్ తగ్గేది. బయట అమ్మయిలని చూసి ముచ్చటేసేది. హాస్టల్ వదిలెయ్యాలని ఆశ కలిగేది. ఒక సారి అమ్మా నాన్నలతో ఆ విషయం చెప్పాను, కొంచెం బాధని కలిపి చెప్పా. అది విని నాన్న,
‘ఒకచో నేలను బవ్వళించు ఒకచో నొప్పారు బూసెజ్జపై....లెక్కకు రానీయడు కార్యసాధకుడు దు:ఖంబున్ సుఖంబున్ మదిన్’, అంటూ పద్యం పాడారు. కానీ అమ్మ చెలించింది, పథకం ఫలించింది.

తొందరలోనే అక్కడనుండి బయటపడ్డా. మళ్ళీ ప్రవాహంలోకి వెళుతున్నానని ఆరాటం వేసేది. పాత స్నెహితులు కలిసారు. భోజనం చేస్తూ చాకుపీసుతో కొట్టుకునే రోజులు వచ్చేసాయి. వచ్చేసాక లెక్కల మాస్టరు దగ్గరకు పిలిచి ‘కావల్సినట్టు చదువుకో’ అన్నారు. అయినా చదువులో అనుకున్నంత మార్పు రాలెదు.

సముద్రం అయితే తుఫానులో సతమతమవుతాం, ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ నదిలో తుఫాను రాదు, ఎదురీదాలి.

ఆ కాంపస్ చిన్న గుడిసెల్లాంటి వాతావరణం. అక్కడే వందల మందికి పాఠాలు చెప్తారు. ఆ రోజు వందల మంది విద్యార్థులు ఎంసెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రిన్సిపాల్ ఫోనులో మాట్లాడుతూ, “ఏంటి కృష్ణకి 1స్త్
ర్యాంకా ?" ” అంతా గోల గోలగా ఉంది, జనాలని తోసుకుంటూ ప్రిన్సిపాల్ నా దగ్గరకి వచ్చారు. “కంగ్రట్స్ కృష్ణ, నీకు స్టేట్ 1స్త్ వచ్చింది”. అందరూ అరవటం మొదలుపెట్టారు. కాంపస్ అంతా జన సముద్రం. నన్ను కాళ్ళతో ఎత్తేసారు, ఎత్తి కాంపస్ అంతా ఊరేగిస్తున్నారు. ఆ జనంలో దూరంగా ఒక అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వుతూంది, గర్వపడుతూంది.

ఆ అందమైన కలని ఆశయం చేసుకొని నిద్రపోయా.

నాలో అంతర్లీనంగా శక్తి పెరుగుతూంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు నా మీద ఎవరికీ నమ్మకం లేదు, నాకు తప్ప. మొదటి పరీక్షలో 20 లో కూడా లేను. అయినా నాకు ఒకటికి చుట్టుపక్కల ఏమీ పెద్ద కనిపించట్లేదు.

ఎదురుగా సూర్యుడంతటి వెలుగు. తెల్లని నేల మీద గుర్రాలు బంగారు రథాలతో పరిగెడుతున్నాయి. నాకంటే ముందు ఇరవై ముప్పై మంది రథాల పైన పరిగెడుతున్నారు. నేను వేగం పెంచాలి, ఆ సూర్యుణ్ణి కళ్ళారా చూడాలి. అదొక్కటే తలుస్తున్నా.


.
Posted

nice man ... idi nee real story ah leka imagination ah ?

  

nijam cheppalante real ne

State first vachava

Posted

ikkada veyachu gaa baa .. we also read


personal details unnai bro thats why
Posted

  

nijam cheppalante real ne


lol hehe ledu but top 20 lo vacha

 

niceee ... so eamcet lo entha vachindi rank final ga :D

Posted

niceee ... so eamcet lo entha vachindi rank final ga :D


Below 20
Posted

Tarvatha life asslicked :D

 

:giggle: any interesting stories ?

Posted

:giggle: any interesting stories ?


:D desperation lo honey trapped for a yr...aa pori ippudu cornell lo masters chesi gc odi tho set aindi, ne asslicked kani 30 mins dooram lo underpaid salary tho set ayya
Posted

:D desperation lo honey trapped for a yr...aa pori ippudu cornell lo masters chesi gc odi tho set aindi, ne asslicked kani 30 mins dooram lo underpaid salary tho set ayya

we are brothers.. chaduvulo kadu.. asass lickipovadamlo @3$%
Posted

we are brothers.. chaduvulo kadu.. asass lickipovadamlo @3$%

Lol naku telisi 80% telugollu same position after inter

Any stories vuu
×
×
  • Create New...