Jump to content

Recommended Posts

Posted

అవును.. రాజుగారు దోషే

నేరం చేసిన వ్యక్తిని.. కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వొచ్చా? అన్న ప్రశ్న వేయొచ్చు. నిజమే.. సత్యం రామలింగరాజు తప్పు చేయొచ్చు. కానీ.. ఆయన తప్పు కారణంగా సమాజంలో అశాంతి చెలరేగలేదు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న విషయం మర్చిపోకూడదు.

పోలీసుల ప్రాణాలు తీసి.. ఉగ్రవాద కార్యకలాపాలు జరిపిన వ్యక్తి మరణిస్తేనే అతన్ని వీరకిశోరం మాదిరిగా కీర్తించే ప్రజలు.. అదే సమయంలో పోలీసుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే జనాలు.. వారికి రక్షణ కల్పించేందుకు వందలాదిగా పోలీసులు..అన్నింటికి మించి ప్రజలకు సేవ చేస్తామన్న మాటతో చట్టసభలకు ఎన్నికై.. చట్టాలు తయారు చేసే ఎమ్మెల్యే సైతం ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొనటం చూసినప్పుడు.. సత్యం రామలింగరాజును రాజుగారు అని కీర్తించటంలో తప్పు లేదు. ఎందుకంటే.. దేశంలో ఐటీ రంగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావటమ కాదు.. దేశ విదేశాల్లో దేశీయ ఐటీ రంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావటమే కాదు.. వేలాదిమందికి ఉపాధి కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదు.

అంతేకాదు.. రామలింగరాజులో ఉన్న మరో కోణం.. మిగిలిన వారిలా మోసాన్ని కప్పిపుచ్చుకోలేదు. ఆ మాటకు వస్తే.. తన కంపెనీలో చేసిన తప్పుడు పని గురించి సత్యం రామలింగరాజు తనకు తానుగా ఓపెన్ అయి.. నిజం చెప్పకపోతే ఈ వ్యవహారం బయటకువచ్చేది కాదేమో. చాలా కంపెనీలు చేసే పనినే రామలింగరాజు బయటపడి చెప్పుకున్నారు. తప్పు ఒప్పుకొని చెంపలేసుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు నిందితులుగా ఉన్న సత్యంరామలింగరాజు అండ్ కోలు దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది. నిందితులపై నేరం రుజువైందని వ్యాఖ్యానించింది. వారిపై నమోదు చేసిన సెక్షన్ల అధారంగా చూసినప్పుడు వారికి ఏడేళ్ల నుంచి పదేళ్ల మధ్యలో జైలుశిక్ష పడే వీలుంది. సత్యం స్కాంలో రామలింగ రాజుతో పాటు మిగిలిన వారిని దోషులుగా నిర్ధారించిన కోర్టు.. వారికి శిక్షల్ని మరికాసేపట్లో ఖరారు చేయనుంది.

Posted

Mana Desam lo andariki saanu buthi parulu untaru... adi os@ma ayina, s@ddam ayina, j@gan ayina, madhu kode ayina, rajeev gandhi ayina, vikaruddin ayina, red sandal smuglers ayyina shimi terr@rists ayina..evvadayina ..unity in diversity 

×
×
  • Create New...