Jump to content

Buddi leka Nitin ni teesukunnanu :Varma


Recommended Posts

Posted

img1090613127_1_2.jpg

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ గురించి అందరికీ బాగా తెలుసు. వర్మ అంటేనే ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఎవరేమనుకున్నాసరే.. తను ఏది చెప్పాలనుకున్నానో ఆ విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తానని రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు.

తాజాగా నితిన్ హీరోగా "అడవి" అనే సైకో థ్రిల్లర్ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్‌ ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మను కదిలిస్తే పలు విషయాలను చెప్పుకొచ్చారు.

ఏది తోచితే దాన్ని చేయడమే తన పాలసీ అని వర్మ అన్నారు. "షోలే" వంటి చిత్రాన్ని మళ్ళీ అమితాబ్‌తో తీసినప్పుడు బిగ్‌బిని గబ్బర్‌సింగ్‌లా ఎందుకు చూపించే ప్రయత్నం చేశారనే ప్రశ్నకు వర్మ సమాధానమిస్తూ.. అమితాబ్‌ను అలా చూపించాలనిపించింది కాబట్టే తీశానని గతంలో చెప్పారు.

సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని కూడా ఆ సందర్భంలో తెలిపారు. తీరా విడుదలయ్యాక సినిమా ఫ్లాప్ కావడంపై రామ్‌గోపాల్ వర్మ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇలా విలేకరుల ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానమిచ్చే రామ్ గోపాల్ వర్మ శుక్రవారం రాత్రి అడవి సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

ప్రశ్న.. మధ్యాహ్న హత్య, రాత్రి, ఇప్పుడు "అడవి'తో ఇంకా ఎంతకాలం ప్రేక్షకుల్ని దడిపిస్తారు?

జ.. వారు చూడనంతవరకు...

ప్రశ్న.. అడవిలో నితిన్‌ను హీరోగా ఎందుకు పెట్టారు?

జ.. బుద్ధిలేక నితిన్‌ను తీసుకున్నా.

ప్రశ్న.. అడవిలో హీరోయిన్‌ను ఎక్స్‌పోజింగ్‌‌కు బాగా ఉపయోగించుకున్నారా?

జ.. హీరోని చూపలేంకదా..!

ప్రశ్న.. "రన్" సినిమాలో మీడియా గురించి ఏం చెప్పారు?

జ.. మీడియాపై 'రన్‌' అనే సినిమా తీస్తున్నాను. సినిమా చూశాక మీడియానే చెబుతుంది.

ప్రశ్న.. జనగణమణ'రన్‌' అనడంపై వివాదాస్పదమైంది. ఎందుకలాపెట్టారు?

జ.. కొత్తదనం కోసం "రన్‌" అనే పదం వాడాను.

Posted

@psyock

boss nuvvu chala manchi posts vestavu

cinema updates ni day to day istavu

really good you rock you rock

×
×
  • Create New...