Jump to content

Cases Filed On Nats !


Recommended Posts

Posted
 తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడతామని, ప్రవాస తెలుగుల సంక్షేమం కోసం పాటుపడతామని బాసలు చేశారు. విరాళంగా వచ్చిన ప్రతి రూపాయితోనూ అమెరికాలో తెలుగు వెలుగులు విరబూయిస్తామని ప్రతినబూనారు. చివరికి దారితప్పి, లక్ష్యాలను తుంగలో తొక్కి నిధులను దుర్వినియోగం చేశారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. చివరికి లాసూట్ ఎదుర్కొనేంత వరకూ పరిస్థితి వెళ్లింది. అమెరికాలో ప్రారంభమైన నార్త్ అమెరికా తెలుగు సొసాటీ (నాట్స్) వ్యథ ఇది.
 
లాభాపేక్షరహితంగా ఏర్పాటైన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు, కొందరు సభ్యులు ఏ విధమైన అనుమతులు లేకుండా, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల సమావేశంలో కోరం సైతం లేకుండా నిర్ణయాలు తీసుకుని అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారని లా సూట్ వేసిన పిటిషనర్ డాక్టర్ వీరయ్య చుండు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నాట్స్ వ్యవస్థాపక సభ్యులలో వీరయ్య కూడా ఒకరు.
 
గొప్ప ఆదర్శాలతో ప్రారంభించిన ఈ తెలుగు సంస్థను అందుకు అనుగుణంగా నిర్వహించడంలో ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి దారుణంగా విఫలమయ్యారని వీరయ్య ఆరోపించారు. కొందరు సభ్యులు నాట్స్‌కు ఒక చేత్తో విరాళం ఇచ్చి, మరో చేత్తో ఆ సొమ్మును ఇండియాకు మళ్లించారని, తద్వారా అమెరికా చట్టాలను ఉల్లంఘించారని అన్నారు. దాతృత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సిన విరాళాలను అందుకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని తన లా సూట్‌లో వీరయ్య ఆరోపించారు.
 
 
నాట్స్ సంస్థపైన, సంస్థ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, రవీంద్ర మాదల, డాక్టర్ అప్పారావు ముక్కామల, చక్రధర్ ఎస్ ఓలేటిలపై ఎస్ఎసివి15-468 జెవిఎస్ (ఆర్ఎన్‌బిఎక్స్) నెంబర్‌తో కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు దాఖలైంది.
 
 
కాలిఫోర్నియా కోర్టులో దాఖలైన ఈ లా సూట్ ప్రకారం నాట్స్ ఛైర్మన్ తదితరులపై వచ్చిన ఆరోపణల లోతుల్లోకి వెళితే... 2010లో డాక్టర్ అప్పారావు ముక్కామల ఆదాయపు పన్ను మినహాయింపు కోసం చారిటబుల్ డొనేషన్‌గా నాట్స్‌కు 245,000 డాలర్లను విరాళంగా అందజేశారు. ఈ సొమ్మును లాభాపేక్ష రహిత సంస్థగా నమోదైన గుంటూరులోని ఎన్నారై మెడికల్ కాలేజీకి నాట్స్ బదలాయించింది. ఇక్కడ కీలకం ఏమిటంటే... నాట్స్‌కు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చిన డాక్టర్ అప్పారావు ఈ కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లలో ఒకరు. నాట్స్ నుంచి బదలాయించిన మొత్తాన్ని ఆ సంస్థ నిర్దేశించుకున్న కార్యకలాపాలకు కాకుండా డాక్టర్ అప్పారావు వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించడం లక్ష్యాలను తుంగలో తొక్కడం తప్ప మరొకటి కాదు. పైగా ఈ వ్యవహారం గురించి నాట్స్ సభ్యులకు తెలియనే తెలీదు. లాభాపేక్ష రహితంగా ఏర్పాటైన నాట్స్ లాంటి సంస్థల ఆర్థిక కార్యకలాపాల నియంత్రణకు కొన్ని నియమ నిబంధనలుంటాయి. అవేవీ వీరికి పట్టలేదు.
 
 
ఇక రవీంద్ర మాదల విషయానికొస్తే.. ఈయనకు 2009-2012 మధ్య కాలంలో నాట్స్ నుంచి సుమారు 450,000 డాలర్ల బదలాయింపు జరిగింది. నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన నిధుల నుంచి ఇంత భారీ మొత్తాన్ని రవీంద్రకు ఎందుకు బదలాయించారని ఆరా తీస్తే... ఆయన గతంలో ఎప్పుడో నాట్స్‌కు అప్పు ఇచ్చారన్న సమాధానం వినిపిస్తోంది. అయితే, ఈ వ్యవహారానికి సంబంధించిన రాతపూర్వక పత్రాలు లేదా సాక్ష్యాలు గాని లేకపోవడం గమనార్హం. ఇదొక్కటే కాదు, 2009లో వ్యక్తిగత లీగల్ ఫీజు కింద రవీంద్రకు 29,000 డాలర్లను నాట్స్ చెల్లించింది. ఈ సొమ్ము కూడా నాట్స్ హెల్ప్ లైన్ నిధుల నుంచి ఇచ్చిందే.
 
లాభాపేక్ష సంస్థగా నమోదైన ఏ సంస్థ నుంచయినా ఈ విధంగా నిధుల బదలాయింపు జరగడం ఫ్లోరిడా, కాలిఫోర్నియా చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించడమే. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లకు తెలియకుండా జరిగిన ఆర్థిక కార్యకలాపాల గురించి తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి.
 
 
2013లో ఇండో-అమెరికన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు 195,000 డాలర్లను నాట్స్ చెల్లించింది. ఇది నాట్స్ వితరణ కార్యక్రమాల కోసం కాదు. అయితే, ఈ వ్యవహారంలోనూ ఇండో-అమెరికన్ ఫౌండేషన్‌తో డాక్టర్ ముక్కామల అప్పారావుకు ఆర్థిక సంబంధాలున్నాయి. దీని గురించి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లకు తెలియదు. ఈ మధ్య మరో 216,858.17 డాలర్లను భారత్‌లోని గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్‌కు మళ్లించారు. నాట్స్ డైరక్టర్లకు ఈ సంగతి కూడా తెలీదు. ఈ రకమైన మళ్లింపుల పర్వంలో చేరిన మరో వ్యవహారం.. మన దేశంలోని ఒక ముఖ్యమంత్రి సహాయనిధికి 16,700 డాలర్ల బదలాయింపు. ఇది వరద సహాయ నిధికి ఉద్దేశించింది. కానీ, ఈ వ్యవహారం రాజకీయ విరాళమే తప్ప వరద సహాయ కార్యక్రమాల నిర్వహణకు ఉద్దేశించింది కాదు. ఈ విరాళాల మళ్లింపు అమెరికాలోని ఇంటర్నల్ రెవెన్యూ కోడ్‌లోని సెక్షన్ 501 (సి) (3)కి విరుద్ధమన్నది పిటిషనర్ వాదన.
 
 
లాభాపేక్ష రహిత సంస్థగా ఏర్పడిన నాట్స్ కార్యకలాపాలను దాని లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్ కొర్రపాటి మధుపై ఉంది. సభ్యులు, బయటివారి నుంచి వచ్చే విరాళాలను సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు పెట్టాలి. డైరక్టర్ల సమావేశాల్లో చేసిన తీర్మానాల్లోని అంశాలు వేటికీ భంగం కలుగకుండా జాగ్రత్తగా అమలు చెయ్యాలి. ఇవేవీ జరగలేదు.
 
నాట్స్ ఛైర్మన్ మధు తీరు సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఉందని, ఆయన తీరు బాధ్యతారహితంగా ఉందని చుండు వీరయ్య తన లా సూట్‌లో ఆరోపించారు. త్వరలో ఈ కేసు విచారణ జరుగనుంద
 
 
Posted

chala rojuluki vachav man

Posted

all these orgs in US are BS man..


Tax evasions and heroines kosame ye organizations anni, okka dani teega lagithe migilina organizations donka kadutundi.

44NF3nE.gif
Posted

Heroine Ni book chesukovalante ee orgs lo join avvala??

Posted

Tax evasions and heroines kosame ye organizations anni, okka dani teega lagithe migilina organizations donka kadutundi.

44NF3nE.gif

TANA reliable kada man?, I mean they have some proven history and contributions.
Posted

TANA reliable kada man?, I mean they have some proven history and contributions.


Valla dantlo kuda untayi kani bitiki raledu so far. Kani ye organizations ina heroines Matter ithe common..

44NF3nE.gif
Posted

Telugu jaathi manadhi...ninduga velugu jaathi manadhi

Posted

Valla dantlo kuda untayi kani bitiki raledu so far. Kani ye organizations ina heroines Matter ithe common..
 

:3D_Smiles:

Posted

Valla dantlo kuda untayi kani bitiki raledu so far. Kani ye organizations ina heroines Matter ithe common..

44NF3nE.gif

:police:
Posted

telugu font radu matter ento okka mukka lo selaviyandi plz

×
×
  • Create New...