Jump to content

Mannchu Lakshmi Fans... Gattiga Kottesam


Recommended Posts

Posted

సినిమా రివ్యూ: దొంగాట
రేటింగ్‌: 3/5
తారాగణం: మంచు లక్ష్మి, అడివి శేషు, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, రఘు కుంచె, సత్య మహావీర్‌
కెమెరా: భాస్కర్‌
ఎడిటర్‌: శేఖర్‌
నిర్మాత: మంచు లక్ష్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ

మంచు లక్ష్మి ప్రతిభ గల నటి కానీ ఆర్థికంగా విజయవంతమైన సినిమాలు నిర్మించడంలో విఫలమైంది. ఒక విధమైన ప్రయోగాత్మక చిత్రాలని చేసి చేతులు కాల్చుకున్న మంచు లక్ష్మి ఈసారి వినోదాన్ని నమ్ముకుంది. మనీ, కిష్కిందకాండ, పట్టుకోండి చూద్దాం, స్వామిరారా లాంటి క్రైమ్‌ మిళితమైన కామెడీ సినిమాలని మన ప్రేక్షకులు బాగానే ఆదరించినా కానీ ఎందుకో ఆ జానర్‌లో ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ జానర్‌లో సినిమాలన్నీ ఒకే మూసన వెళుతుంటాయి. అయినప్పటికీ వినోదం పండించడానికి కూడా వీలుంటుంది. కాకపోతే వినోదాన్ని పండించడంపై దర్శకుడికి పట్టుండాలి. కొత్త దర్శకుడు వంశీకృష్ణకి ఫ్రెష్‌ ఆలోచనలున్నాయి. అందుకే రొటీన్‌ కాన్సెప్ట్‌ అయినా కానీ వినోదాన్ని పండించగలిగాడు.

కథ:
హీరోయిన్‌ శృతిని (మంచు లక్ష్మి) కిడ్నాప్‌ చేసిన వెంకట్‌ అండ్‌ కో (శేషు, మధు, ప్రభాకర్‌) పది కోట్లు కావాలని అడుగుతారు. పది కోట్లు చేతికి రాబోతున్నాయనే టైమ్‌కి వాళ్ల మధ్య వాళ్లకే గొడవలు వస్తాయి. ఈలోగా పోలీసులకి తమ ఆచూకీ తెలిసిపోతుంది. పది కోట్లు వారి చేతికి వస్తాయా రావా, అసలు ఈ కిడ్నాప్‌ చేయడానికి ప్లాన్‌ చేసింది ఎవరు, పోలీసులకి వీళ్లు దొరికిపోతారా లేదా వంటి ప్రశ్నలకి సమాధానం ద్వితీయార్థంలో దొరుకుతుంది.

కథనం:
క్యారెక్టర్లని పరిచయం చేయడానికి అసలు సమయం తీసుకోకుండా కేవలం వాయిస్‌ ఓవర్‌తో వాళ్ల ఇంటెన్షన్‌ ఏంటనేది చెప్పేసి సరాసరి కథలోకి వెళ్లిపోయారు. కిడ్నాప్‌ జరగడానికి కూడా ఎక్కువ బిల్డప్‌ ఉండదు. అంతా సింపుల్‌గా కానిచ్చేసి, బ్రహ్మానందాన్ని త్వరగా రంగంలోకి దించేసి కామెడీతో లాగించేసాడు. కామెడీ మినహా మిగతాదంతా రొటీన్‌గా సాగిపోతుందని అనిపించిన టైమ్‌లో ఊహించని మలుపులతో ఆసక్తికరంగా మారుతుంది.

ప్రథమార్థంలో ఉన్న వినోదాన్ని ద్వితీయార్థంలో కొనసాగించకపోవడం ఒక లోపం. బరువైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉండొచ్చు కానీ పూర్తిగా కామెడీని పక్కన పడేయడంతో ఫస్టాఫ్‌కి, సెకండాఫ్‌కి సింక్‌ అవలేదు. మళ్లీ ప్రీ క్లయిమాక్స్‌కి వచ్చాక కానీ దొంగాట మూడ్‌లోకి రాలేదు. కామెడీ కోసమని పవిత్రపై బ్రహ్మానందం, పృద్వీ ఇద్దరితోను ద్వందార్ధ సంభాషణలు పలికించారు. అలాంటివి ఎంజాయ్‌ చేసేవాళ్లకి నచ్చుతాయి కానీ క్లీన్‌ కామెడీ కోరుకునే వాళ్లు హర్ట్‌ అవుతారు.

పతాక సన్నివేశాల్లో టెంపో బాగుంది. ఊహించని మలుపులు, తెలివైన గేమ్‌తో దొంగాట ఆకట్టుకునే నోట్‌లో ఎండ్‌ అవుతుంది. సినిమావాళ్లు కదా.. స్క్రీన్‌ప్లేకి పడిపోతారు, సినిమావాళ్లం కదా.. స్క్రీన్‌ప్లేతో పడేస్తాం అనే పంచ్‌లు పర్‌ఫెక్ట్‌గా పేలాయి. నిజంగానే ఇందులోని స్క్రీన్‌ప్లేతోనే ప్రేక్షకులని పడేసారు. బ్రహ్మానందం పాత్రని అర్ధాంతరంగా ముగించడంతో పాటు చాలా లాజిక్‌లు గాలికి వదిలేసారు. కామెడీ సినిమా కాబట్టి వాటి గురించి అంతగా ఆలోచించకూడదని మనకి మనం సర్ది చెప్పుకోవాలి.

సినిమా ఆద్యంతం వినోద భరితంగా లేదు కానీ నవ్వించే సన్నివేశాలు బాగానే ఉన్నాయి. అలాగే పతాక సన్నివేశాలు థ్రిల్‌ కలిగిస్తాయి. లాజిక్‌కి అంతు చిక్కకపోయినా కానీ ఆ సీన్లో ఆడిన ప్లే బాగుంది. మొత్తమ్మీద దొంగాట చిత్రాన్ని హ్యాపీగా పాప్‌కార్న్‌ నములుతూ చూసేయవచ్చు... పెద్దగా బుర్రకి పని చెప్పాల్సిన పని లేకుండా.

నటీనటులు:
మంచు లక్ష్మి ఇందులో తనలోని చాలా యాంగిల్స్‌ చూపించింది. సింగర్‌గా అవతారమెత్తింది. ఒక పెద్ద ఫైట్‌ సీన్‌ కూడా చేసింది. డాన్సులు చేసింది, సెంటిమెంట్‌ పండించింది, కామెడీ కూడా ట్రై చేసింది. శేషు స్టయిలిష్‌గా నటించాడు. ఈ చిత్రానికి అతనో హైలైట్‌గా నిలిచాడు. బ్రహ్మానందం కామెడీ బాగా నవ్విస్తుంది. మధునందన్‌ కూడా బాగానే నవ్వించాడు. పృధ్వీ చేసే సీరియస్‌ కామెడీ కూడా వర్కవుట్‌ అయింది. పవిత్ర, ప్రభాకర్‌ తమ పాత్రలకి న్యాయం చేసారు. రాణా చిన్న క్యారెక్టర్‌ చేసాడు. బ్రహ్మానందంతో అతని సీన్‌ బాగా పేలింది. ఒక పాటలో నాగార్జున, రవితేజ, నాని, శింబు, నవదీప్‌, సుధీర్‌బాబు, సుషాంత్‌, తాప్సీ తళుక్కున మెరిసారు.

సాంకేతికవర్గం:
పాటలు సోసోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో కాపీ సీన్లు బాగానే ఉన్నాయి. దర్శకుడిపై హాలీవుడ్‌ సినిమాల ప్రభావం బానే ఉంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడ్నుంచి కాపీ కొట్టారో కూడా రిఫరెన్స్‌ చెప్పేసారు. వంశీ కృష్ణ దర్శకత్వం బాగానే ఉంది. తనకున్న వనరులతో ఆకట్టుకునే సినిమా తీయగలిగాడు. సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది.

చివరిగా...
ఒక్కసారి చూసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేని సరదా చిత్రమిది. క్రైమ్‌ కామెడీలు ఇష్టపడే వారిని ఎక్కువ ఆకట్టుకుంటుంది. ఓపెనింగ్స్‌ అంతగా లేవు కానీ పబ్లిసిటీ, మౌత్‌ టాక్‌తో పుంజుకునే అవకాశముంది.

Posted

waiting for movierulz

Why? Mee local theater lo tickets doraktleda?
Snow aunty ki tweet chei tickets ippistadi
Posted

Why? Mee local theater lo tickets doraktleda?
Snow aunty ki tweet chei tickets ippistadi

Posted

Why? Mee local theater lo tickets doraktleda?
Snow aunty ki tweet chei tickets ippistadi

threatre lo fafa ni chudali ante mari ragada8.gif

Posted

 

Why? Mee local theater lo tickets doraktleda?
Snow aunty ki tweet chei tickets ippistadi

 

Posted

avg anta...deepga pettesaranta black-guy-laughing-on-boat-gif.gif

Posted

1st day 30 crs collection

 

vuu goose bumps...

 

IH

BB

Posted

Ol lo 1080p vachhina nen sudanu44NF3nE.gif

×
×
  • Create New...