Jump to content

Recommended Posts

Posted

                                                        
images.jpg
                                                
 
నటీనటులు: నటన పరంగా బాలకృష్ణ తనదైన శైలిలో క్యారెక్టర్ లో ఇమిడిపోవాలని  చూసాడు కానీ , క్యారెక్టర్ లో, కధ లో ఉన్న లోపాల వల్ల  ఇంప్రెస్ చేయలేకపోయాడు. గాడ్సే పాత్రలో తనెవరో తన గతం ఏంటో తెలుసుకునే తపన ని బాగానే చూపించినా  ఆ పాత్ర గెటప్/మేకప్ దారుణంగా ఉన్నాయి.  
 
త్రిష పరవాలేదు , రాధిక ఆప్టే పెద్దగా నటనకు అవకాశం లేని పాత్ర చేసింది. ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా ఒకే.  జయసుధ ,గీత ,చంద్రమోహన్ ,కోట ఇలా పేరున్న నటీనటులు బాగానే ఉన్నా వాళ్ళంతా గుంపులో గోవిందా టైపు లో ఉన్నారంటే ఉన్నారు అంతే.
 
కధ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బేసిక్ స్టొరీ లైన్ లో మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నా తెరకెక్కించడం లో దర్శకుడు సత్యదేవ ఘోరంగా విఫలమయ్యదు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగా ల్సిన ఫస్టాఫ్ ని హండిల్ చేయలేకపోయాడు. బాలకృష్ణ - త్రిష మద్య వచ్చే లవ్ ట్రాక్ పేలవంగా ఉండి పేషన్స్ ని టెస్ట్ చేస్తుంది. అలాగే రాధిక ఆప్టే తో వచ్చె లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. క్లూలెస్  గా సాగుతున్న ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ఒక కొలిక్కి వస్తుంది , సరిగ్గా హేండిల్ చేసి ఉంటె ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకేల్లేదే , ఐతే మంచి బాంగ్ తో ఓపెన్ అయిన ఆ ఎపిసోడ్ తరువాత అదే ఊపు ని కంటిన్యూ చేయడం లో ఫెయిల్ అయింది ,కీలకమయిన బాలకృష్ణ -ప్రకాష్ రాజ్ ల ఫస్ట్ సీన్ డైలాగ్స్ లో పస లేకపోవడం వల్ల వీక్ అయిపొయింది. 
 
ఫస్టాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది తప్ప సెకండ్ హాఫ్ లో కూడా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేవు, ఫస్టాఫ్ లో చాలా టైం వేస్ట్ చేసేయడం వలన అసలు కద  దగ్గర కి వచ్చేసరికి అంతా   గజిబిజి వ్యవహారం లా తయారయింది. పైగా హీరో ,విలన్  టెక్నాలజీ ని వాడుకుని ఒకరి మీద ఒకరు ఎత్తులు వేసినట్టు చూపించిన సీన్స్ మరింత గందరగోళం  పెంచాయి. చివరి 20 నిముషాలని జెట్ స్పీడ్ వేగం తో లాగించినా అక్కడ అంతగా త్రిల్ చేసే సీన్స్ లేవు . 
 
 
డైలాగ్స్ సినిమాకి పెద్ద మైనస్  , కెమెరా/ఎడిటింగ్ వర్క్ ఒకే . మణిశర్మ సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగుంది కానీ బోస్ క్యారెక్టర్ కి ఇచ్చిన థీమ్ తేలిపోయింది .  


రేటింగ్: 3/10



చివరిగా: బాలకృష్ణ కెరీర్ లో వచ్చిన బ్యాడ్ ప్రొడక్ట్స్ లిస్టు లో చేరడానికి  అన్ని అర్హతలు ఉన్న సినిమా  లయన్. 
Posted

trisha parvaledu ante etra meaning? exposing chesindaa ledaa cheppi chaav jaffa auto bob gaa

Posted

trisha parvaledu ante etra meaning? exposing chesindaa ledaa cheppi chaav jaffa auto bob gaa

 

exposing em ledu le nuvvu vellaku ra book avutav :D

Posted

wrong review min 9/10 veyyaliphoto-thumb-52121.jpg?_r=1431587270

antha pedda manasu ledu bhayya naaku :D

Posted

antha pedda manasu ledu bhayya naaku :D

ite neku next day undadu abhimaanula agrahaniki guri kaakuphoto-thumb-52121.jpg?_r=1431587270

×
×
  • Create New...