SnowBaabu Posted May 27, 2015 Report Posted May 27, 2015 ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కళాభారతి కట్టాలని ప్రభుత్వం భావించింది. అది విద్యార్థుల ఆటస్థలం, అక్కడ కళాభారతి కట్టవద్దని గొడవ. హుస్సేన్‌సాగర్ నీళ్లన్నీ బురదమయమై దర్గంధం వెదజల్లుతున్నది. నీళ్లను ఖాళీచేసి, సాగర్‌ను శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే.. ఆకాశం బద్ధలయినంత హడావుడి. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంతంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా కొత్త సెక్రటేరియట్ కడదామని ప్రభుత్వం భావించింది. అది వారసత్వ సంపద అని కోర్టుకెక్కారు. నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి అవసరమైతే యూనివర్సిటీల స్థలం కొంత తీసుకుంటామని సీఎం చెప్పారు. విద్యావ్యవస్థకు, విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమనే విధంగా ఆందోళనలు చేస్తున్నారు. బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవం పెరిగేలా బంజారాభవన్, ఆదివాసీ భవ నం నిర్మించడానికి సీఎం శంఖుస్థాపన చేశారు. దాన్నీ వివాదంలోకి లాగారు. సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు కట్టాలని, అందులో నిరుపేదలకు నివాసయో గం కల్పించాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. సాగర్ చుట్టూ ఉన్న స్థలమంతా ఎఫ్.టి.ఎల్. పరిధిలోకి వస్తుంది. భవనాలు ఎలా కడతారు అని ప్రశ్నించారు. గురుకుల్ ట్రస్టు బోర్డు స్థలంలో, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు తీసుకుంటే దీనికి వ్యతిరేకంగా గొడవ. ఇండ్లు కట్టుకున్న వారు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పై పరిణామాలన్నీ చూస్తుంటే.. కృత్రిమ ఉద్యమాలకు కాలం చెల్లలేదనే విషయం స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూసిన శక్తులు తమ అనుభవాన్నంతా రంగరించి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి పాచికలు వేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఓ విఫలరాష్ట్రంగా చూపే ప్రయత్నాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏ కార్యం చేపట్టినా దానికి ఎలాగోలా ప్రజలకు ఫలం అందకుండా చేయడమే లక్ష్యం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియాన్ని క్రీడాకారులకే వదిలెయ్యాలి అంటున్న రాజకీయ నాయకులు ప్రస్తుతం ఆ స్థలాన్ని ఎవరి కోసం వాడుతున్నారో చెప్పాలి. అసలక్కడ క్రీడాకారులు ఏనాడైనా ఆటలు ఆడారా? ఎప్పుడూ ఎగ్జిబిషన్లు, మీటింగులతోనే సరిపోయింది కదా? అలాంటి చోట ఓ అద్భుతమైన కళాభారతి వస్తే అభ్యంతర పెట్టాల్సిన పనేంటి? ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి వారసత్వ సంపద అని చెబుతున్నారు. మరి అంతగొప్ప వారసత్వ సంపద అయితే, ఆ భవనం శిథిలమై కూలిపోయినా గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదు. గురుకుల్ ట్రస్టు భూముల్లో పెద్దల భవనాలు కూల్చివేస్తే ఎందుకు అంత ఉలుకు? ప్రభుత్వ భూములను అప్పనంగా ఆక్రమించిన వారి పక్షాన ఎందుకు నిలవాలి? మరి ఇల్లు కట్టుకున్న వారు ఎక్కడికి పోవాలి అని ప్రశ్నిస్తున్న వారే కదా, మొన్నటి దాకా అధికారంలో ఉండి వారి ఆక్రమణలు అవకాశం ఇచ్చింది. హుస్సేన్ సాగర్ నీళ్లు ఖాళీ చేస్తే బ్రహ్మాండం బద్దలవుతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చాలా వరకు ఖాళీ చేశారు. ఏమీ కాలేదే? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట గతంలో హడావుడి జరిగింది తప్ప నిజంగా ఏమైనా పనికొచ్చే పని జరిగిందా? హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మాణాలే వద్దంటున్నారు. వీరికి సాగర్ పరిరక్షణ మీద ఎంత శ్రద్ధ అనిపిస్తుంది. కానీ 1400 ఎకరాలున్న సాగర్ వెయ్యి ఎకరాలకు ఎందుకు తగ్గింది. సాగర్ చుట్టూ వెలిసిన నిర్మాణాలు కాంగ్రెస్,టీడీపీ హయాంలో వచ్చినవి కాదా? నాడు వీరికి ఎఫ్.టి.ఎల్. గుర్తుకు రాలేదా? సికింద్రాబాద్ నియోజకవర్గంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనేక మంది ఇండ్లు లేని పేదలు తారసపడ్డారు. తమకు ఇండ్లు కట్టించాలని వేడుకున్నారు. ప్రభుత్వ స్థలం కోసం వెతికారు. కానీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా గజం ఖాళీ స్థలం కూడా దొరకలేదు. అప్పుడు ముఖ్యమంత్రి అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ స్థలంలో కొంత తీసుకుని ఇండ్లు కడతాం అని చెప్పారు. దానికి ఎంత హడావుడి. గతంలో అసలు ప్రభుత్వ భూముల బదలాయింపు జరగనట్లే మాట్లాడుతున్నరు. విద్యాసంస్థలకు కేటాయించిన వందల, వేల ఎకరాలు వేరే కార్యకలాపాలకు మళ్లించిన దాఖలాలు ఈ రాష్ట్రంలోనే కోకొల్లలు. ఓయూతో పాటు రాష్ట్రంలోని అనేక యూనివర్సిటీలకు మొదలు కేటాయించిన స్థలం యథావిధిగా ఆ యూనివర్సిటీల ఆధీనంలోనే ఉన్నదా? లెక్కలు చూస్తే తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకుల అండతో దాదాపు ప్రతీ యూనివర్సిటీలో కూడా భూ కబ్జాలు జరిగాయి. తాము అధికారంలో ఉండగా, యూనివర్సిటీల స్థలం దురాక్రమణకు గురయితే పట్టించుకోని వారు, పేదల ఇండ్ల కోసం కొంత స్థలం వాడుకుంటామంటే అభ్యంతరం పెట్టడమెందుకు? పేదల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించవద్దని ఆందోళనలు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? ఇంత సంకుచితంగా ఆలోచిస్తే ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏం చేయగలుగుతుంది? బహుశా ఈ కృత్రిమ ఆందోళనల పరమార్థం కూడా ఇదేనేమో. ప్రభుత్వం చేతులు, కాళ్లు కట్టేసి.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కల్పించాలనేది వారి లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూముల వినియోగంపై అనవసర రాద్ధాంతాలు జరగడం వల్ల చాలా ప్రజోపయోగ కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడం లేదు. శాఖలు వేరైనా టోటల్‌గా ప్రభుత్వం ఒక్కటే. ప్రజల కోసం చేసే పని విషయంలో ఒక్కో శాఖ ఒక్కో నిబంధన పెట్టుకోవడం, తమకు తామే గిరి గీసుకుని కూర్చోవడం కూడా మంచిది కాదు. గోల్కొండ కోట ప్రాంతంలో రాష్ట్ర పండుగలు జరుపుకుందామంటే సైనిక అధికారుల అభ్యంత రం. కంటోన్మెంట్ మీదుగా ఓ మంచి రహదారి నిర్మించుకుందామన్నా, అండర్ గ్రౌం డ్ డ్రైనేజి వేసుకుందామన్నా, మంచినీటి పైపులైను నిర్మించాలన్నా ఎన్నో చిక్కులు. అది తమ ఆధీనంలోని భూమి కాబట్టి అడుగు పెట్టవద్దంటారు సైనికాధికారులు. గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తరలించటానికి వందల కిలోమీటర్ల పైపు లైను నిర్మాణం పూర్తయినా... రైల్వే గేట్ల వద్ద పనులు ఆగుతున్నాయి. రైల్వే శాఖ అభ్యంతరాలు. ఏళ్లు గడిచినా క్లియరెన్సులు రావు. అటవీ ప్రాంతంలో ఓ కాలువ తవ్వుకుందామన్నా, ఓ రోడ్డు వేసుకుందామన్నా, కనీసం కరెంటు పోళ్లు వేసుకుందామన్నా అటవీశాఖ నుంచి అభ్యంతరాలు. అటవీభూమి అన్యాక్రాంతమైతే పట్టించుకునే వారుండరు. అదే అడవిలో ప్రజల కోసం చేస్తే మాత్రం ఎన్నో చిక్కులు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్రంలోని రాజకీయ నాయకుల వైఖరి, ఇటు ప్రభుత్వ విధానాల్లో మార్పలు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను వాడుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండాలి. నిరుపేదల ఇండ్ల లాంటి అత్యంత ఆవశ్యకమైన అవసరాలు తీర్చే విషయంలో నాయకులు కూడా విజ్ఞతతో వ్యవహరించాలి. ఇక కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభు త్వం.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మరింత బలపరిచేందుకు నీతి అయోగ్ తెచ్చినట్లు చెబుతోంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రజా కార్యక్రమాలకు కేంద్ర శాఖల నుంచి అభ్యంతరాలు లేకుండా చూస్తే మంచిది. ప్రభుత్వభూమిని అప్పనంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయంలో రాజకీయ నాయకులంతా చిత్తశుద్ధిని ప్రదర్శించడం ఎంత అవసరమో, అదే సమయంలో ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కోసం వాడే విషయంల కూడా ఉదారంగా ఉం డడం అంతే అవసరం. ఇండ్లు కట్టాలన్నా, ఆసుపత్రులు నిర్మించాలన్నా, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలన్నా భూమి కావాల్సిం దే. వైఫై సిగ్నల్స్ లాగా వాటిని గాలిలో ఉంచలేరు. ఉన్న భూమినే సమర్థవంతంగా వాడుకోవాలి. భూమి పెరగదు. కానీ ప్రజల అవసరాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా రాజకీయ కార్యాచరణ ఉండాలి. నిబంధనల పేర, మనకు మనం సృష్టించుకున్న సంకుచిత విధానాల ఫలితంగా ప్రగతి ఆగిపోకూడదు. గిరి గీసుకు ని కూర్చుంటే మన భవితకు ఉరి వేసినట్లే లెక్క.
xxxmen Posted May 27, 2015 Report Posted May 27, 2015 Kastam ma TG valaku chadavadam radu dora sepute vintam
RunRaajaRun123 Posted May 27, 2015 Report Posted May 27, 2015 Ika mee jeevitham mee tara taralu motham Em jarigina andhrolla kutra ani brathakadame
athapurbaba Posted May 27, 2015 Report Posted May 27, 2015 Lol punchhh Kastam ma TG valaku chadavadam radu dora sepute vintam
TOM_BHAYYA Posted May 27, 2015 Report Posted May 27, 2015 Ika mee jeevitham mee tara taralu motham Em jarigina andhrolla kutra ani brathakadame Anthe ga
idiBeZaWaDa Posted May 27, 2015 Report Posted May 27, 2015 1st separate state vachedaka edupu annaru...munde mukku sootiga lifelong edupu ani sepochuga..
posaanisam Posted May 27, 2015 Report Posted May 27, 2015 lol state lo ou valani control cheyaleka ila cover drives start chesara nice
idiBeZaWaDa Posted May 27, 2015 Report Posted May 27, 2015 Title vere laga chadivanu i understood...bad aunty..
riashli Posted May 27, 2015 Report Posted May 27, 2015 adolla kutra Yes..avesam ga vacha ee thread Loki
Recommended Posts