ye maaya chesave Posted May 30, 2015 Report Posted May 30, 2015 నటీనటులు: సూర్య నటనా ప్రతిభ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు , ఎలాంటి పాత్రని అయినా అవలీలగా పోషించే సూర్య రాక్షసుడు లో కూడా మాస్ ,శివ గా రెండు పాత్రల్లో ఒదిగిపొయాడు.నయనతార , ప్రణీత ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు ,హీరో స్నేహితుడిగా ప్రేమ్ జీ పరవాలేదు. పార్తిబన్ ,సముద్రఖని ఇతర నటీనటులు ఒకే .కధ- స్క్రీన్ప్లే-దర్శకత్వం: కధ రొటీన్ రివెంజ్ డ్రామానే అయినప్పటికీ వెంకట్ ప్రభు తనదైన శైలి లో వీలైనంత కొత్తగా ,ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మాస్ పాత్ర పరిచయం దగ్గరినుంచి, లవ్ ట్రాక్ వగైరా సీన్స్ అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అయితే కధ లో ఆత్మలు ఎంటర్ అయిన దగ్గర నుంచి కధనం ఊపందుకుంటుంది. ఆత్మలని వాడుకుని హీరో డబ్బు సంపాదించే సీన్స్ లో కామెడీ బాగానే పండింది. ఇక శివ పాత్ర ఎంట్రీ ,ఆ తరువాత వచ్చే ట్విస్ట్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో లో మార్పు రావడం, ఆత్మలకి అతను సహాయం చేసే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. శివ ఫ్లాష్ బ్యాక్ కధ ఊహించదగ్గదే అయినా,ఒకేసారి మొత్తం కద చెప్పకుండా దాచి మరీ రొటీన్ వ్యవహారం లా కాకుండా చూసుకున్నాడు. అయితే కధ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండడం ,ట్విస్టులు ఎక్కువైపోవడం వల్ల కధనం సాగదీసినట్టు అనిపిస్తుంది.మాటలు పర్వాలేదు , యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఓకే ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ కూడా ఒకే. అయితే గ్రాఫిక్స్ అంతగా బాగోలేవు .రేటింగ్: 6/10చివరిగా: రొటీన్ కధే అయినా సూర్య నటన, వెంకట్ ప్రభు దర్శకత్వ ప్రతిభ వల్ల ఈ రాక్షసుడు గట్టేక్కాడు .
King_Kong Posted May 30, 2015 Report Posted May 30, 2015 Just came after watching this movie. Parledhu. Routine revenge drama ayina prathi scene kothaga chupinchalani try chesadu. Ekada bore kotanivakunda cinema teeyadam lo success ayyadu.
Recommended Posts