Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో హైకోర్టు తెలంగాణ సభాపతికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కోర్టు చెప్పింది. పిటిషన్ విచారించిన న్యాయస్థానం... ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన స్పీకర్ ఇంకెంత కాలం సమయం తీసుకుంటారో చెప్పాలని నోటీసులో పేర్కొంది. అడిషనల్ జనరల్ (ఏజీ) ద్వారా సభాపతి నుంచి సమాచారం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాగా, గత ఏడాదిగా పలువురు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని ఆయా పార్టీలో సభాపతికి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి తదితరులు పార్టీ మారారు.

 

ippudu kukatpally, talasani ni rajinami chesi gelavamanu

Posted

Kukatpalli lo money Kuda avasarm ledu janalu egesukuni vote vestaru

×
×
  • Create New...