dappusubhani Posted June 6, 2015 Author Report Posted June 6, 2015 ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమరదీక్షను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు, సంఘీభావం తెలిపిన అశేష ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలుపుతోంది. సమరదీక్షకు జనం సమరోత్సాహంతో కదలివచ్చారు. ఎండ మండుతున్నా పట్టించుకోకుండా చంటిపిల్లల్ని ఎత్తుకుని మరీ అనేకమంది మహిళలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నడవలేకపోయినా వృద్ధులు దీక్షలో పాల్గొనేందుకు వచ్చారు. రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, సాధారణ జనం జననేతకు సంఘీభావంగా కదలివచ్చారు. ఈ స్ఫూర్తితో చంద్రబాబు ప్రజా కంటక ప్రభుత్వంపై మన పోరాటాన్ని మరింత ముమ్మరం చేద్దామని దీక్ష బూనుదాం...
Recommended Posts