Jump to content

Recommended Posts

Posted

                                                                     images.jpg

 

నటీనటులు: జైలర్  ధర్మ గా నారా రోహిత్ నటన బాగుంది, అయితే అతను అర్జెంటు గా తన బరువుని తగ్గించుకునే ప్రయత్నం చెస్తే మంచిది , అది అతని లుక్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రియ బెనర్జీ పరవాలేదు , రవివర్మ కి చాలా  రోజులకి నటనకి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. మధు సింగంపల్లి , సత్యదేవ్ తమ ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేసారు. మిగతా నటీనటులు ఒకే.


కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బేసిక్ స్టొరీ లైన్ చాలా చిన్నది ,ఎ చిన్న తప్పునీ క్షమించని జైలర్ కి, ఉరిశిక్ష పడ్డ ఖైదీకి మధ్య గేమ్. ఫస్టాఫ్ వరకు కధనం సాఫీగా సాగిపోయింది. హీరో ఇంట్రో,క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు లవ్ ట్రాక్ ని కూడా ఎక్కువ సాగదీయకుండా విలన్ క్యారెక్టర్నిరంగం లోకి  దించి అసలు గేమ్ స్టార్ట్ చేసాడు దర్శకుడు. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బాంగ్ ఇచ్చి  సెకండాఫ్ మీద అంచనాలు పెంచేసాడు.అయితే ఆ అంచనాలని అందుకోవడం లో ఫెయిల్ అయ్యాడు.

విలన్ కి ఇచ్చిన బిల్డప్ కి తగ్గ కంటిన్యూయిటీ తరువాత లేదు, దాని వల్ల హీరో క్యారెక్టర్ కి కూడా ఎలివేషన్ దక్కకుండా పోయింది. ఎత్తులకి పై ఎత్తులతో సాగుతుందనుకున్న సెకండాఫ్ ఆశించిన ఉత్ఖంట,వేగం రెండూ లోపించి నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ వద్ద వచ్చే ట్విస్ట్ ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ పాయింట్.,కానీ దాని వల్ల అసలు కధ మరుగున పడిపోయినట్టయింది. ఓవరాల్ గా దర్శకుడు కృష్ణ విజయ్ మొదటి ప్రయత్నం లో ఆకట్టుకున్నా, అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడం లో తడబడ్డాడు.


డైలాగ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ పరవాలేదు.  సాయి కార్తిక్ అందించిన పాటలు ఒకే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది కానీ కొన్ని చోట్ల లౌడ్ నెస్ ఎక్కువైంది.


రేటింగ్: 5.5/10


చివరిగా: సెకండాఫ్ మీద మరింత కేర్ తీసుకుని ఉంటే "అసుర"  మంచి చిత్రంగా నిలిచేది. ఇప్పటికైతే కొత్తదనం కోసం ప్రయత్నించి కొద్దిలో మిస్ అయిన చిత్రాల జాబితాలో చేరింది. 

×
×
  • Create New...