Jump to content

Recommended Posts

Posted

రూ. 150 కోట్లతో చంద్రబాబు స్కెచ్

- తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రూ.75 కోట్లు

- ఏపీలో స్థానిక ప్రజాప్రతినిధుల కోసం మరో 75 కోట్లు
- డబ్బు సమకూర్చే బాధ్యత ఇద్దరు రాజ్యసభ సభ్యులకు
- ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తల నుంచి వసూలు
- రేవంత్ పట్టుబడటంతో బెడిసికొట్టిన బాబు వ్యూహం

Posted

ఇంతకీ ఆ గొంతు బాబుదా.. కాదా?

న పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 'మహాసంకల్ప' సభలో చంద్రబాబు ప్రసంగం ఆసాంతం విన్న తర్వాత సామాన్యులకు అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి.

''ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను'' అని ఆయన అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాప్ అయ్యిందని ఆయన అంగీకరించినట్లే అవుతుంది కదా. ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలలో గొంతు తనదేనని ఆయన చెప్పక చెప్పినట్లే కదా.

ఇక మరొక్క సెకను దాటగానే.. ''నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. అవి టీ-ఛానల్లో ప్రసారం చేశారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు'' అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పినట్లవుతుంది.

ఇలా రెండు విభిన్న రకాల ప్రకటనలను వెంటవెంటనే చేసేయడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి వాస్తవం అయినా.. రెండోది కచ్చితంగా అవాస్తవమే అవుతుంది.

Posted

టీడీపీలో టెన్షన్..టెన్షన్!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు కోసం ఏకంగా అయిదు కోట్లు ఎర చూపిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉదంతంలో సీఎం చంద్రబాబు సైతం నేరుగా దొరికిపోవడంతో తెలుగుదేశం నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇది ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బాబు ఫోన్‌లో నేరుగా మాట్లాడిన సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు టీడీపీ నేతలు పలు దఫాలుగా బాబుతో  సమాలోచనలు జరిపారు.

ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీసిందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిల్లోంచి ఏదోవిధంగా బయటపడటానికి ప్రయత్నించాలని, టెలిఫోన్ సంభాషణను ఫోన్ ట్యాపింగ్ అంశంగా మార్చి దాన్నే ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ కేసు వ్యవహారం బాబు వ్యక్తిగతమైనప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదంలా చేయడం ద్వారా ప్రజల దృష్టిని కొంతైనా మళ్లించడానికి వీలవుతుందని నిర్ణయానికొచ్చారు.

ఆ వెంటనే జిల్లాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం, ఆయనపై కేసులు పెట్టడం వంటి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. మహాసంకల్పం సభ కోసం గుంటూరు చేరుకున్న జిల్లాల నేతలు అక్కడి నుంచే  తమ  అనుయాయులను పురమాయించారు. ఇలావుండగా, నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్‌లో బాబు జరిపిన సంభాషణ ట్యాపింగ్ ద్వారా బయటపడింది కాదన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ అది నామినేటెడ్ ఎమ్మెల్యే తన ఫోన్‌లో రికార్డు చేసిన వ్యవహారమని తేలితే మటుకు మరోసారి చిక్కుల్లో పడకతప్పదేమోనన్న ఆందోళనలో ఉన్నారు.

Posted

నేనేమైనా ఈ కేసీఆర్కు సర్వెంటునా: చంద్రబాబు

ఉమ్మడి రాజధానిలో తన ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్కు ఎక్కడిదని, తానేమైనా కేసీఆర్కు సర్వెంటునా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'మహాసంకల్ప సభ'లో ఆయన మాట్లాడారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని, దాన్ని టీ ఛానల్లో ప్రసారం చేశారని అన్నారు. ''మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుంది.. చెప్పండి'' అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి.
  • రేవంత్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.
  • నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. ఇది నీ జాగీరా.. కాదు.
  • నామీద కుట్ర చేస్తున్నారు. నీతి, నిజాయితీగా బతికాను. ప్రజా సేవ కోసం బతికాను.
  • కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నామీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్లూ అని అడుగుతున్నా.
  • హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది.
  • ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిలబెట్టిందంటే అది నీతిమాలిన చర్య కాదా అని అడుగుతున్నాను.
  • ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం.
  • ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి.
  • ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను.
  • నేనేమైనా ఈ కేసీఆర్కి సర్వెంట్నా అని అడుగుతున్నా.
  • మీరు మామీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో నన్ను బెదిరించాలంటే మీ తరం కాదు.
  • మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.
  • మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉంది.
  • మీకు పోలీసులున్నారు, మాకు కూడా పో్లీసులు హైదరాబాద్లోనే ఉన్నారు.
  • మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫాం హౌస్ కు తీసుకెళ్లి, సిగ్గులేకుండా పోలీసు ప్రొటెక్షన్తో పంపినప్పుడు మీకు సిగ్గులేదా
  • శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డీఫెక్షన్ మీకు గుర్తులేదా?
  • 22 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. ఎమ్మెల్సీ నాకో లెక్క కాదు.
  • నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. నీతి ముఖ్యం, సిద్దాంతం ముఖ్యం.
  • హైదరాబాద్లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయడానికి వెళ్తున్నారు.
  • మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, గవర్నర్కు అధికారం ఉంటే మామీద పెత్తనం చేయడానికి మీరెవరని అడుగుతున్నా
  • పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని అడుగుతున్నా
  • ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, గౌరవం లేని మాటలంటారా, అగౌరవ పరుస్తారా? నన్ను కాదు మీరు అగౌరవ పరిచేది.. ఐదుకోట్ల ప్రజలను. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధి లేదా?
  • సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా.
  • టీఆర్ఎస్ పార్టీ పెత్తనంపై నేను ఆధారపడలేదు, వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు.
Posted

highlighted point chala bagundi 

Asalu godava antha aa point pine kani malli siggu lekunda neethi nijayithi ani sollu 10gutunnadu tupel nakka....
rlxuhc_th.jpg
×
×
  • Create New...