Jump to content

Recommended Posts

Posted
ఓటుకు నోటు కేసులో టీఆరెస్, తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు ఎలాంటి సంకేతాలు పంపిస్తోంది…? ఇది కేసీఆర్ కు ప్లస్సా… మైనస్సా… అని విశ్లేషించుకుంటే దీనివల్ల కేసీఆర్ కు, ముఖ్యంగా తెలంగాణకు తీవ్రమైన నష్టం చేసే ప్రమాదం ఉందని అర్థమవుతోంది. మున్ముందు కేసీఆర్ ను రాజకీయంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. అంతేకాదు… ఆయన కూడా ఇలాంటి వ్యవహారాల్లోనే అడ్డంగా దొరికిపోయే ప్రమాదమూ ఉంటుంది.
తెలంగాణకు పెట్టుబడులతో రావాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పిలుస్తోంది టీఆరెస్ ప్రభుత్వం. కానీ, ఒక ముఖ్యమంత్రిపై స్టింగ్ ఆపరేషన్ చేయించేందుకు తెలంగాణ సీఎం తెగబడితే అలాంటి చోటికి పారిశ్రామికవేత్తలు ఎలా రాగలుగుతారు. సీఎం ఆఫీసులో కానీ ఇంకోచోట కానీ అడుగుపెట్టేందుకు వారు సాహసించగలరా….? ఎక్కడ ఏ కెమెరా పెట్టి ఎలా బుక్ చేస్తారో అని భయపడరా..? ఇదే జరుగుతుంది… మున్ముందు కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. ఒకవేళ మొదట్లో బాగా ఉండి ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెడితే… రేపు ఏదైనా తేడా వస్తే అపుడు పగ బడితే ఏంటి పరిస్థితి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సన్నిహితుల కోసం ఏదైనా తేడాగా చేయాల్సి వస్తే రూల్సును వదిలేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు హాయిగా తప్పించుకుంటాయి. మునిగిపోయేది కంపెనీలే. వీటన్నింటినీ ఇపుడు తెలంగాణకు రావాల్సిన కంపెనీలు అంచనా వేసుకునే పరిస్థితి తలెత్తింది ఇపుడు.
రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ పోరుతో పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో, ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడినవారు… కాస్త వ్యక్తిగతంగా మాట్లాడిన  వారయితే ఇప్పటికే ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తెలుగు రాష్ట్రాలకు దూరమయ్యే ప్రమాదముంది. ప్రత్యర్థులపై కక్షతో ఇలాంటి చర్యలకు దిగితే ఇబ్బందే. అంతేకాదు… భవిష్యత్ లో కేసీఆర్ చూపిన బాటలోనే మరింతమంది ప్రయాణించే ప్రమాదమూ ఉంది…. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా కేసీఆర్ పైనే ఈ అస్త్రం ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Posted

brahmilaughing.gifbrahmilaughing.gif

×
×
  • Create New...