Jump to content

Ts Development News: Dedicated Thread

Recommended Posts

Posted

Post all TS development related news here..

keep-calm-and-say-jai-telangana.png

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tom bhayya

    11

  • pythonic

    11

  • ParmQ

    9

  • SeemaLekka

    7

Popular Days

Top Posters In This Topic

Posted

DALAPATHI bro retired aa @3$%

Posted

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ఆంధ్రాపాలకుల కుట్రలు ఇంకా ఆగలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూ ర్, భీమ్‌గల్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో సభల్లో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆంధ్రాపాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ కుట్రలను తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎందరో త్యాగాలతో వచ్చిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిలబెట్టుకునే వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్రమించబోదన్నా రు. ఆర్మూర్-బాల్కొండ మధ్య డ్రైపోర్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇది ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.

-తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలి
-ఆర్మూర్-బాల్కొండల మధ్య డ్రైపోర్టు
-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

అప్పుడు గల్ఫ్‌కు వలసలను నివారించవచ్చని చెప్పారు. బాల్కొండలో మరో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కొన్ని సమస్యలున్నప్పటికీ వాటిని దశల వారీగా పరిష్కరించుకుందామన్నారు. అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలని కోరా రు. 60 ఏండ్ల పరాయి పాలనలో కోల్పోయిన భవిష్యత్‌ను బంగారుమయంగా మలుచుకుందామన్నారు.

-రైళ్ల సంఖ్య పెంచాలని ముంబై టీజేఏసీ వినతి
నిజామాబాద్: రాష్ట్రం నుంచి ముంబైకి వెళ్లే రైళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచి పలుచోట్ల హాల్టింగ్ సౌకర్యం, ప్రత్యేక రిజర్వేషన్ కోటాను బాసర, నిజామాబాద్ నుంచి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ముంబై తెలంగాణ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం రాత్రి నిజామాబాద్‌లో జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ సభకు హాజరైన కవితను సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Posted
పాలమూరులో అమెజాన్ కేంద్రం
Updated : 6/11/2015 2:26:20 AM
Views : 1919
- ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- అమెజాన్‌కు పది రోజుల్నే అనుమతులిచ్చాం
- పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కే తారకరామారావు
- పెట్టుబడులపై ఫలిస్తున్న సర్కారు కృషి
- సంస్థల స్థాపనపై పలు కంపెనీల ప్రకటనలు!
- రాష్ర్టానికి క్యూ కడుతున్న సంస్థలు

హైదరాబాద్, షాద్‌నగర్, నమస్తే తెలంగాణ: అవినీతికి ఆస్కారమే లేకుండా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కే తారకరామరావు చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలోని పీఆండ్‌జీ పరిశ్రమ ఆవరణలో నూతనంగా నెలకొల్పిన అమెజాన్ సంస్థ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని అయన ప్రారంభించారు. అమెజాన్ సంస్థకు కేంద్రం ఏర్పాటుకు పదిరోజుల్లోనే అనుమతులిచ్చామని తెలిపారు. భవిష్యత్తులో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఒకేఒక్క దరఖాస్తుతో అనుమతులు ఇస్తామని చెప్పారు. అమెజాన్ సంస్థ నెలకొల్పిన ఈ కేంద్రంద్వారా సుమారుగా 600 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు.

ktr-books.jpg ఇతర జిల్లాలతో పోలిస్తే పాలమూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అమెజాన్ ఏడువేలకుపైగా ఉత్పత్తులను అన్‌లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నదని చెప్పారు. ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ఏర్పాటుతో రవాణా, ప్యాకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులను కూడా ఈ సంస్థమార్కెట్ చేస్తున్నదని తెలిపారు. సంస్థకు చెందిన డాటా కేంద్రాన్ని కూడా హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పరిశ్రమల ఏర్పాటుతోనే ప్రగతి
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, రాష్ట్ర తలసరి అదాయం పెరగాలన్నా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యమని మంత్రి అన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అంతకు ముందు అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ అఖిల్ సక్సేనా ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎఫ్‌సీ కేంద్రాన్ని ప్రారంభించి, ఉత్పత్తుల ప్యాకింగ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, జేడ్పీ వైస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వీర్లపల్లి శంకర్, ఎమ్మె సత్తయ్య, మంగులాల్‌నాయక్, రాంబాల్‌నాయక్, జగదీశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడుల ఆకర్షణీయ కేంద్రంగా తెలంగాణ
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లోనూ బడా కంపెనీలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చేస్తున్న కృషి ఫలితాలనిస్తున్నది.

భౌగోళిక పరిస్థితులతోపాటు ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక విధానం పెద్దపెద్ద కంపెనీలను ఆకర్షిస్తున్నది. ఆ క్రమంలోనే అమెజాన్ తన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ప్రఖ్యాత సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ అమెరికా బయట హైదరాబాద్‌లో తన అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. డీఈ షా, బోయింగ్, హెచ్‌పీ కంపెనీలు తమ వ్యాపార కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చాయి. మంత్రి హాంగ్‌కాంగ్ పర్యటనలో డీలింక్ కంపెనీ తెలంగాణలో యూనిట్ ఏర్పాటుకు సై అంది.

Posted

gouds.jpg

నర్సంపేట, నమస్తే తెలంగాణ: గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గీత కార్మికులు క్షీరాభిషేకం నిర్వహించారు. గురువారం పట్టణశివారులోని తాటివనంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ నేత కామగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో నాగెల్లి వెంకటనారాయణ, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు నాయిని నర్సయ్య, కౌన్సిలర్ పుల్లూరి సంధ్యస్వామి గౌడ్, నాగెల్లి సారంగం, కొంకీస కుమార్‌గౌడ్, తాళ్లపెల్లి కుమారస్వామి, పుల్లూరి చిన్న రవి, జూలూరి లక్ష్మీనారాయణ, జూలూరి చంద్రయ్య, గండి కిష్టయ్య, జూలూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Posted

Dry port in armoor...
కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ఆంధ్రాపాలకుల కుట్రలు ఇంకా ఆగలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూ ర్, భీమ్‌గల్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో సభల్లో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆంధ్రాపాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ కుట్రలను తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎందరో త్యాగాలతో వచ్చిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిలబెట్టుకునే వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్రమించబోదన్నా రు. ఆర్మూర్-బాల్కొండ మధ్య డ్రైపోర్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇది ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.

-తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలి
-ఆర్మూర్-బాల్కొండల మధ్య డ్రైపోర్టు
-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

అప్పుడు గల్ఫ్‌కు వలసలను నివారించవచ్చని చెప్పారు. బాల్కొండలో మరో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కొన్ని సమస్యలున్నప్పటికీ వాటిని దశల వారీగా పరిష్కరించుకుందామన్నారు. అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలని కోరా రు. 60 ఏండ్ల పరాయి పాలనలో కోల్పోయిన భవిష్యత్‌ను బంగారుమయంగా మలుచుకుందామన్నారు. 

-రైళ్ల సంఖ్య పెంచాలని ముంబై టీజేఏసీ వినతి
నిజామాబాద్: రాష్ట్రం నుంచి ముంబైకి వెళ్లే రైళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచి పలుచోట్ల హాల్టింగ్ సౌకర్యం, ప్రత్యేక రిజర్వేషన్ కోటాను బాసర, నిజామాబాద్ నుంచి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ముంబై తెలంగాణ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం రాత్రి నిజామాబాద్‌లో జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ సభకు హాజరైన కవితను సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Posted
కొత్తగూడెంలో సర్కారు తొలి ఇంగ్లిష్ స్కూల్
Updated : 6/12/2015 2:10:46 AM
Views : 8
emschools.jpg
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని పాతకొత్తగూడెంలో తొలిసారిగా ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను గురువారం ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రారంభించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరిగేలా ఉపాధ్యాయులను కూడా నియమించారు. స్కూల్ కోసం ప్రత్యే క భవనాన్ని నిర్మించనున్నామని, అనుమతి లభించిందని జలగం చెప్పారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ స్కూల్‌లో తొలిరోజే 70 మంది అడ్మిషన్‌లు పొందారు. భవిష్యత్తులో హైస్కూల్‌గా అభివృద్ధి చేయనున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Posted

Dry port in armoor...
కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ఆంధ్రాపాలకుల కుట్రలు ఇంకా ఆగలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూ ర్, భీమ్‌గల్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో సభల్లో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆంధ్రాపాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ కుట్రలను తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎందరో త్యాగాలతో వచ్చిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిలబెట్టుకునే వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్రమించబోదన్నా రు. ఆర్మూర్-బాల్కొండ మధ్య డ్రైపోర్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇది ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.

-తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలి
-ఆర్మూర్-బాల్కొండల మధ్య డ్రైపోర్టు
-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

అప్పుడు గల్ఫ్‌కు వలసలను నివారించవచ్చని చెప్పారు. బాల్కొండలో మరో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కొన్ని సమస్యలున్నప్పటికీ వాటిని దశల వారీగా పరిష్కరించుకుందామన్నారు. అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలని కోరా రు. 60 ఏండ్ల పరాయి పాలనలో కోల్పోయిన భవిష్యత్‌ను బంగారుమయంగా మలుచుకుందామన్నారు. 

-రైళ్ల సంఖ్య పెంచాలని ముంబై టీజేఏసీ వినతి
నిజామాబాద్: రాష్ట్రం నుంచి ముంబైకి వెళ్లే రైళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచి పలుచోట్ల హాల్టింగ్ సౌకర్యం, ప్రత్యేక రిజర్వేషన్ కోటాను బాసర, నిజామాబాద్ నుంచి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ముంబై తెలంగాణ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం రాత్రి నిజామాబాద్‌లో జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ సభకు హాజరైన కవితను సమస్యలు పరిష్కరించాలని కోరారు.

*L({}
 
Posted

https://www.youtube.com/watch?v=QPaS8t1QO_A

Posted
నేను బందూక్‌ని మాట్లాడుతున్నా !
సమాజం బందూక్‌ని ఎన్నోసార్లు చూసింది. రోజూ చూస్తూనే ఉంది. కానీ ఈ సమాజాన్ని బందూక్ చూడాలనుకుంటే ఎలా ఉంటుంది? ఒక బందూక్ తన ఆత్మకథ చెప్పుకుంటే ఇంకెలా ఉంటుంది? అదే బందూక్ సినిమా. ఈనెల 12న విడుదలవుతున్న బందూక్ స్వరాష్ట్రంలో సగర్వంగా మన తెలంగాణోళ్లు తీసిన సినిమా బందూక్... అన్ని విభాగాల్లో మనోళ్లే పనిచేసిన సినిమా . నిరంకుశత్వ సంకెళ్లను తెంచుకోని ఆత్మకథను చెప్పుకోవాలనుకుంటున్న బందూక్ ఇలా జిందగీలో అక్షరమై మీతో మాట్లాడుతోంది.

bhanduk.jpg 9వశతాబ్దంలో వెదురు కర్రలతో తయారైన నేను ప్రపంచ చరిత్రనే మార్చేశా. నేను పుట్టానంటే ఎవరో ఒకరు చావాల్సిందే! భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీతో కలిసి పనిచేయడానికి, గాంధీ చేతుల్లో ఒదిగిపోడానికి ఎంతో ఆరాట పడిన, కానీ ఆయన ఒప్పుకోలేదు. అహింసే నా మార్గమని నాతో చెలిమి నిరాకరించాడు. అదే సమయంలో గాడ్సే చేతుల్లోకి వెళ్లి ఆయన ప్రాణాలే తీశా. నా మీద నాకే అసహ్యం వేసి ఇండియా నుంచి వెళ్లిపోదామనుకున్నా. సరిగ్గా అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం మొదలయింది. నేను తెలంగాణ చేతుల్లోకి వెళ్లాను. పిరికివాళ్లను యోధుల్ని చేశాను. గర్వపడ్డాను. కానీ ముష్కరుల చేతుల్లో ఒదిగి వీరుల గుండెలను తూట్లు చేసినప్పుడు వారి ప్రాణాలు మింగలేక ఎక్కి ఎక్కి ఏడ్చా. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోమంది వీరుల్ని పొట్టన పెట్టుకున్నా. స్వాతంత్రోద్యమంలో నా అవసరం రాలేదు.

కానీ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలోనైనా నా అవసరం వస్తుందేమోనని ఆశించా. కేసీఆర్ నన్ను చేతుల్లోకి తీసుకుని ఉద్యమంలో గర్జిస్తాడనుకున్న. ఆయన అసలు నా వైపే చూడలేదు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించిండు. అంత పెద్ద లక్ష్యాల సాధనలోనే నా అవసరం రాలేదు. ఇక ఇప్పుడు నాతో ఏం ఉపయోగం. కలలు నా అవసరం ఎవరికీ రాదు. ఇక ఉంటా... జై తెలంగాణ, జైజై బంగారు తెలంగాణ - మీ బందూక్!

ఇదీ బందూక్ మనకు చెప్పదలుచుకున్న ఆత్మకథ, ఆవేదన, ఆక్రందన. ఈ బందూక్ ఆత్మకథను సినిమాగా తెరకెక్కించి, పూర్తిస్థాయి మొట్టమొదటి తెలంగాణ సినిమాగా రికార్డు రాసుకున్న వారిని ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాం.

ఒకటవ తూటా..
laxman.jpg నా పేరు లక్ష్మణ్ మురారి. మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం. ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ తల్లి బిడ్డగా, ఈ మట్టి రక్తాన్ని పంచుకుని పుట్టిన నాకు మన చరిత్రను ఎవరూ చెప్పలేని విధంగా, మనుషులతో చెప్పించకూడదన్న ఆలోచనలోంచి పుట్టిందే బందూక్. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదట్లో కొంచెం భయమనిపించింది. ఎందుకంటే అందరం కొత్తవాళ్లమే, నాతో సహా. ఇంతకుముందు సినిమాతో పరిచయం ఉన్నా ఒక సినిమాని భుజాన వేసుకుని చేస్తున్నానంటే నా శక్తికి మించి పనిచేయాలి అనుకున్నా. సినిమా పక్కా తెలంగాణాలా ఉండాలంటే అందరూ మనోళ్లే ఉండాలి. కాబట్టి ఆడిషన్స్ పెట్టాం. హైదరాబాద్‌లోనే కాక, పది జిల్లాలకూ తిరిగాం. ఎంతోమంది మెరికల్లాంటి యువకులు దొరికారు. పారిశ్రామికవేత్త గుజ్జ యుగంధర్ రావు గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు.

ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్, ఎక్కడా బయటి లొకేషన్లకు వెళ్లకుండా అంతా మన తెలంగాణ తల్లి ఒడిలోనే షూట్ చేశాం. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అందరూ కొత్తవాళ్లయినా తెలంగాణ వాళ్లు కాబట్టి కనెక్ట్ అయ్యారు. మన రక్తంలోనే కళ ఉంది కాబట్టి వారి నుంచి ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. సినిమా యూనిట్‌లా కాకుండా తెలంగాణ ఉద్యమకారులుగా ఈ సినిమా తీశాం.

రెండవ తూటా..
yugander-rao.jpg నేను గుజ్జ యుగంధర్ రావు. మాది నల్లగొండ. తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తొలి పూర్తిస్థాయి తెలంగాణ చిత్రానికి నేను నిర్మాతను కావడం నిజంగా నా అదృష్టం. ఒకింత గర్వంగా కూడా ఉంది. జిల్లాల్లో ఆడిషన్స్ పెట్టి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం, షూటింగ్ స్పాట్స్ సెలెక్షన్స్.. ఇలా అన్నీ పనులు డైరెక్టర్‌కే వదిలేయకుండా నేను కూడా తోడుండేవాణ్ణి. మామూలుగా సినిమా నిర్మాత అంటే తెర వెనుకే ఉంటాడనుకుంటారు. కానీ ఈ సినిమాలో నేను కూడా నటించా. డైరెక్టర్ బాబీ సలహాలిస్తూ నాలో నటుణ్ణి పరిచయం చేశాడు. అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో సీనియారిటీ ఉన్న నటులకు తగ్గకుండా చేశారు. తెలంగాణ గురించి ఒక్క పాటలోనే చెప్పాలన్న ఆలోచనే పూసిన పున్నమి పాట. ఈ పాట సక్సెస్ మాకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఒక సినిమాలో పాటకు సక్సెస్ మీట్ పెట్టడం తెలుగు చరిత్రలో ఇప్పటి వరకూ జరగలేదు.

తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశాడన్నది భవిష్యత్ తరాలకు తెలియడం కోసం సుద్దాల గారు ఓ పాట రాశారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. సినిమా చూస్తే బాగానే ఖర్చు పెట్టారు అనుకుంటారు అంతా. కానీ మేం ఈ సినిమా డబ్బుతో కాదు కసితో తీశాం. మేం కూడా సినిమా తీయగలం అని నిరూపించాం. కేసీఆర్ గారు ఆడియో రిలీజ్ చేస్తూ ప్రివ్యూ ఏర్పాటు చేయండి. నేనూ సినిమా చూస్తా అన్నారు.

మూడవ తూటా..
mithun.jpg నా పేరు ఆముదాలపాడు మిథున్ రెడ్డి. మాది పాలమూరు జిల్లా. నేను ఎంపీ జితెందర్ రెడ్డి గారి అబ్బాయిని. ఒక పొలిటికల్ లీడర్, పారిశ్రామికవేత్త కొడుకుగా కాకుండా, ఒక మామూలు వ్యక్తిగా నన్ను నేను అందరికీ పరిచయం చేసుకోవాలనుకుంటాను. ఫ్రాన్స్‌లో ఎంబీఏ చేశాను. ఏదైనా వ్యాపారం చేయొచ్చు. కానీ తెలంగాణ కోసం ఒక పని చేసి, మనం తెలంగాణకు ఏమిచ్చామా అన్న దాని కోసమే నేను ఈ సినిమాలో నటించాను. ఇప్పటి వరకూ చూడని తెలంగాణను నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు చూశాను. బందూక్‌లో నాది యూత్ లీడర్ క్యారెక్టర్. గ్రామాల్లో తిరిగి యూత్‌ని మోటివేట్ చేసే క్యారెక్టర్. అందులో భాగంగా అన్నీ గ్రామాలకు తిరగాల్సి వచ్చింది. అప్పుడు నేను చూసిన గ్రామాలు ఆంధ్ర పాలకుల నిర్లక్ష్య పాలనలో అభివృద్ధికి నోచుకోకపోయినా, కల్లాకపటం ఎరుగని పసిపిల్లల్లా ఎంతో స్వచ్ఛంగా, అందంగా కనిపించాయి. ఒకవేళ ఈ సినిమా చేసి ఉండకపోతే నేను చాలా మిస్సయ్యేవాణ్ణి.

నాల్గవ తూటా:
కార్తీక్: మాది వరంగల్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. నేను ఎంటెక్ చేసి ఇన్ఫోటెక్‌లో జాబ్ చేసేవాణ్ని. సినిమా కోసం జాబ్ మానేశా. బందూక్‌లో టెక్నికల్ వాల్యూస్, క్లాసికల్‌ని కలిపి జానపదాన్ని కొత్తగా పరిచయం చేశాం. ఐదు పేజీల పాటను నాలుగు నిమిషాల్లో చూపించడం కోసం మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

ఐదవ తూటా..
కృష్ణ చైతన్య: మాది కరీంనగర్. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్. అవకాశాల కోసం చాలా తిరిగా. ఇక ైఫ్లెట్ ఎక్కేసి అవుటాఫ్ ఇండియా వెళ్దామనుకుంటున్న టైమ్‌లోనే బందూక్ ఆడిషన్స్ గురించి తెలిసింది. బాబీ గారు వచ్చి చైతన్యా... ఒక రెండు నెలలు గడ్డం తీయకు అని ఛాన్స్ కన్ఫమ్ చేశారు.

ఆరవ తూటా:
రమేష్ మాదాసు: మాది నల్లగొండ జిల్లా. నేను బందూక్‌కి కో డైరెక్టర్‌గా చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్రాణం. ఆ ఆసక్తితోనే 2003లో ఫీల్డ్‌లోకి వచ్చాను. ఐదారు తెలుగు సినిమాల్లో, రెండు బాలీవుడ్ సినిమాల్లో అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను.

మిగిలిన తూటాలు..
అనురూప్: మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండంల మొగుళ్లవంపు. కాలేజ్‌లో నా హైట్ చూసి అందరూ తెలంగాణ మహేశ్‌బాబు అనేవారు. ఓసారి ఎఫ్బీలో డైరెక్టర్ గారిని అన్నా ఏదన్న క్యారెక్టర్ ఉంటే ఇయ్యరాదే అని అడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం లేక రోడ్ల మీద, ఆఫీసుల చుట్టూ ఉద్యోగం కోసం తిరిగే వాళ్లందరినీ ప్రతిబింబించే క్యారెక్టర్ ఇచ్చారు.

సెహరాభాను: జర్నలిస్టుగా కనిపిస్తాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఐబీఎన్‌లో జాబ్ చేసేదాన్ని.

నేను కృష్ణ చైతన్య జోషి: మాది అదిలాబాద్, కామారెడ్డి. నేనొక థియేటర్ ఆర్టిస్టును. దాదాపు 100కు పైగా నాటకాల్లో చేశాను. ఈ సినిమాలో నాది శ్రీకాంతాచారి క్యారెక్టర్. నాకెందుకో అది బాగా కనెక్ట్ అయింది.

దేవా మలిశెట్టి: మాది ఖమ్మం. సినిమాల్లో అవకాశాల తిరిగే క్యారెక్టర్ నాది. నాకు సినిమా అంటే ప్రాణం. అమ్మానాన్నలకు చెప్పకుండానే బందూక్ ఆడిషన్స్‌కి వచ్చా. గుర్తింపు కోసం, అస్తిత్వం కోసం, జరిగిన యుద్ధాన్ని సినిమాగా తీయడం, అందులో నాకు అవకాశం రావడం ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాను.
రాహుల్: మాది సిరిసిల్ల. బందూక్‌కి కెమెరామెన్‌గా చేశాను. ఫొటోగ్రఫీలో బీఎఫ్‌ఏ చేశా. మన తెలంగాణోడు కెమెరా పడితే ఎలా ఉంటదో చూపించడం కోసం పరితపించా.

అజయ్ పులిపాటి: మాది రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి. ఈ సినిమాకు మాటలు, కథా విస్తరణ విభాగంలో పనిచేశాను. బందూక్ పేల్చితే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, మాటలు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలని కష్టపడి రాశాను. తెలంగాణ చరిత్ర తెలుసుకోవడం కోసం గోరేటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, రమేష్ అజారీ, దేశపతి శ్రీనివాస్ లాంటి వారితో చర్చించేవాణ్ణి.

మధు: నేను కొరియోగ్రాఫర్‌ని. బందూక్‌లో లక్ష్మణ్ గారు పరిచయం చేశారు. అంతకు ముందు చిన్న ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేసేవాణ్ణి. ఇప్పుడు ఏకంగా సినిమాలోనే ఛాన్స్ వచ్చింది. ఇది నా అదృష్టం.

Posted

gouds.jpg

నర్సంపేట, నమస్తే తెలంగాణ: గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గీత కార్మికులు క్షీరాభిషేకం నిర్వహించారు. గురువారం పట్టణశివారులోని తాటివనంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్‌ఎస్ నేత కామగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో నాగెల్లి వెంకటనారాయణ, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు నాయిని నర్సయ్య, కౌన్సిలర్ పుల్లూరి సంధ్యస్వామి గౌడ్, నాగెల్లి సారంగం, కొంకీస కుమార్‌గౌడ్, తాళ్లపెల్లి కుమారస్వామి, పుల్లూరి చిన్న రవి, జూలూరి లక్ష్మీనారాయణ, జూలూరి చంద్రయ్య, గండి కిష్టయ్య, జూలూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

adhi milk aa leka inka emainana?

×
×
  • Create New...