Jump to content

Ts Development News: Dedicated Thread


Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tom bhayya

    11

  • pythonic

    11

  • ParmQ

    9

  • SeemaLekka

    7

Popular Days

Top Posters In This Topic

Posted


నేను బందూక్‌ని మాట్లాడుతున్నా !
సమాజం బందూక్‌ని ఎన్నోసార్లు చూసింది. రోజూ చూస్తూనే ఉంది. కానీ ఈ సమాజాన్ని బందూక్ చూడాలనుకుంటే ఎలా ఉంటుంది? ఒక బందూక్ తన ఆత్మకథ చెప్పుకుంటే ఇంకెలా ఉంటుంది? అదే బందూక్ సినిమా. ఈనెల 12న విడుదలవుతున్న బందూక్ స్వరాష్ట్రంలో సగర్వంగా మన తెలంగాణోళ్లు తీసిన సినిమా బందూక్... అన్ని విభాగాల్లో మనోళ్లే పనిచేసిన సినిమా . నిరంకుశత్వ సంకెళ్లను తెంచుకోని ఆత్మకథను చెప్పుకోవాలనుకుంటున్న బందూక్ ఇలా జిందగీలో అక్షరమై మీతో మాట్లాడుతోంది.

bhanduk.jpg9వశతాబ్దంలో వెదురు కర్రలతో తయారైన నేను ప్రపంచ చరిత్రనే మార్చేశా. నేను పుట్టానంటే ఎవరో ఒకరు చావాల్సిందే! భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీతో కలిసి పనిచేయడానికి, గాంధీ చేతుల్లో ఒదిగిపోడానికి ఎంతో ఆరాట పడిన, కానీ ఆయన ఒప్పుకోలేదు. అహింసే నా మార్గమని నాతో చెలిమి నిరాకరించాడు. అదే సమయంలో గాడ్సే చేతుల్లోకి వెళ్లి ఆయన ప్రాణాలే తీశా. నా మీద నాకే అసహ్యం వేసి ఇండియా నుంచి వెళ్లిపోదామనుకున్నా. సరిగ్గా అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం మొదలయింది. నేను తెలంగాణ చేతుల్లోకి వెళ్లాను. పిరికివాళ్లను యోధుల్ని చేశాను. గర్వపడ్డాను. కానీ ముష్కరుల చేతుల్లో ఒదిగి వీరుల గుండెలను తూట్లు చేసినప్పుడు వారి ప్రాణాలు మింగలేక ఎక్కి ఎక్కి ఏడ్చా. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోమంది వీరుల్ని పొట్టన పెట్టుకున్నా. స్వాతంత్రోద్యమంలో నా అవసరం రాలేదు.

కానీ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలోనైనా నా అవసరం వస్తుందేమోనని ఆశించా. కేసీఆర్ నన్ను చేతుల్లోకి తీసుకుని ఉద్యమంలో గర్జిస్తాడనుకున్న. ఆయన అసలు నా వైపే చూడలేదు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించిండు. అంత పెద్ద లక్ష్యాల సాధనలోనే నా అవసరం రాలేదు. ఇక ఇప్పుడు నాతో ఏం ఉపయోగం. కలలు నా అవసరం ఎవరికీ రాదు. ఇక ఉంటా... జై తెలంగాణ, జైజై బంగారు తెలంగాణ - మీ బందూక్!

ఇదీ బందూక్ మనకు చెప్పదలుచుకున్న ఆత్మకథ, ఆవేదన, ఆక్రందన. ఈ బందూక్ ఆత్మకథను సినిమాగా తెరకెక్కించి, పూర్తిస్థాయి మొట్టమొదటి తెలంగాణ సినిమాగా రికార్డు రాసుకున్న వారిని ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాం.

ఒకటవ తూటా..
laxman.jpgనా పేరు లక్ష్మణ్ మురారి. మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం. ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ తల్లి బిడ్డగా, ఈ మట్టి రక్తాన్ని పంచుకుని పుట్టిన నాకు మన చరిత్రను ఎవరూ చెప్పలేని విధంగా, మనుషులతో చెప్పించకూడదన్న ఆలోచనలోంచి పుట్టిందే బందూక్. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదట్లో కొంచెం భయమనిపించింది. ఎందుకంటే అందరం కొత్తవాళ్లమే, నాతో సహా. ఇంతకుముందు సినిమాతో పరిచయం ఉన్నా ఒక సినిమాని భుజాన వేసుకుని చేస్తున్నానంటే నా శక్తికి మించి పనిచేయాలి అనుకున్నా. సినిమా పక్కా తెలంగాణాలా ఉండాలంటే అందరూ మనోళ్లే ఉండాలి. కాబట్టి ఆడిషన్స్ పెట్టాం. హైదరాబాద్‌లోనే కాక, పది జిల్లాలకూ తిరిగాం. ఎంతోమంది మెరికల్లాంటి యువకులు దొరికారు. పారిశ్రామికవేత్త గుజ్జ యుగంధర్ రావు గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు.

ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్, ఎక్కడా బయటి లొకేషన్లకు వెళ్లకుండా అంతా మన తెలంగాణ తల్లి ఒడిలోనే షూట్ చేశాం. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అందరూ కొత్తవాళ్లయినా తెలంగాణ వాళ్లు కాబట్టి కనెక్ట్ అయ్యారు. మన రక్తంలోనే కళ ఉంది కాబట్టి వారి నుంచి ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. సినిమా యూనిట్‌లా కాకుండా తెలంగాణ ఉద్యమకారులుగా ఈ సినిమా తీశాం.

రెండవ తూటా..
yugander-rao.jpgనేను గుజ్జ యుగంధర్ రావు. మాది నల్లగొండ. తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తొలి పూర్తిస్థాయి తెలంగాణ చిత్రానికి నేను నిర్మాతను కావడం నిజంగా నా అదృష్టం. ఒకింత గర్వంగా కూడా ఉంది. జిల్లాల్లో ఆడిషన్స్ పెట్టి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం, షూటింగ్ స్పాట్స్ సెలెక్షన్స్.. ఇలా అన్నీ పనులు డైరెక్టర్‌కే వదిలేయకుండా నేను కూడా తోడుండేవాణ్ణి. మామూలుగా సినిమా నిర్మాత అంటే తెర వెనుకే ఉంటాడనుకుంటారు. కానీ ఈ సినిమాలో నేను కూడా నటించా. డైరెక్టర్ బాబీ సలహాలిస్తూ నాలో నటుణ్ణి పరిచయం చేశాడు. అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో సీనియారిటీ ఉన్న నటులకు తగ్గకుండా చేశారు. తెలంగాణ గురించి ఒక్క పాటలోనే చెప్పాలన్న ఆలోచనే పూసిన పున్నమి పాట. ఈ పాట సక్సెస్ మాకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఒక సినిమాలో పాటకు సక్సెస్ మీట్ పెట్టడం తెలుగు చరిత్రలో ఇప్పటి వరకూ జరగలేదు.

తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశాడన్నది భవిష్యత్ తరాలకు తెలియడం కోసం సుద్దాల గారు ఓ పాట రాశారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. సినిమా చూస్తే బాగానే ఖర్చు పెట్టారు అనుకుంటారు అంతా. కానీ మేం ఈ సినిమా డబ్బుతో కాదు కసితో తీశాం. మేం కూడా సినిమా తీయగలం అని నిరూపించాం. కేసీఆర్ గారు ఆడియో రిలీజ్ చేస్తూ ప్రివ్యూ ఏర్పాటు చేయండి. నేనూ సినిమా చూస్తా అన్నారు.

మూడవ తూటా..
mithun.jpgనా పేరు ఆముదాలపాడు మిథున్ రెడ్డి. మాది పాలమూరు జిల్లా. నేను ఎంపీ జితెందర్ రెడ్డి గారి అబ్బాయిని. ఒక పొలిటికల్ లీడర్, పారిశ్రామికవేత్త కొడుకుగా కాకుండా, ఒక మామూలు వ్యక్తిగా నన్ను నేను అందరికీ పరిచయం చేసుకోవాలనుకుంటాను. ఫ్రాన్స్‌లో ఎంబీఏ చేశాను. ఏదైనా వ్యాపారం చేయొచ్చు. కానీ తెలంగాణ కోసం ఒక పని చేసి, మనం తెలంగాణకు ఏమిచ్చామా అన్న దాని కోసమే నేను ఈ సినిమాలో నటించాను. ఇప్పటి వరకూ చూడని తెలంగాణను నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు చూశాను. బందూక్‌లో నాది యూత్ లీడర్ క్యారెక్టర్. గ్రామాల్లో తిరిగి యూత్‌ని మోటివేట్ చేసే క్యారెక్టర్. అందులో భాగంగా అన్నీ గ్రామాలకు తిరగాల్సి వచ్చింది. అప్పుడు నేను చూసిన గ్రామాలు ఆంధ్ర పాలకుల నిర్లక్ష్య పాలనలో అభివృద్ధికి నోచుకోకపోయినా, కల్లాకపటం ఎరుగని పసిపిల్లల్లా ఎంతో స్వచ్ఛంగా, అందంగా కనిపించాయి. ఒకవేళ ఈ సినిమా చేసి ఉండకపోతే నేను చాలా మిస్సయ్యేవాణ్ణి.

నాల్గవ తూటా:
కార్తీక్: మాది వరంగల్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. నేను ఎంటెక్ చేసి ఇన్ఫోటెక్‌లో జాబ్ చేసేవాణ్ని. సినిమా కోసం జాబ్ మానేశా. బందూక్‌లో టెక్నికల్ వాల్యూస్, క్లాసికల్‌ని కలిపి జానపదాన్ని కొత్తగా పరిచయం చేశాం. ఐదు పేజీల పాటను నాలుగు నిమిషాల్లో చూపించడం కోసం మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

ఐదవ తూటా..
కృష్ణ చైతన్య: మాది కరీంనగర్. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్. అవకాశాల కోసం చాలా తిరిగా. ఇక ైఫ్లెట్ ఎక్కేసి అవుటాఫ్ ఇండియా వెళ్దామనుకుంటున్న టైమ్‌లోనే బందూక్ ఆడిషన్స్ గురించి తెలిసింది. బాబీ గారు వచ్చి చైతన్యా... ఒక రెండు నెలలు గడ్డం తీయకు అని ఛాన్స్ కన్ఫమ్ చేశారు.

ఆరవ తూటా:
రమేష్ మాదాసు: మాది నల్లగొండ జిల్లా. నేను బందూక్‌కి కో డైరెక్టర్‌గా చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్రాణం. ఆ ఆసక్తితోనే 2003లో ఫీల్డ్‌లోకి వచ్చాను. ఐదారు తెలుగు సినిమాల్లో, రెండు బాలీవుడ్ సినిమాల్లో అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను.

మిగిలిన తూటాలు..
అనురూప్: మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండంల మొగుళ్లవంపు. కాలేజ్‌లో నా హైట్ చూసి అందరూ తెలంగాణ మహేశ్‌బాబు అనేవారు. ఓసారి ఎఫ్బీలో డైరెక్టర్ గారిని అన్నా ఏదన్న క్యారెక్టర్ ఉంటే ఇయ్యరాదే అని అడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం లేక రోడ్ల మీద, ఆఫీసుల చుట్టూ ఉద్యోగం కోసం తిరిగే వాళ్లందరినీ ప్రతిబింబించే క్యారెక్టర్ ఇచ్చారు.

సెహరాభాను: జర్నలిస్టుగా కనిపిస్తాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఐబీఎన్‌లో జాబ్ చేసేదాన్ని.

నేను కృష్ణ చైతన్య జోషి: మాది అదిలాబాద్, కామారెడ్డి. నేనొక థియేటర్ ఆర్టిస్టును. దాదాపు 100కు పైగా నాటకాల్లో చేశాను. ఈ సినిమాలో నాది శ్రీకాంతాచారి క్యారెక్టర్. నాకెందుకో అది బాగా కనెక్ట్ అయింది.

దేవా మలిశెట్టి: మాది ఖమ్మం. సినిమాల్లో అవకాశాల తిరిగే క్యారెక్టర్ నాది. నాకు సినిమా అంటే ప్రాణం. అమ్మానాన్నలకు చెప్పకుండానే బందూక్ ఆడిషన్స్‌కి వచ్చా. గుర్తింపు కోసం, అస్తిత్వం కోసం, జరిగిన యుద్ధాన్ని సినిమాగా తీయడం, అందులో నాకు అవకాశం రావడం ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాను.
రాహుల్: మాది సిరిసిల్ల. బందూక్‌కి కెమెరామెన్‌గా చేశాను. ఫొటోగ్రఫీలో బీఎఫ్‌ఏ చేశా. మన తెలంగాణోడు కెమెరా పడితే ఎలా ఉంటదో చూపించడం కోసం పరితపించా.

అజయ్ పులిపాటి: మాది రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి. ఈ సినిమాకు మాటలు, కథా విస్తరణ విభాగంలో పనిచేశాను. బందూక్ పేల్చితే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, మాటలు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలని కష్టపడి రాశాను. తెలంగాణ చరిత్ర తెలుసుకోవడం కోసం గోరేటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, రమేష్ అజారీ, దేశపతి శ్రీనివాస్ లాంటి వారితో చర్చించేవాణ్ణి.

మధు: నేను కొరియోగ్రాఫర్‌ని. బందూక్‌లో లక్ష్మణ్ గారు పరిచయం చేశారు. అంతకు ముందు చిన్న ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేసేవాణ్ణి. ఇప్పుడు ఏకంగా సినిమాలోనే ఛాన్స్ వచ్చింది. ఇది నా అదృష్టం.


Ba what's happening here
Posted

comedy thread undi kadha , okka TG candidate post veyalee , andharu AP vallu vochi post lu vesi pothunaru. 

 

Aina AP nundi intha mandi NT paper saduvutharaa , neenu eppudu sadavaleee aa paper.

Posted

Ba what's happening here

 

ఈనెల 12న విడుదలవుతున్న బందూక్ స్వరాష్ట్రంలో సగర్వంగా మన తెలంగాణోళ్లు తీసిన సినిమా బందూక్... అన్ని విభాగాల్లో మనోళ్లే పనిచేసిన సినిమా . నిరంకుశత్వ సంకెళ్లను తెంచుకోని ఆత్మకథను చెప్పుకోవాలనుకుంటున్న బందూక్ ఇలా జిందగీలో అక్షరమై మీతో మాట్లాడుతోంది.
 

Posted

comedy thread undi kadha , okka TG candidate post veyalee , andharu AP vallu vochi post lu vesi pothunaru. 

 

Aina AP nundi intha mandi NT paper saduvutharaa , neenu eppudu sadavaleee aa paper.

 

https://www.youtube.com/watch?v=TMbsfFQqi8w

Posted

comedy thread undi kadha , okka TG candidate post veyalee , andharu AP vallu vochi post lu vesi pothunaru. 

 

Aina AP nundi intha mandi NT paper saduvutharaa , neenu eppudu sadavaleee aa paper.

 

AP lo PPT's thappa developments levu so TS development following antha..
 

Posted

LOL 

 

 

AP lo PPT's thappa developments levu so TS development following antha..
 

 

Posted

ignore ignore 

https://www.youtube.com/watch?v=TMbsfFQqi8w

 

Posted

comedy thread undi kadha , okka TG candidate post veyalee , andharu AP vallu vochi post lu vesi pothunaru. 

 

Aina AP nundi intha mandi NT paper saduvutharaa , neenu eppudu sadavaleee aa paper.

enthaki needhi AP or TG uncle..nenu alex uncle link loki velli chusthe first post ekkada vesa...enthaki NT kuda KCR dhi ena :)

Posted

neenu puttindhi aithy bezawada , maa relative andharu akkade untaru. Valasa vacham TG ki. So neenu akkada untaa , ikkada untaa

 

 

enthaki needhi AP or TG uncle..nenu alex uncle link chesthe first post ekkada vesa...enthaki NT kuda KCR dhi ena :)

 

×
×
  • Create New...