LordOfMud Posted June 13, 2015 Report Posted June 13, 2015 ఐస్‌బకెట్ చాలెంజ్ చూశాం, రైస్‌బకెట్ చాలెంజ్ గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు బెల్లీ బటన్ చాలెంజ్ మీ ముందుకొచ్చింది. ఈ చాలెంజ్ ప్రస్తుతం నెట్లో స్వైరవిహారం చేస్తోంది. ఫిట్‌నె్‌సపై అవగాహన కల్పించడం కోసం ఈ చాలెంజ్ మొదలయింది. ఈ చాలెంజ్‌లో చేయాల్సిందేమిటంటే చేతిని వీపు వెనకాల నుంచి తీసుకుని బొడ్డును టచ్ చేయాలి. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా కొంచెం పొట్ట ఉన్నా చేయడం కష్టమే. మీరు ఫిట్‌గా ఉన్నారా లేదా అనే విషయం తేలిపోతుంది. చైనాకు చెందిన వైబో వెబ్సైట్ దీన్ని ప్రారంభించింది. మరి మీరు ఫిట్‌గా ఉన్నారో తెలుసుకోవాలంటే బెల్లీ బటన్ చాలెంజ్ రెడీ అయిపోండి. https://www.youtube.com/watch?v=459vFAJXBRo
Recommended Posts