Jump to content

Aus Lo Ticket $40 Anta But....


Recommended Posts

Posted
1434334399-111.jpg

బాహుబలి చిత్రం రావడానికి ఇంకా నాలుగు వారాల వరకు టైమ్‌ ఉంది. జులై 10న వస్తుందా రాదా అనే దానిపై ఇంకా అనుమానాలున్నాయి. అయితే అప్పుడే ఈ చిత్రం ప్రీమియర్‌ షోస్‌కి టికెట్లు అమ్మేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ప్రీమియర్‌ టికెట్‌ ధర నలభై డాలర్లు పెట్టినా కానీ లెక్క చేయకుండా కొనేస్తున్నారు. ప్రీమియర్‌ షోస్‌ టికెట్స్‌ అన్నీ అప్పుడే బుక్‌ అయిపోయాయి. సినిమా వస్తుందా రాదా అనేది బయ్యర్లకీ, ప్రేక్షకులకీ తెలీదు. కానీ అనుకున్న టైమ్‌కి వచ్చేస్తే ముందుగా చూసేయాలని మాత్రం టికెట్లు బుక్‌ చేసేస్తున్నారు.

ఈ మేనియా చూసి యుఎస్‌లో కూడా ఈ చిత్రానికి ఇప్పట్నుంచే థియేటర్లు బుక్‌ చేసి పడేస్తున్నారు. ఎప్పుడూ ప్రీమియర్‌ వేయని ఏరియాల్లో కూడా థియేటర్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి యుఎస్‌లో మూడు మిలియన్‌ డాలర్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇంతవరకు ఒక్క తెలుగు సినిమాకి కూడా రెండు మిలియన్‌ డాలర్లు కూడా రాలేదు. కానీ దీనికి మూడు మిలియన్లు వస్తాయనే అంచనా వేస్తున్నారంటే క్రేజ్‌ ఎలాగుందో అర్థం చేసుకోండిక.
×
×
  • Create New...