Jump to content

Recommended Posts

Posted

ట్యాపింగ్‌పై ఏపీ మంత్రులు గొంతు పెంచుతుండటం... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోయేంత ఆధారాలున్నాయని హెచ్చరిస్తుండటంతో టీ-సర్కారు అప్రమత్తమైంది. ‘ట్యాపింగ్‌ జరగనే జరగలేదు’ అని ఇన్నాళ్లుగా చెబుతున్న నేతలు హఠాత్తుగా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారించారు. ‘ఏం జరిగింది? ఏం జరుగుతోంది? విషయం తెలుసుకోండి’ అని హోం శాఖ కార్యదర్శి బి.వెంకటేశాన్ని టీ-సర్కారు ఆదేశించింది. దీంతో మంగళవారం ఆయన ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్లతో సమావేశమైనట్లు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమకు కొంత సమాచారం కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం సర్వీస్‌ ప్రొవైడర్లకు గురువారం నోటీసులు జారీ చేయటానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీ-అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాచారాన్నీ బయటికి ఇవ్వొద్దంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీనిపై టెలికాం ఆపరేటర్లకు వెంకటేశం స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన నేతలు, ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారమేదీ బయటికి ఇవ్వొద్దని ఆయన వారిని ఆదేశించారు. అంతేకాదు! కొందరు వ్యక్తుల కాల్‌ డేటాకు సంబంధించి తెలంగాణ పోలీసుల వైపు నుంచి అందిన లేఖలను, సంబంధిత డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చివేయాలని కోరినట్లు తెలిసింది. ఒక్క సర్వీసు ప్రొవైడర్‌ మాత్రమే తమకు అందిన లేఖలను వెనక్కి ఇచ్చారని... మరో ప్రధాన ఆపరేటర్‌ ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.

 
నెక్ట్స్‌ ఎవరు?

టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వేం నరేందర్‌ రెడ్డి ‘తొలి దశ’ విచారణ ముగిసింది! నిందితుల నుంచి ఫోన్లు వచ్చినట్లుగా భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వంతు శుక్రవారం రానుంది! ఈ నేపథ్యంలో... ‘తదుపరి ఎవరు?’ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు జవాబుగా... టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌, గరికపాటి రామ్మోహన్‌రావుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి తెలంగాణ ఏసీబీ నుంచి ఏ క్షణమైనా నోటీసులు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ... రేవంత్‌ కేసుతో సంబంధముందని భావిస్తున్న మరికొందరికీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ భావిస్తోంది. వీరిలో కొందరిని అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆ తర్వాత... ఈ కేసులో ప్రధాన సాక్షి, ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్‌ ఇచ్చిన వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, విచారణలో మిగతా వారు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏపీ సీఎం చంద్రబాబుకు కోర్టు ద్వారానే నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.


 
సీఎంతో పోలీస్‌ పెద్దల భేటీ....

టీ-సీఎం కేసీఆర్‌తో డీజీపీ అనురాగ్‌ శర్మ, ఏసీబీ డీజీ ఖాన్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్‌ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. రేవంత్‌ కేసులో దర్యాప్తు, నోటీసుల పర్వం తదుపరి చర్యల గురించి వివరించారు. ఖాన్‌ కూడా రెండుసార్లు సీఎంతో భేటీ అయ్యారు.

Posted

abbabbaevvaru thaggatam ledhu gaa creativity lo PK-1.gif

 

baa..        ee taadu lo peacemaker petrol putting   PK-1.gif

×
×
  • Create New...