Jump to content

Recommended Posts

Posted

                                                                             images.jpg


నటీనటులు: సుదీర్ బాబు కి చాలా మంచి క్యారెక్టర్ దక్కింది, అతని నటన కూడా చాలా బాగుంది, కార్ లో హీరోయిన్ ని గుర్తుతెచ్చుకుని బాధపడే సన్నివేశం,మరియు క్లైమాక్స్ లో అతని నటన ఇంప్రెస్ చేస్తుంది. నందిత ది  హీరో తో సమానంగా నడిచే క్యారెక్టర్ అయినా  అంతగా  స్కోప్ లేదు, ఉన్నంతలో తన ఉనికిని చాటుకుంది.
పోసాని,అభిజీత్ తమ పాత్రలకి సరిపోయారు. ప్రగతి ,ఇతర నటీనటులు ఒకే.


కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మనసులో ప్రేమ ఉన్నా పరిస్థితుల వల్ల చివరివరకు ఒకరి ప్రేమ ఒకరికి చెప్పలేని చిన్ననాటి ప్రేమజంట కధ. దర్శకుడు చంద్రు లో ని టాలెంట్  ఇంటర్వెల్ ,క్లైమాక్స్ ని డీల్ చేసిన విధానంలో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే హీరోతో సహా అందరు నటీనటుల నుండి మంచి నటనను కూడా రాబట్టుకున్నాడు. అవడానికి ప్రేమకధే అయినా , హీరో క్యారెక్టర్ కే  ఎక్కువ స్కోప్ ఉంది, మొదటి నుండి చివరివరకు అతని పాత్ర తాలూకు ఎమోషన్స్  మీదనే దర్శకుడు ద్రుష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు ఎందుకో మరి ,ఆమె హీరోని ప్రేమిస్తుంది అన్నది కూడా చిన్న చిన్న హింట్స్ ద్వారా మాత్రమే గుర్తించేలా ఉంది ఆ పాత్ర చిత్రణ.  అలా కాకుండా ఆమె వైపు నుండి కూడా కొంత కధ నడిపి ఉంటే  బాగుండేది. అలాగే కధ  ముందుకు నడవడం కోసం పాటలు,ఫైట్స్ కాస్త అవసరానికి మించే పెట్టుకున్నాడు దర్శకుడు,హీరోయిన్ ని హీరో ఎంతలా  ప్రేమిస్తున్నాడు అనేందుకు ఉదాహరణగా ఫైట్స్ ఉపయోగపడ్డాయి కానీ పాటలు మాత్రం కధనానికి అడ్డయ్యాయి అనే చెప్పాలి ఫస్టాఫ్ లో  . కమర్షియల్ ఎలెమెంట్స్  కోసం ప్రయత్నించకుండా ఆ పాటలకు బదులు అవసరమైన ఫీల్ ని అందించే సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటె ఈ ప్రేమకధ మరిన్ని మార్కులు కొట్టేసేది.


డైలాగ్స్ పరవాలేదు, ముఖ్యమైన సన్నివేశాల్లో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటె బాగుండేది.క్లైమాక్స్ లో  మటుకు బాగా వర్కౌట్ అయ్యాయి.  హరి గౌర సంగీతంలో "రాదే", "ఓల ఓల " పాటలు బాగున్నాయి,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఒకే.



రేటింగ్: 6/10


చివరిగా: "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఈ  జానర్ నచ్చే ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. 
 
 
×
×
  • Create New...