Jump to content

Recommended Posts

Posted
మద్యం మత్తులో వాహనాన్ని నడిపితే రూ. 10 వేలు జరిమానా...

 

ఇటీవల దేశ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మద్యం మత్తులో వాహనం నడిపే వారికి విధించే శిక్షలను కేంద్ర ప్రభుత్వం కఠినంతరం చేయదలచింది. ఆ ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారికి విధించే జరిమానా మొత్తాన్ని ఐదంతలు పెంచే విధంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు భద్రతా శాఖ నిర్ణయించింది.
ఈ కొత్త చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లైతే మొట్ట మొదటి సారిగా పది వేల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారికి ఏడాది కాలం జైలు శిక్షను విధించవచ్చును. దేశంలో ఏడాది అంతటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు ముఖ్య కారణంగా మద్యం సేవించి వాహనాలను నడపటం, ట్రాఫిక్ విధులను ఉల్లంఘించడమేనని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లైతే తొలిసారిగా రూ. 2000 ఫైన్ లేక ఆరు నెలల జైలు శిక్ష అనుభవించే చట్టం అమలులో ఉంది. అయితే తద్వారా నేరస్తులు సులభంగా తప్పించుకుంటుండడంతో ఈ నిబంధనలను కఠినంతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రకారం చట్టంలో మార్పులు తేవాలని, అందుకు తగిన అభిప్రాయాలను తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
ఈ కొత్త చట్టం ప్రకారం తొలిసారిగా మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లైతే, వారికి పది వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా బీమా చేయని వాహనాలకు విధించే జరిమానా కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయకుండా వాహనాన్ని నడిపినా కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ ప్రకారం ఒక్కో వాహనానికి కనీసం రూ. 2000 నుంచి ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుందని సమాచారం.
Posted

mundu mahdyam nishedinchandi adey solution

 

govt kulipoddhi :giggle:

Posted

mundu mahdyam nishedinchandi adey solution

Which is not possible in our state man
Posted

mundu mahdyam nishedinchandi adey solution

rape case lo ammaini blame chesinattu vundi idi....ali+venu+madhav+gif+%25282%2529.gif
×
×
  • Create New...