Jump to content

Recommended Posts

Posted

As a character artist

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా నాగార్జున రెడీగానే వున్నాడు కానీ అతడిని అలాంటి పాత్రల కోసం సంప్రదించడానికి జంకుతున్నారు నిర్మాతలు. తన క్యారెక్టర్‌ ఏదైనా కానీ రెగ్యులర్‌గా ఎంత పారితోషికం తీసుకుంటాడో అంతే ఛార్జ్‌ చేస్తున్నాడు వెంకటేష్‌. అదే రీతిన నాగార్జున కూడా కాల్షీట్లు, క్యారెక్టర్‌తో పని లేకుండా తనకి హీరోగా అయితే ఎంతిస్తారో అంతే ఇమ్మంటున్నాడట.

ఒక క్యారెక్టర్‌ కోసం అయిదారు కోట్లు వెచ్చించే ధైర్యం చేయలేక నాగ్‌ జోలికి ఎవరూ వెళ్లడం లేదు. మునుపటి మీద సినిమాలు బాగా తగ్గించేసిన నాగార్జున చాలా సెలక్టివ్‌గా ప్రాజెక్టులు ఓకే చేస్తున్నాడు. నాగార్జునని అడుగుదామని అనుకున్న పాత్రలకి కూడా ఈమధ్య జగపతిబాబుని తీసుకున్నారట. నాగార్జున వుంటే సినిమాకి క్రేజ్‌ పెరుగుతుందనే మాట నిజమే అయినా పారితోషికం పరంగానే రిస్కు తీసుకోలేక వెనక్కి తగ్గారట. క్యారెక్టర్‌ రోల్స్‌ కోసం నాగార్జున తన పే చెక్‌ ఏమైనా తగ్గించుకుంటే కింగ్‌ని ఎక్కువ సినిమాల్లో చూసే వీలుంటుంది.

×
×
  • Create New...