Jump to content

Recommended Posts

Posted

సినిమా రివ్యూ: టైగర్‌
రేటింగ్‌: 3.25/5



రొటీన్‌ సినిమాలే చేస్తున్నావేంటని అడిగిన ప్రతిసారీ 'టైగర్‌' మీకు ఆన్సర్‌ ఇస్తుందని అంటుండేవాడు సందీప్‌ కిషన్‌. చూడ్డానికి ఏదో మాస్‌ సినిమాలా అనిపిస్తున్న టైగర్‌లో అంత స్పెషాలిటీ ఏముందో సినిమా చూస్తే కానీ తెలీలేదు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ సగటు తెలుగు హీరో చేసే క్యారెక్టర్‌ చేయలేదు. తనకంటూ హీరోయిన్‌ లేకుండా, డ్యూయట్‌ లేకుండా, కనీసం ఐటెమ్‌ సాంగ్‌ కూడా లేకుండా ఒక విధమైన ప్రయోగమే చేశాడు. కాకపోతే మాస్‌ని ఆకట్టుకునే లక్షణాలున్న పాత్రని ఎంచుకుని యాక్షన్‌ హీరోగా ఇంప్రెస్‌ చేయడానికి చూశాడు. అతనికి రాహుల్‌ రవీంద్రన్‌ సపోర్టింగ్‌ రోల్‌ చేశాడు. ఇద్దరూ తమ పాత్రలకి బాగా సూట్‌ కావడంతో ప్రధానంగా ఇద్దరు స్నేహితుల కథ అయిన 'టైగర్‌' రక్తి కట్టింది.

కథ:

Posted

నటీనటులు:

సందీప్‌ కిషన్‌ చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అతను ఈ పాత్రని అంతగా ఎందుకు ఇష్టపడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుంది. చక్కని నటనతో ఈ చిత్రానికి తనే సారథి అయ్యాడు. రాహుల్‌ రవీంద్రన్‌ పాత్రకి తగ్గట్టుగా వున్నాడు. బాగా నటించాడు కూడా. సీరత్‌ కపూర్‌ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. హీరోయిన్‌ తండ్రి, తాతగా తెలిసిన నటుల్ని పెట్టాల్సింది. వారిద్దరూ ఆ పాత్రలకి తగ్గ గాంభీర్యం, అహంకారం ప్రదర్శించలేకపోయారు. సప్తగిరి కామెడీ ద్వందార్థాలతో సాగింది. తాగుబోతు రమేష్‌ రోలింగ్‌ టైటిల్స్‌ సీన్‌ బాగుంది.

సాంకేతికవర్గం:

విఐ ఆనంద్‌ దర్శకుడిగా మార్కులు కొట్టేస్తాడు. ఒక సాధారణ కథతో అతను ఆకట్టుకునే సినిమా తీయగలిగాడు. సినిమాలో కొంత భాగం రొటీన్‌గా వున్నా కానీ ఎక్కడా పట్టు సడలకుండా నడిపించాడు. తమన్‌ సంగీతం బాగుంది. బిజిఎంతో అతను ఈ చిత్రానికి ఊపిరి పోసాడు. చోటా కె నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఈ చిత్రాన్ని దర్శకుడి కంటే చోటానే గొప్పగా విజువలైజ్‌ చేసాడా అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాతలకి మంచి అభిరుచి వుంది. డైలాగ్స్‌ బాగున్నాయి.

చివరిగా...

'టైగర్‌' చిత్రం ఒక్కసారి చూడ్డానికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు. సరదాగా సాగిపోతూ కమర్షియల్‌ విలువలతో పాటు ఆకట్టుకునే కథనంతో అలరిస్తుంది. ముఖ్యంగా సందీప్‌ కిషన్‌కి పేరు తెచ్చే చిత్రమవుతుంది.

Posted

malla eedu hit kotta da ? kishan gaadu 

 

gud chinna cinemala tho hits koduhtundu 

×
×
  • Create New...