sampangi Posted June 30, 2015 Report Posted June 30, 2015 సిద్ధం… ఆయుధాలు రెడీ… ప్లాన్ పట్టాలెక్కేసింది… ఉరిమే ఉత్సాహం… తరిమే ప్రతీకారం… ఇంతకీ… బాహుబలి ఎవరు ? చంద్రబాబా ? కేసీఆరా ? రెండు రాష్ట్రాల మధ్యా వార్ సీన్. అన్నీ ఉన్నాయ్ కానీ అసలుండాల్సిందేదో మిస్ అయ్యింది. అందుకే యుద్ధ మేఘాలు దూదిపింజల్లా తేలిపోతున్నాయ్. చివరి నిమిషంలో మెరుపు, ఉరుములు సెలవు తీసుకున్నాయ్. ఎందుకిలా ? అసలేమైంది ? రేవంత్ వ్యవహారంలో ఏపీపై కాలుదువ్విన కేసీఆర్ వెనక్కి ఎందుకు తగ్గారు ? గెలిచేందుకైతేనే సిద్ధపడు… పోయేదేముందనుకుంటే తిరగబడు… అవకాశం లేదనుకుంటే ఇక రాజీపడు..! మూడు ముక్కల్లో ఇదీ యుద్ధనీతి. తుగ్లక్ అయినా… హిట్లర్ అయినా… ఆఖరికి కేసీఆర్ అయినా ఇలాంటి లెక్కేసుకున్నాకే బరిలో దిగుతారు. అయితే ప్రత్యర్థి బలవంతుడైతే మాత్రం కథ అడ్డం తిరిగిపోతుంది. చరిత్రలో… చిన్నాచితక రాజ్యాల్ని చూసి తుగ్లక్ గెలిచేందుకు సిద్ధపడేవాడు. నా ఇగో కన్నా ఎక్కువేం కాదంటూ హిట్లర్ తిరగబడడం ప్రపంచానికి తెలుసు. ఇపుడు కేసీఆర్ మూడో మార్గంలో ముందుకు వెళ్తున్నారు. ఆ అడుగులు, ఆ అలికిడి కనిపిస్తున్నాయ్. ఇంతకీ యుద్ధం ఎక్కడ మొదలై ఎటు మళ్లింది ? స్టేజ్ 1 : గెలుస్తామనే ధీమా ఉంటేనే బరిలోదిగాలి. దందయాత్ర చేయాలి. యుద్ధంలో ప్రాధమిక సూత్రమిది. కేసీఆర్ ఈ నమ్మకంతోనే చెలరేగిపోయారు కెమెరాలతో కాపుకాసి…రౌండప్ చేసి రాజకీయం పండించాలనుకున్నారు. ఇరికించాలని ప్లాన్ చేయడం… కెమెరాలతో పక్కా ఫ్రేమ్ చేయడం ఫస్ట్ స్టేజ్. ఓ గంటలో మీరో సంచలన వార్త వింటారు అన్న మాటలోనే వినిపిచింది ధీమా. వ్యూహం ప్రకారం ఇరికించి… ఆడియో, వీడియోలు దశల వారీగా రిలీజ్ చేయడం… బ్రహ్మదేవుడు కూడా నిన్ను కాపాడలేదన్న డైలాగులు ఇవన్నీ మొదటి దశ. అంటే గెలుస్తామన్న విశ్వాసం విర్రవీగేంత వరకూ వెళ్లిందిక్కడ. స్టేజ్ 2: ఓ దెబ్బ కొట్టడం కన్నా నాలుగు దెబ్బలు తిని తట్టుకోవడం గెలిచే వీరుడి లక్షణం. ఇది షావోలిన్ బేసిక్ లా. యుద్ధానికి ఎదుటి వాడు కాలుదువ్వితే ఎదుర్కోవడానికి సిద్ధపడడమే ఈ స్టేజ్ 2. కేసు మొదలయ్యాక మొదటి నాలుగైదు రోజులు నడిచింది ఇది. ఏం చేయాలి.. ఎలా ఎదుర్కోవాలి… అసలు ఏం జరిగింది అని చేయీకాలూ కూడదిసూకునే సరికి ఇంత సమయం పట్టింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. స్టేజ్ 3: హోరాహోరీ. ఈ దశలో సంచలనాలుంటాయ్. ఎందుకంటే దాడి మొదలుపెట్టినవాడి దగ్గర ఆయుధాలు ఎక్కువ. ముందు నుంచే సిద్ధపడ్డాడు కాబట్టి… ఊపు కూడా ఎక్కువే. అందుకే సర్ ప్రైజ్ లూ ఉంటాయ్. అటు నుంచి ఎదుటి పక్షం ఫైట్ బ్యాక్ ఘాటుగా ఉంటే.. యమ రంజుగా ఉంటుంది సీన్. ఓ సీఎం ఢిల్లీ వెళ్లినపుడు… మరో సీఎం ఇక్కడ కేబినెట్ మీటింగ్ పెట్టి ఎదురుదాడి చేసినప్పుడు ఇదే మజా కనిపించింది. వార్ లో ఇది కీలక దశ. ఇక్కడ వరకూ బాగానే ఉంటుంది. ఇంతకు మించి అడుగు ముందుకు పడితే కాళ్లు ఒణికడం ఖాయం. స్టేజ్ 4: కాళ్లల్లో ఒణుకు… ఆలోచనల్లో అంతర్మథనం కలిసి కనిపిస్తాయ్ ఈ దశలో. ఎందుకని ? ఊపంతా ఏమైపోయింది ? ప్రత్యర్థి ఊహించని ఆయుధాలు ప్రయోగిస్తే… కొత్త తరహాలో ఎత్తుగడకి సిద్ధపడితే ఓడిపోతామన్న భయం కుంగదీసేస్తుంది. ఆ వెంటనే పరిస్థితి లొంగదీస్తుంది. పర్షియా సైన్యం మృత్యుకెరటంలా విరుచుకుపడినపుడు గ్రీస్ ఇలాగే ఎదుర్కొంది. ప్రత్యర్థి ఊహించని కొత్త ఎత్తుగడతో యుద్ధనౌకల్ని నడి మధ్యలో చీల్చి చెండాడింది. వెంటనే ప్రత్యర్థికి వెనక్కి తగ్గడం తప్ప మరో గత్యంతరం ఉండదు. కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే చేస్తున్నారిప్పుడు. వీడియోలతోసహా పట్టేస్తాం అంటూ ఉల్లిపాయ ఎరవేసి గురిచూసి కొట్టారు. సరే. మరి ఆ ఎర ఎటు నుంచి వచ్చింది ? అసలు విషయం ఏంటని తవ్వుకుంటూ పోతే ట్యాపింగ్ గోతులు కేసీఆర్ కాళ్ల కింద తేలాయ్. అంతే వ్యవహారం అక్కడ తో అయిపోయింది. యుద్ధం సద్దుమణగకపోతే పీకల మీదకొస్తుంది. వెనక్కి తగ్గడం తప్ప మరో దిక్కూదివాణం లేదు. ఇపుడు నడుస్తున్నదంతా ఆ కంటితుడుపు తతంగమే ! యుద్ధానికి దిగి ఆయుధం పారేసుకొని అడ్డంగా దొరికిపోయిన దొరకి… కింద పడినా లేచి నిలబడుతున్న ఠీవీకీ తేడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముందుముందు ఇదే నిలిచేది. గెలిచేది.
cherlapallifailure Posted June 30, 2015 Report Posted June 30, 2015 sannasi 6 pack chusi kooda neku doubt vachindha? @3$%
sampangi Posted June 30, 2015 Author Report Posted June 30, 2015 cinema choosthey telusthundi RR baahubali ena uncle?
biscuitRAJA000 Posted June 30, 2015 Report Posted June 30, 2015 iddaru kaadu governer a bahubali ee iddari chandrulu valla janalu bali
sampangi Posted June 30, 2015 Author Report Posted June 30, 2015 sannasi 6 pack chusi kooda neku doubt vachindha? @3$% fever vachindhi antaga.. govrnr ki hand ichada?
cherlapallifailure Posted June 30, 2015 Report Posted June 30, 2015 fever vachindhi antaga.. govrnr ki hand ichada? farmhouse lo WE pollam dunadu anta anduke fever ani T news lo chepadu @3$%
sampangi Posted June 30, 2015 Author Report Posted June 30, 2015 farmhouse lo WE pollam dunadu anta anduke fever ani T news lo chepadu @3$% eddula bandi ki stephen koduku ni katti dunnada?
sampangi Posted June 30, 2015 Author Report Posted June 30, 2015 iddaru kaadu governer a bahubali ee iddari chandrulu valla janalu bali gov ni bali chesaru center degarra ani news vachai ga uncle..
vaade_veedu Posted June 30, 2015 Report Posted June 30, 2015 Kcr ki experience ledu ysr lantollu correst ittanti poltics ki
Recommended Posts