Jump to content

Recommended Posts

Posted

Maa Jagan anna vastey hyderabad ey block ayindi lavda


brahmi%20laugh.gif

 

kottesam uncle indhulokuda kottesam manam pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

janalani denga pettataniki thappa ee rallys valla vache rupayi upayogam ledu!!!

Posted

Lol sagam regular traffic inko sagam em jaruguthunda chuddam ani vochi untaru

Posted

Lol sagam regular traffic inko sagam em jaruguthunda chuddam ani vochi untaru


Lol

pawan-kalyan-trivikram-laugh-gif.gif
Posted

Lol sagam regular traffic inko sagam em jaruguthunda chuddam ani vochi untaru

lol.1q
Posted

జానా ఇంటికి టీఆర్ఎస్ ఎంపీ వినోద్
కొడుకు కోసం జానా పార్టీ మారే చాన్స్: కాంగ్రెస్ వర్గాలు
print_icon.gif

 
 
  • సీఎల్పీ నేత జానారెడ్డితో బుధవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ భేటీ కావడం కలకలం రేపింది. జానా నివాసానికి బుధవారం వచ్చిన వినోద్‌.. ఆయనతో 10 నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడానికి జానారెడ్డిని కలిసినట్లు ఆయన చెబుతున్నారు. కానీ...ఈ భేటీపై కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జానారెడ్డి కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా టీఆర్‌ఎస్‌నే వెనుకేసుకొస్తున్నారంటూ పార్టీలో విమర్శలున్నాయి. అసెంబ్లీలోనూ ఆయన వ్యవహారం కేసీఆర్‌కు మద్దతుగా ఉంటోందన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కేసీఆర్‌ను ఉద్దేశించి ‘ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడారో మాకు తెలియదు’ అంటే టీపీసీసీ కార్యాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కూడా జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సొంత పార్టీ నేతను వెనుకేసుకురావాల్సిందిపోయి... భట్టినే తప్పు పట్టే విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు విస్తుపోయారు. అంటే ఒకరకంగా జానా సీఎంకు మద్దతుగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల...జానారెడ్డి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీ మారవచ్చని.. లేకపోతే కుమారుడికి మార్గనిర్దేశనం చేయవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ వినోద్‌.. జానాను కలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకుందోనని కాంగ్రెస్‌ నేతలు ఆరా తీస్తున్నారు

 

Posted

తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖల్లాస్!
ఉధృతంగా టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌కు సీనియర్ల చెయ్యి
print_icon.gif

 
 
  • జాబితాలో దానం, నందీశ్వర్‌గౌడ్‌!
  • సుదర్శన్‌రెడ్డిపైనా అనుమానాలు
  • సీఎంతో మాజీ ఎంపీ విఠల్‌రావు భేటీ
  • నెల రోజులుగా పార్టీకి ముఖేశ్‌ దూరం
  • డీఎస్‌ది అవకాశవాద రాజకీయం
  • ఆయనకు ఎంతో గుర్తింపు ఇచ్చాం
  • ఓడిపోయినా పదవులు ఇచ్చాంఆయన సూచించిన మహిళకే ఎమ్మెల్సీదిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజం
 
హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ఖాళీ అయిపోతోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో చావుదెబ్బ తిన్న ఆ పార్టీకి ఇక్కడా కష్టాలు తప్పడంలేదు. సీనియర్‌ నేతలు ఒక్కరొక్కరే పార్టీని వీడుతున్నారు. కలకాలం పార్టీ బరువును మోస్తారనుకున్న సీనియర్‌ నేతలే కాడి పారేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష్‌’కు సరెండరైపోతున్నారు. తాజాగా.. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరిక అంశం పార్టీని మరింత కుదిపేస్తోంది. డీఎస్‌తో పాటే మరికొంత మంది నేతలు కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దానం, డీఎస్‌ మధ్య సత్సంబంధాలున్నాయి. డీఎస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందున... తాను గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ ఒకే సామాజిక వర్గం. పైగా పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. పార్టీలో ‘రెడ్డి’ వర్గానికి పెద్ద పీట వేసి, బీసీ వర్గాలను అణదొక్కాలన్న ‘స్ర్టాటజీ’ ప్రారంభమైందంటూ వీరు చెబుతూ వస్తున్నారు. ఇలా బీసీలకు స్థానం లేనప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనమేమిటన్న భావనతో దానం కూడా డీఎస్‌ వెంటే టీఆర్‌ఎస్‌లో చేరవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మెదక్‌ జిల్లాలో మరో కీలక బీసీ నేత నందీశ్వర్‌గౌడ్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారన్న వార్తలున్నాయి. నిజామాబాద్‌ జిల్లాకే చెందిన మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి కూడా డీఎస్‌తోపాటు టీఆర్‌ఎస్‌ తీర్థంపుచ్చుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మాజీ ఎంపీ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత విఠల్‌రావు బుధవారం సీఎంను కలిశారు. జిల్లా సమస్యలపై కలిసినట్లు చెబుతున్నప్పటికీ... ఈయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే... తనకు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. కానీ సీఎం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని తెలుస్తోంది. ఇక పార్టీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సీఎంను కలిసినట్లు, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బుధవారం టీవీ చానెళ్లలో స్ర్కోలింగ్‌లు ప్రసారమయ్యాయి. అయితే తాను పార్టీని వీడేది లేదంటూ ఆయన మీడియాకు చెప్పారు. ఏమైనా రంగారెడ్డిపై కూడా సందేహాలున్నాయంటూ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కూడా ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరుతారన్న వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. కానీ తాను పార్టీ మారేది లేదని ముఖేశ్‌ స్పష్టం చేయడం విశేషం. ఇలా సీనియర్‌ నేతలంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతుండడం.. మిగిలినవారిలో ఆందోళన కలిగిస్తోంది. నేతలు వరుసగా వలసపోతున్నా.. అధిష్ఠానం నష్ట నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కనీసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ కూడా డీఎస్‌తో మాట్లాడలేదని తెలిసింది. టీపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నా... వీరి మాట వినే పరిస్థితుల్లో జంప్‌ జిలానీలు లేరని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆనాడే మొదలైంది...
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. నలుగురు ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రెడ్యానాయక్‌, కె.యాదయ్య, కోరం కనకయ్యతోపాటు కేఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, జగదీశ్‌రెడ్డి, రాజలింగం వంటి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పెద్ద మొత్తంలో పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం... పార్టీలో సంచలనం రేపింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ నుంచే ఇంత పెద్ద స్థాయిలో వలసలు చోటు చేసుకోవడంతో పార్టీ అధిష్ఠానమే ఆందోళనకు గురైంది. అయితే తర్వాత వలసలు లేకపోవడంతో అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు డీఎస్‌ ఉదంతంతో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఉలిక్కిపడుతోంది. 
 
 డిగ్గీరాజా మండిపాటు..
 ‘బొత్స, డీఎస్‌ లాంటివారు ఈ స్థాయికి వచ్చారంటే కారణం కాంగ్రెస్‌. ఇద్దరూ పీసీసీ అధ్యక్షులుగా, మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’ అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయినా సీనియర్‌ నాయకుడైన డి.శ్రీనివాస్‌ పార్టీని వీడుతారని తాననుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఆయన వీర విధేయుడని, పార్టీ కూడా డీఎస్‌ సేవలకు తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, పార్టీలోనూ ముఖ్యమైన స్థానాన్ని కట్టబెట్టామని దిగ్విజయ్‌ చెప్పారు. ఈసారి మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న పార్టీ విధాన నిర్ణయంలో భాగంగా డీఎస్‌ నామినేట్‌ చేసిన మహిళకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చామన్నారు. ఈసారి మహిళకు అవకాశం ఇస్తున్నామని తాను డీఎస్‌కు ముందుగానే చెప్పానన్నారు. కాగా, పార్టీలో తన ఎదుగుదలను దిగ్విజయ్‌ సింగ్‌ అడ్డుకుంటున్నారని డీఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డీఎస్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఒకవేళ ఆయన అందుకు వ్యతిరేకంగా భావిస్తుంటే చింతిస్తున్నానన్నారు. డీఎస్‌ పార్టీ వీడేందుకు నేనే కారణమైతే పార్టీ అధ్యక్షురాలు సోనియా నాపై చర్యలు తీసుకుంటారని దిగ్విజయ్‌ వ్యాఖ్యానించారు. 

 

Posted

scrap antha TRS lo ki pothey.....TDP ki adi added advantage..........RR ni future TG leader ni chesina lafangi.........Opposition TDP, RR thapinchi TG ki options lev .......lol lafangies

×
×
  • Create New...