Jump to content

Recommended Posts

Posted

ఏపీలో కిలో కందిపప్పు రూ.97.40. తెలంగాణలో రూ.110. రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు కొనుగోలుకు రెండు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్న ధర ఇది. రెండింటి మధ్య వ్యత్యాసం 12 రూపాయల 60 పైసలు. ఇది ఒక్క కిలోకు మాత్రమే. ఈ ధరకు 7 మెట్రిక్‌ టన్నుల కందిపప్పును తెలంగాణ ప్రభుత్వ కొనుగోలు చేయనుంది. ఈమేరకు ఇప్పటికే 300 లారీల కందిపప్పు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ధరలో తేడా కారణంగా సుమారు 13 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం నష్టపోనుంది. ఈవిధంగా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. అధికారుల తప్పిదాలతోపాటు రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్టు తెలుస్తోంది. కందిపప్పు కొనుగోలుకు తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ గత నెలలో టెండర్లు పిలిచింది. అయితే గతంలో మాదిరిగా ఈప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లకుండా కేవలం బాక్స్‌ టెండర్లను పిలిచారు. అంతేకాకుండా కొత్తవారు టెండర్లు వేసే అవకాశం లేకుండా కోటి రూపాయల ఈఎండీ, మరో కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపించాలనే షరతు పెట్టారు. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేకపోయారని సమాచారం. ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను పిలువకపోవడంతో ఇతర రాష్ర్టాల కాంట్రాక్టర్లూ పాల్గొనలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే... అక్కడి పౌర సఫరాల కార్పొరేషన్‌ అధికారులు ఎన్‌సీడీఎక్స్‌ ద్వారా రివర్స్‌ ఆక్షన్‌ విధానంలో పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించారు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన సంస్థ అతి తక్కువకు కోట్‌చేసి టెండర్‌ను దక్కించుకుంది. దీంతో అక్కడ కిలో కందిపప్పు 97.40 రూపాయలకే అధికారులు కొనుగోలు చేయగలిగారు. 

 
మంత్రి పేషీ ద్వారా పనిచేయించుకున్నారు!

తెలంగాణలో కందిపప్పు సేకరణకు అధికారులు పిలిచిన టెండర్లలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేసి కొందరు వ్యక్తులకే కాంట్రాక్టు దక్కేలా చేశాయి. దీంతో కిలో కందిపప్పు 110 రూపాయలకు సరఫరా చేసేందుకు ఆరుగురు కాంట్రాక్టర్లకు టెండర్‌ను కట్టబెట్టినట్టు సమాచారం. తెలంగాణ కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే.. వారికి టెండర్లను కట్టబెట్టినట్టు అధికారులే అంగీకరిస్తున్నారు. కానీ దీనివల్ల పెద్దమొత్తంలో నిధులు కాంట్రాక్టర్ల పాలవుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. అయితే దీనివెనుక పెద్దఎత్తున రాజకీయ లాబీ నడిచినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మంత్రి పేషీ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చిన కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Posted

idhi kooda andhra valla kutra antaru emo  CITI_c$y   CITI_c$y   CITI_c$y CITI_c$y   CITI_c$y   CITI_c$y

Posted

thintey TS vaadey thinaali man fair enough indhulo thappu emundhi

Posted

lol hehehe chethakaani vaadiki emi vunna lenaatle 2wbw75f.gif

 

j76m34.jpg

 

 

×
×
  • Create New...