solman Posted July 6, 2015 Report Posted July 6, 2015 సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుమార్తె కోవ అరుణ ఓడిపోయారు. కోవ అరుణ ఓటమిని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ స్థానిక నేతలు ఆసిఫాబాద్లో బెదిరింపుల పర్వానికి తెరతీశారు. ఎన్నిలకు ముందు పట్టణంలోని సందీప్ నగర్, హడ్కో కాలనీలకు మంజూరు చేసిన విద్యుత్ మోటార్లను తిరిగిచ్చేయాలని హుకుం జారీ చేశారు. అంతేకాక తమ వద్ద డబ్బులు తీసుకుని ఎన్నికల్లో ఓటేయలేదని కొన్ని కాలనీల్లో టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగారు. అయితే సహనం నశించిన పట్టణ ప్రజలు టీఆర్ఎస్ నేతలకు ఎదురుతిరిగారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బోరు బావుల కోసం ఇచ్చి న మోటార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగిచ్చే ప్రసక్తే లేదని ప్రజలు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఓటేయలేదని తమకు బెదిరింపులకు గురిచేస్తున్నారని సందీప్నగర్ కాలనీకి చెందిన మహిళలు శ్రీదేవి, సురేఖ, తాహెరాబేగం, పద్మ, జాకీరాబేగం, సులోచన, రిజ్వానా, లక్ష్మి, నాగమణి, లలిత పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్సాబ్ వాడీ వాసులు ఆదివారం రాత్రి స్థానిక టీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లి తమ నిరసన తెలిపారు.
Recommended Posts