Jump to content

Magadheera audio release 0n 28th june


Recommended Posts

Posted

main.php?g2_view=core.DownloadItem&g2_itemId=1308644&g2_serialNumber=2

రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మగధీర చిత్రం ఆడియో ఫంక్షన్ ఈ నెల ఇరవై ఎనిమిది సాయింత్రం జరగనుంది. ఈ పంక్షన్ కి వేదిక శిల్పకళా వేదిక కానుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలంతా ఈ పంక్షన్ కి ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించటానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి,అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, బన్నీ, నాగబాబు తో సహా ఫ్యామిలీ మెంహర్స్ మొత్తం ఈ పంక్షన్ కి అటెండుకానున్నారని సమాచారం.

ఇక ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రలో చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు.

అలాగే మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. బడ్జెట్ కూడా దాదాపు ముఫ్ఫై ఎనిమిది కోట్లు దాకా అయిందని అంతటా వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరో ముఖ్య విశేషం ఏమిటంటే 'బంగారు కోడిపెట్ట...' రీమిక్స్‌ గీతంలో చిరంజీవి , చరణ్‌ కలిసి నృత్యం చేశారు. 'మగధీర'లో శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కథ: వి.విజయేంద్రప్రసాద్‌, స్త్టెలింగ్‌: రమా రాజమౌళి , సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌.

Posted

ee pichi pushpam cinema ki antha scene avasaramaa  i49547_snl1.gif

×
×
  • Create New...