solman Posted July 8, 2015 Report Posted July 8, 2015 కేసీఆర్ మాకు ఆదర్శం-ఆయన చెప్పినట్టే ఇళ్ల ముందు చెత్త పోస్తాం పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా వేతనాలు పెంచే వరకు పురపాలక శాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెను విరమించరని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఈ విషయంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును ఆదర్శంగా తీసుకుని పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. గతంలో పురపాలక ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు ఉద్యమ నాయకుడుగా ఉన్న కేసీఆర్ ఏమి చెప్పారో... ఇప్పుడు దానిని తాము తూచ తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ‘ఎవరైతే సమస్యలను పరిష్కరించాలో వారే పరిష్కరించకపోతే వాళ్ల ఇళ్ల ముందు చెత్త వేయాలి’ అని ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని కార్మిక సంఘాల నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు తాము కూడా అదే చేయనున్నామని ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారులు ఇళ్ల ముందు చెత్త వేయనున్నామని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన తరవాత కార్మికుల తరఫున సీఐటీయు నేత పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ నేత ఏసురత్నం, హెచ్‌ఎంఎస్ నేత రామారావు, బీఎంఎస్ నేత శంకర్, ఐఎఫ్‌టీయూ నేత కృష్ణ, టీఎన్‌టీయూసీ నేత బోస్, ఏఐయూటీయూసీ నేత సుధీర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా కార్మికులకు రూ.14,170లు వేతనం కింద చెల్లించాల్సిందేని డిమాండ్ చేశారు. వారి జీతాల నుంచి మినహాయించుకుంటున్న పీఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమా చేయాలని, పర్మినెంట్ చేయాలని ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొన్న మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి జి. గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, పురపాలక శాఖ సంచాలకుడు జనార్దనరెడ్డిలు ఎంత సేపు సమ్మెను విరమించమని అడగటం తప్పా.. మరో మాట మాట్లడటం లేదని విమర్శించారు. ‘సీఎం అందుబాటులో లేరు. వచ్చిన తరవాత మీ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం’ అని మంత్రులు చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పాలడుగు భాస్కర్ అన్నారు. సీఎం తెలంగాణలోనే ఉన్నారు కదా? అని ఆయన ప్రశ్నించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ రోడ్లు శుభ్రం చేస్తూ... ఫొటోలకు ఫోజులు ఇచ్చిన నేతలు, అధికారులు ఇప్పుడు రోడ్లు మీదకు వచ్చి శుభ్రం చేయాలని కార్మిక నేతల సవాలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీజేఎల్పీ నేత కే లక్ష్మణ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
Captain_nd_Coke Posted July 8, 2015 Report Posted July 8, 2015 vaadi medicine vaadikey Sac bbali showing anta ga nu
Chitti_Robo_Rebuilt Posted July 9, 2015 Report Posted July 9, 2015 gif adirindi nuvvu desigif nundi copy cheysthey gif open cheysi copy chey man peddagaa untadi
salt_pepper Posted July 9, 2015 Report Posted July 9, 2015 nuvvu desigif nundi copy cheysthey gif open cheysi copy chey man peddagaa untadi nee gifs collection yekada untadi
Recommended Posts