tom bhayya Posted July 10, 2015 Report Posted July 10, 2015 నేనెవర్నీ?? అంటూ ఆగ్రహంతో బాహుబలి వేసిన ప్రశ్నకు చరిత్రకారులు ఇస్తున్న సమాధానం.. బహుధాన్యపురం లేదా పోధనపురంగా ఒకప్పుడు పిలిచిన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతానికి రాజు.. అని! అవును!! మహాయోధుడు బాహుబలి అడుగుజాడలు బోధన్ ప్రాంతంలో ఉన్నాయి! బోధన్ రాజధానిగా దక్షిణాపథాన్ని పాలించిన పరాక్రమశూరుడే బాహుబలి! ఐదు వందల ఇరవై ఐదు ధనుస్సుల ఎత్తయిన బాహుబలి విగ్రహం కూడా బోధన్ ప్రాంతంలో ఉండేదని.. అది కాలగర్భంలో కలిసిపోయిందని చరిత్రకారుల వివరణ! బాహుబలికి చెందిన విగ్రహం ఇప్పటికీ నిజామాబాద్ మ్యూజియంలో కనిపిస్తుంటుంది! దాని స్ఫూర్తితోనే ప్రస్తుతం శ్రావణ బెళగొళలో భారీ విగ్రహం నిర్మించారని చరిత్రను బట్టి తెలుస్తున్నది! తన అన్న భరతుడికి.. బాహుబలికి మధ్య జరిగిన పోరాట గాథలు ఇప్పటికీ జైన గ్రంథాల్లో కనిపిస్తాయి! బోధన్, నమస్తే తెలంగాణ: బాహుబలి... మహా యోధుడు... ఒకనాటి బహుధాన్యపురం లేక పోధనపురం నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌ను, రాజధానిగా చేసుకొని దక్షిణాపథాన్ని పాలించిన పరాక్రమశూరుడు. ఆయన తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. జైన చారిత్రకుల ప్రకారం బాహుబలి నాడు పరిపాలించిన పౌధనపురమే(వాడుకలో పోధనపురం) నేటి బోధన్. బాహుబలి శిల్పాలు, జైనమత ఆధారాలు నిజామాబాద్ మ్యూజియంలోనూ ఇప్పటికీ ఉన్నాయి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బాహుబలి బోధన్ అటవీ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. 525 ధనుస్సుల ఎత్తైన బాహుబలి విగ్రహం బోధన్ ప్రాంతంలో ఉండేదని, అది కాలగర్భంలో కలిసిపోయిందని, ప్రస్తుతం శ్రావణబెళగొళ విగ్రహానికి అదే స్ఫూర్తి అని చరిత్రకారులు చెప్తున్నారు. దక్షిణాపథాన్ని పాలించిన బాహుబలి చరిత్ర ప్రకారం.. నేటి బోధన్ రాజధానిగా ఉన్న దక్షిణాపథాన్ని బాహుబలి పాలించుకోవటానికి ఆయన తండ్రి వృషభనాథుడు అనుమతి ఇస్తాడు. ఉత్తర భారతంలో అనేక రాజ్యాలు జయించిన భరతుడి కన్ను సవతి తమ్ముడు బాహుబలి పాలిస్తున్న రాజ్యంపై పడుతుంది. బాహుబలి లొంగకపోవటంలో భరతుడు యుద్ధం ప్రకటిస్తాడు. భరతుడు గొప్ప చక్రవర్తి.. అసలు ఈ రాజు పేరిటనే భారతదేశం అన్న పేరు వచ్చింది.. అని జైన గ్రంథాలు చెప్తున్నాయి. శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుడు పాలించటంవల్ల ఈ దేశానికి ఆ పేరు వచ్చిందన్న విషయాన్ని జైనులు అంగీకరించరు. ఇక, అన్నదమ్ములు ఇద్దరూ యుద్ధానికి సన్నాహాలు చేస్తుండటంతో... యుద్ధంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పదని భావించిన ఇరు రాజ్యాల మంత్రులు ఒక అంగీకారానికి వస్తారు. సైన్యాల మధ్య యుద్ధాలు కాకుండా, ఇద్దరు రాజులు నిరాయుధంగా యుద్ధం చేయాలని, ఆ యుద్ధంలో ఎవరు విజేతగా నిలిస్తే ఓడిన రాజు రాజ్యాన్ని అప్పగించాలని నిర్ణయిస్తారు. ఈ ఒప్పందం మేరకు భరతుడు, బాహుబలి మధ్య ముందుగా దృశ్య యుద్ధం, జల యుద్ధం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భుజబల సంపన్నుడైన బాహుబలి విజేతగా నిలుస్తాడు. అనంతరం జరిగిన మల్ల యుద్ధంలోనూ ఒక దశలో భరతుడిపై బాహుబలి పైచేయి సాధిస్తాడు.. భరతుడిని తన బాహువుల మధ్య బంధిస్తాడు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు బాహుబలిలో పరివర్తన వస్తుంది. తన తండ్రి త్యజించిన ఈ తుచ్ఛమైన రాజ్యంకోసం అన్నను వధించటం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఆయనలో ఉదయిస్తుంది. బాహుబలి పిడిగుద్దులతో తన చావు తప్పదని చివరికి భరతుడు కూడా ఆందోళన చెందుతుండగా.. బాహుబలి యుద్ధం నుంచి వైదొలుగుతాడు. కిరీటం త్యజించి, రాజ్యాన్ని పరిత్యజించి అడవిలోకి వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తాడు. బోధన్ ప్రాంతంలోని కీకారణ్యంలో... పోధన రాజ్యంలోని కీకారణ్యంలో బాహుబలి ఘోరమైన తపస్సును ఆచరించినట్లు చరిత్రకారులు అంటున్నారు. నాడు ఇంద్రపురిగా పిలవబడుతున్న నేటి నిజామాబాద్ ప్రాంతంలోనే ఈ తపస్సు చేసినట్లు వారు చెప్తున్నారు. బాహుబలుడు కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్లపై నిలబడి) తపస్సు ఆచరించాడు. ఆ ఘోర తపస్సులో బాహుబలి కాళ్లకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. ఈ రూపాన్ని చూసే అన్న భరతుడు తమ్ముడు బాహుబలిపై ఎనలేని గౌరవంతో దేశంలోనే అతి పొడవైన బాహుబలి విగ్రహాన్ని తయారుచేయించాడన్నది చరిత్రకారుల భావన.. ఆ విగ్రహాన్ని ఇంద్రగిరి(నిజామాబాద్) కొండపై ప్రతిష్టించేందుకు యత్నించి విఫలమైనట్లు తెలుస్తున్నది. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు జైన మతానికి సంబంధించిన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇక్షాకు వంశానికి ఆయనే ఆద్యుడని జైనుల ప్రగాఢ విశ్వాసం. సుమంగళ, సునంద అనే ఇద్దరు రాకుమార్తెలను వివాహమాడాడాయన. సుమంగళకు 99మంది కుమారులు, ఒక కుమార్తె బ్రహ్మీ జన్మించింది. 99 మందిలో పెద్ద కుమారుడు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించినట్లు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తున్నది. వృషభనాథుడు చాలాకాలం రాజ్యాధికారంలో ఉన్నాడు. కాల క్రమేణా ఐహిక జీవితంపై విరక్తితో తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచి, సన్యాసం స్వీకరించి, అడవులకు వెళ్లిపోయాడు. అనేక ఏండ్లకు జ్ఞానోదయం పొందాడు. దీనినే జీనత్వం పొందడం అంటారు. అనంతరం దేశాటనచేస్తూ సత్యాలను తెలియజేస్తూ ప్రజలకు చేరువయ్యాడు. అనేక మంది వృషభనాథుడి మతాన్ని స్వీకరించారు. అదే జైనమతంగా పరిఢవిల్లుతున్నది. వృషభనాథుడి కుమారుల్లో పెద్ద వాడైన భరతుడు అనంతరం కాలంలో మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను జయించి వాటి రాజులను సామంతులుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన 98 మంది తమ్ముళ్లు రాజ్యాన్ని వదిలేసి తమ తండ్రి వద్దకు వెళ్లి ఆయన శిష్యులుగా చేరిపోయారని జైన ఇతిహాసం చెబుతున్నది. 525 ధనుస్సుల ఎత్తయిన విగ్రహం.. బాహుబలి విగ్రహాన్ని 525 ధనుస్సుల పొడువుతో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంత పెద్ద భారీ విగ్రహాన్ని భరతుడు నాటి పోదనపురం (నేటి బోధన్)లో నిర్మించాడు. ప్రస్తుతం ఇంత పెద్ద భారీ విగ్రహం ఆనవాళ్లు బోధన్ ప్రాంతంలో కనపడటంలేదు. కీస్తు పూర్వం 6వ శతాబ్దానికి వందల ఏళ్లనా డే బోధన్ ఒక మహాపట్టణంగా ఉండేదని చరిత్ర చెబుతున్న విషయం. అటువంటి బోధన్‌లో ఉన్న బాహుబలి విగ్రహాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి జైనులు బోధన్‌కు వచ్చేవారట... ఈ బాహుబలి విగ్రహానికి కుక్కుటేశ్వరుడు అన్న పేరు కూడా ఉండేది. ఇప్పటికీ జైన అవశేషాలు, జైన విగ్రహాలు బోధన్‌లో కనపడుతాయి. కొన్ని జైన ఆలయాలు హిందూ దేవుళ్ల ఆలయాలుగా రూపాంతరం పొందాయి. బోధన్ తహసీల్దార్ కార్యాలయం, గాంధీ పార్కు తదితర ప్రాంతాల్లో జైన విగ్రహాలు ఉన్నాయి. నవీపేట్ మండలం బినోలాలో బాహుబలి విగ్రహం ఇప్పటికీ ఒక ఆలయం వద్ద ఉంది. శ్రావణ బెళగొళ విగ్రహానికి స్ఫూర్తి.. ప్రస్తుతం కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో ఉన్నది బాహుబలి విగ్రహం. గోమఠుడుగా పేరొందిన చాముండరాయుడు ప్రతిష్ఠించటంతో దీన్ని గోమఠేశ్వర విగ్రహం అనీ పిలుస్తారు. బోధన్ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న బాహుబలుడి విగ్రహాన్ని చూసే దీన్ని నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు.
tom bhayya Posted July 10, 2015 Author Report Posted July 10, 2015 sarle i called u.. left VM VM aithey raaley gtalk lo ping cheyu
JammichettuPandu Posted July 10, 2015 Report Posted July 10, 2015 Manodu Antey saripodu caste kuda cheppali
Chitti_Robo_Rebuilt Posted July 10, 2015 Report Posted July 10, 2015 Manodu Antey saripodu caste kuda cheppaliLolll
tom bhayya Posted July 10, 2015 Author Report Posted July 10, 2015 Manodu Antey saripodu caste kuda cheppali TS vallaki caste theliyavu kadhaa
Silver_mani Posted July 10, 2015 Report Posted July 10, 2015 Manodu Antey saripodu caste kuda cheppali lol
ravula Posted July 10, 2015 Report Posted July 10, 2015 TS vallaki caste theliyavu kadhaa Peekinav le kodi bochu
Recommended Posts