Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్‌ నగరానికి ఉన్న పాత నిర్వచనాలు అన్నిటినీ మరచిపొండి. ఇప్పుడు సరికొత్త స్టయిల్‌లో భాగ్యనగరానికి నిర్వచనం ఇవ్వడానికి తెలంగాణ సర్కార్‌ రంగం సిద్ధం చేస్తోంది. నగరానికి ఇక మనం హైదరా'బార్‌' అని పేరు పెట్టుకుంటే చాలా సూటబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సర్కారు ప్లాన్‌ చేస్తున్న నూతన మద్యం విధానంలో గరిష్టంగా.. హైదరాబాదు మార్కెట్లో మరింత మద్యం అమ్మకాలు పెంచడమూ, మరింత ఫారిన్‌ లిక్కరు ప్రవాహాన్ని పెంచడమూ మీదనే దృష్టి సారించబోతున్నారు. 

ఇప్పటిదాకా ఎంత జనాభా దామాషాలో ఒక్కొక్క మద్యం దుకాణం కేటాయించాలనే లెక్కలను ఈసారి తిరగరాస్తున్నారు. రాజధాని నగరానికి సంబంధించి మాత్రం అన్నీ కొత్త రూల్సే రాబోతున్నాయి. ఇక్కడ ప్రతి 25 వేల మందికి ఒక వైన్‌షాప్‌ వచ్చేలా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటిదాకా తెలంగాణ అబ్కారీ శాఖకు గరిష్టంగా ఆదాయం హైదరాబాదు నగర పరిధినుంచే వస్తున్న నేపథ్యంలో ఇదే నగరంలోనే మద్యం అమ్మకాల్ని మరింత పెంచాలని ప్లాన్‌చేస్తున్నారు. ఆ మేరకు జనంతో మరింత ఎక్కువ తాగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. 

జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లుండగా 505 మద్యం దుకాణాలు, 509 బార్లు ఉన్నాయి. మరో 103 దుకాణాలకు అనుమతి ఉంది గానీ, లైసెన్సు ఫీజు ఎక్కువని ఎవ్వరూ తీసుకోలేదు. నగర పరిధిలో ఫీజు కాస్త తగ్గించాలని యోచిస్తున్నారు. ప్రతి 25వేల మందికి ఒక వైన్‌షాపు, ప్రతి 50 వేల మందికి ఒక బారు అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వ మద్యాశయం. పైగా ప్రధాన ప్రాంతాల్లో అంతర్జాతీయ బ్రాండ్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ఆదేశించబోతున్నారు. ఆ రీతిగా నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్నారు. 

అన్నిటికంటె మించిన ట్విస్టు ఏంటంటే.. మద్యం దుకాణాలు, బార్లు ఒక్కో గంట అదనంగా తెరచి ఉంచేలా చట్టం సవరించాలని కూడా ప్రభుత్వం అనుకుంటున్నదిట. ఇలాంటి చర్యలవల్ల.. ఇక నగరజీవులు విచ్చలవిడిగా తాగి తరించవచ్చునన్నమాట. అయినా సర్కారు పట్టించుకోని సంగతి ఇక ఒకటే మిగిలి ఉంది. రాత్రి వేళల్లో పోలీసులు తాగుబోతు డ్రైవింగ్‌ చేసే వారిని తనిఖీ చేయడం మానేస్తే.. తాగేవారు మరింత పెరుగుతారు!!

Posted

deeni kanna external link eyadam better emo elli chaduvkuntaru PK-1_1.gif?1344496355

Posted

endoooo  mana daggara janalani control cheyali ani chustharu ..... full gaaa open cheyandi vayaa anni states lo and law kuda full gaa implement cheyandi drink and drive untee lopala veyandi anthy....

 

 

vamarica lo sudadam leedhaa , kuragayala ki 5-10 miles potham , adhee mandu ki antha dooram avasaram ledhu gaaa

Posted

updated ... indaka paste kale sarigga

×
×
  • Create New...