porsche911 Posted July 23, 2015 Report Posted July 23, 2015 Allah ante muslim aa?? dedh dimak gallu unnaru it means the God... and its in the Bible
4Vikram Posted July 24, 2015 Report Posted July 24, 2015 Allah ante muslim aa?? dedh dimak gallu unnaru it means the God... and its in the Bible murkulu murkamgane matladutaru rao garu vadileyandi
ParmQ Posted July 24, 2015 Report Posted July 24, 2015 అల్లా దయతోనే తెలంగాణ.. నేను తెలంగాణ వాడినే కాదు.. మీవాడినీ.. ఇఫ్తార్ విందులో ముస్లింలతో కేసీఆర్ (13-Jul-2015) మనది గంగా జమునా కలయిక తెలంగాణ సంస్కృతిని గాంధీజీయే పొగిడారు మధ్యలో కొందరు సంస్కృతిని దెబ్బ తీశారు భవిష్యత్తులో మరింత ఘనంగా ఇఫ్తార్ అని వెల్లడి హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉద్యమంలో ఎంతమంది పోరాటం చేసినా అల్లా దయ, ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధ్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నేను తెలంగాణ వాడినే కాదు.. మీ వాడిని కూడా’ అంటూ ముస్లింలకు భరోసా ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ‘దావత్-ఎ-ఇఫ్తార్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. ‘మనది గంగా జమునా కలయిక (గంగా జమునా తెహజీబ్)’ అంటూ అభివర్ణించారు. ‘‘ఒకప్పుడు నిజాం హయాంలో రంజాన్ వేడుకలు తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగేవి. నిజాం రాజు తెలంగాణ సంస్కృతిని తీర్చిదిద్దిన తీరును చూసి 1923లో హైదరాబాద్‌కు వచ్చిన మహాత్మా గాంధీ కూడా ఎంతో ప్రశంసించారు. ఉత్తర భారత ప్రజలు తెలంగాణ సంస్కృతిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. మధ్యలో మన సంస్కృతిని కొందరు దెబ్బకొట్టారు. బలవంతంగా ఇతర సంస్కృతులను అంటగట్టారు. నాటి తెలంగాణ సంస్కృతిని పునః నిర్మించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది. తెలంగాణకు సీఎంగానే కాదు. మీ బిడ్డగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముస్లిం వర్గానికి చాలా తక్కువ చేశామని, ముందు ముందు మరెంతో చేస్తామని ప్రకటించారు. రంజాన్ సందర్భంగా లక్ష మందికి ఉచితంగా దుస్తులను పంపిణీ చేశామని, మరో లక్షన్నర మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు చేసింది చాలా చిన్నదని, భవిష్యత్‌లో మరింత భారీగా చేస్తామన్నారు. నీటి సమస్యలు ఇప్పుడు తెలంగాణను వెంటాడుతున్నాయని, మనకు రావాల్సిన వాటా విషయంలో పక్క రాష్ట్రం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని చెప్పారు. అయినా సరే త్వరలోనే నీటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ రాయబారి హసన్ నూరియాన్, టర్కీ రాయబారి మురాద్ ఉమర్ ఉగ్లూ ప్రత్యేకంగా హాజరయ్యారు. అలాగే, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసదుద్దీన్ ఒవైసీ, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ఇఫ్తార్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకేఖాన్, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో అధికారులు ఇఫ్తార్ విందుకు పలువురు పోలీస్ అధికారులు ముస్లిం సంప్రదాయ దుస్తులైన షేర్వానీలతో హాజరయ్యారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు షేర్వానీలో సందడి చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని సైతం షేర్వానీలు ధరించి వచ్చారు. కార్యక్రమం ప్రారంభంలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ వేదికకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా వేదిక దిగి వెళ్లి ఆయనను వేదికపైకి తీసుకొచ్చారు. అంతకుముందు స్వామిగౌడ్‌కు ఏకే ఖాన్ షేర్వానీ గుండీ సరిగ్గా సర్దిపెట్టారు.
krisdevame Posted July 24, 2015 Report Posted July 24, 2015 Ante akkada meaning entante...jebulu kottevaadu, purseLu dongatanam chessevaadu, chain snatching chessevaadu veedu ani vacchi poye touristsKi hecharikaa....
Recommended Posts