Jump to content

Recommended Posts

Posted

మే 23 నుంచే ట్యాపింగ్ షురూ: ఏపీ ఉన్నతాధికారులు   #4H#

  • సుప్రీం ఆదేశాలతో గుట్టు రట్టు
  • విచ్చలవిడి ట్యాపింగ్‌ రుజువు!
  • ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేపై నిఘా
  • మాకు లభించిన ఆధారాలు కొన్నే
ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదు. అవన్నీ సంభాషణల రికార్డులు మాత్రమే’ అని పదేపదే చెప్పిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఇరుకున పడినట్లేనని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్యాపింగ్‌ చేశాం’ అని సెల్యులర్‌ ఆపరేటర్లు సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా చెప్పడం, కాల్‌ డేటా రికార్డులన్నీ సీల్డు కవర్‌లో సమర్పించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ట్యాపింగ్‌ గుట్టురట్టు కావడం ఖాయమని చెబుతున్నాయి. ట్యాపింగ్‌పై ఆదేశాలు జారీ చేసిన పోలీస్‌ అధికారులు ప్రత్యక్షంగా నిందితులు అవుతారని, ప్రభుత్వ ఆదేశాలతోనే వారు ఈ పని చేసినందువల్ల సర్కారు కూడా తప్పించుకోలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ట్యాపింగ్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు సంపాదించి పెట్టుకొన్న ఏపీ అధికారులు... వాటిని అధికారికంగా నిర్ధారించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మొత్తానికి... సర్వీస్‌ ప్రొవైడర్లు సుప్రీం కోర్టుకు వెళ్లడం వల్ల తమకు రెండు లాభాలు జరిగాయని ఏపీ అధికారులు చెబుతున్నారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌పై సమాచారాన్ని టెలికం సంస్థలు విజయవాడ కోర్టుకు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని అడ్డుకునే అధికారం ఎవ్వరికీ ఉండదు. సమాచారం ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం తమను అడ్డుకుంటోందని టెలికం కంపెనీలు సుప్రీం కోర్టుకే చెప్పాయి. తాము దొరికిపోతామన్న భయంతోనే టీ-సర్కార్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను హెచ్చరించిందని రుజువైంది. ట్యాపింగ్‌కు పాల్పడలేదని ఇంతకాలం చేస్తున్న వాదన అసత్యమని తేలిపోయింది’’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
ట్యాపింగ్‌లో కీలకం...
ఫోన్‌ ట్యాపింగ్‌పై ఏపీ పోలీసులు సేకరించిన ఆధారాల్లో పలు కీలకమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ప్రలోభపెట్టే ప్రయత్నిస్తున్నారంటూ మే 28వ తేదీన నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ తమకు ఫిర్యాదు చేశారని, దాని మేరకే దర్యాప్తు మొదలు పెట్టామని తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. కానీ... ఏపీ అధికారులు సేకరించిన ఆధారాల ప్రకారం మే 23వ తేదీనే తెలంగాణలోని టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఫోన్లు ఉన్నాయి. ‘‘స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఫోన్లు ట్యాప్‌ చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ, అంతకు ముందే ఈ పని మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను తెలంగాణ సర్కారు విచ్చలవిడిగా ట్యాప్‌ చేస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. ట్యాపింగ్‌కు సంబంధించి అధికారికంగా ఎన్ని ఆదేశాలు జారీ అయ్యాయో తెలియదు. మాకు మాత్రం కొన్ని దొరికాయి. ఇంకా... అనధికారిక సమాచారం ప్రకారం ట్యాప్‌ అయిన ఫోన్లు వందల్లోనే ఉన్నాయి. ఇప్పుడు టెలికం ప్రొవైడర్లు ఇచ్చే సమాచారంతో అవన్నీ నిర్ధారణ అవుతాయని ఆశిస్తున్నాం’’ అని ప్రభుత్వ ముఖ్యుడు ఒకరు తెలిపారు.
 
ఆ ముగ్గురు...
ట్యాపింగ్‌పై తెలంగాణ ఎస్‌ఐబీ విభాగం ఉన్నతాధికారి సజ్జనార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, హోం కార్యదర్శి వెంకటేశం సంతకాలతో జారీ అయిన ఆదేశాల ప్రతి ఏపీ అధికా రులకు లభించింది. ఈ పేర్లు బయటకు వచ్చాక శివధర్‌రెడ్డి సెలవులో విదేశాలకు వెళ్లారు. వెంకటేశం కూడా సెలవు పెట్టడంతో ఆయనను ఆ పదవి నుంచి మార్చి మరొకరిని నియమించారు. ఈ పత్రాలు బయటకు వచ్చాక ఏపీ, తెలంగాణ పోలీసు అధికారుల మధ్య అనధికారికంగా కొన్ని సమావేశాలు జరిగాయి. ‘‘ఏదైనా ఉంటే రాజకీయం గా చూసుకోవాలి. ఈ వివాదంలో పోలీస్‌ అధికారులను బలి చేయొద్దు’’ అని టీ అధికారులు ఏపీకి చెందిన అధికారులను కోరారు. వారు కూడా ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూసి... దానినిబట్టి అప్పుడు ఆలోచిద్దామని ప్రభుత్వ వర్గాలు బదులిచ్చాయి. ఇప్పుడు సుప్రీం ఆదేశంతో ట్యాపింగ్‌ కేసు బలపడిందని, సాక్ష్యాల సేకరణ సులువుగా మారిందని ఏపీ అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అంతిమంగా ఇది ఎవరి నెత్తికి చుట్టుకుంటుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

 

Posted

aa letters evo media lo chuisthe aipodhi  ga.. why nanchadam 2 months nundi brahmi%20RT.gif

Posted

aa letters evo media lo chuisthe aipodhi  ga.. why nanchnanchadam 2 months nundi
adam 2 months nundi brahmi%20RT.gif

 

 

Nanchadam......... then ................all big............ Thuusssssss
 

Posted

aa letters evo media lo chuisthe aipodhi  ga.. why nanchadam 2 months nundi brahmi%20RT.gif

font match chesi..print chesi..release cheyyali..chinna pilla ata ankuntunnava?

 

brahmi%20RT.gif

Posted

aa letters evo media lo chuisthe aipodhi  ga.. why nanchadam 2 months nundi brahmi%20RT.gif

 

 

memu oppukom.. Telecast chesina.. memu vinam

Posted

memu oppukom.. Telecast chesina.. memu vinam

vinaku akka

 

దొరికినట్లే! 

 

giphy.gif Journalism

Posted

KCR ne arrest cheyyali and evadu involve ayyaro andarini arrest cheyyali

×
×
  • Create New...